శ్రీకాకుళం

ప్రజలకు మంత్రి అచ్చెన్న సంక్రాంతి శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 12: జిల్లా ప్రజలు సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి సాంప్రదాయబద్దంగా జరుపుకోవాలని కోరారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్, శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి జిల్లా ప్రజానీకానికి, అధికార యంత్రాంగానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, జాయింట్ కలెక్టర్ చక్రధరబాబు, ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైకాపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కూడా శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

ముగిసిన సంక్రాంతి సంబరాలు
శ్రీకాకుళం(టౌన్), జనవరి 12: ముఖ్యమంత్రి చంద్రబాబుసంక్రాంతి సంబరాలను నిర్వహించాలన్న ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈనెల 10వతేదీ నుండి సంబరాలు నిర్వహించారు. గురువారంతో సంబరాలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి జిల్లాకలెక్టర్ పి.లక్ష్మీనృసింహం కుటుంబ సమేతంగా హాజరై సంబరాలను వీక్షించారు. ముందుగా పాఠశాల విద్యార్థినులతో జానపద నృత్యాలు, గీతాపాలన నిర్వహించారు. శ్రీరామ సంకీర్తన, మావుడూరి శ్రీనివాసరావు సోదరులచే శాస్ర్తియ సంగీతం వినిపించారు. బంకుపల్లి సాగర్, అనురాధ బృందంచే నిర్వహించిన భరతనాట్యం పలువురిని ఆకట్టుకుంది. చిన్న పిల్లలచే కర్రసాము నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రంగవల్లుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు బండారు చిట్టిబాబుకు స్వర్ణకంకణాన్ని మంత్రి అచ్చెన్నాయుడు తొడిగి సత్కరించారు. ఈకార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, ఎం.పి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, జెసి-2 పి.రజనీకాంతారావు, రామలింగస్వామి, స్వాతి సోమనాథన్, జగన్నాధంనాయుడు, పర్యాటక శాఖాధికారి నారాయణరావు పాల్గొన్నారు.