శ్రీకాకుళం

ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జనవరి 12: పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదు తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌ను నమోదుచేసి దర్యాప్తు చేయాలని ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ నెలవారీ నేర సమీక్షను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పండగ సందర్భంగా నేరాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున రోడ్లపై పోలీసు గస్తీని పెంచాలని, కొత్త వ్యక్తులు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి నేర విచారణ చేయాలన్నారు. ప్రతీ ఫిర్యాదుపై అలసత్వం లేకుండా వెంటనే స్పందించాలన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో తాగునీటి సదుపాయాన్ని కల్పించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కేసులనమోదు విషయమై అవగాహన కోసం శిక్షణ తరగతులు ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఇన్నోవేటివ్ ఐడియాస్‌ను అనే్వషించి ప్రత్యేక ఏ.పి.పిల కోసం ఇంజినీరింగ్ విద్యార్థుల సహకారంతో డెవలప్ చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు. నిపుణులతో ప్రమాదాల నివారణపై పోలీస్ సిబ్బందికి వాహనచోదకులకు శిక్షణ తరగతులను నిర్వహించాలని ట్రాఫిక్ డిఎస్పీకి ఆదేశించారు. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించని పక్షంలో వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రతీ సిఐ నెలకు 50కేసులు తక్కువ కాకుండా నమోదు చేయాలని ఆదేశించారు. వాహన తనిఖీలు నిర్వహించే వారు యూనిఫామ్ ధరించి వాహన చోదకులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి సంయమనం పాటించాలన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీబాధితులకు సహాయపడేందుకు ఇచ్ఛాపురం, సోంపేట, కాశీబుగ్గ సిఐలు అన్ని గ్రామాలను సందర్శించి బాధితుల వివరాలు వారికి అందుతున్న వైద్య సహకారం అంశాలను తెలుసుకొని వారికి ఆత్మస్థైర్యం కల్పించాలన్నారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఓఎస్‌డి కె.తిరుమలరావు, డిఎస్పీలు భార్గవరావునాయుడు, ఆదినారాయణ, పి.శ్రీనివాసరావు, కె.వేణుగోపాలనాయుడు, ఏ.వి రమణ, సిఐలు, ఎస్‌ఐలు హాజరయ్యారు.

కలెక్టర్‌ను అభినందించిన మంత్రి అచ్చెన్న

శ్రీకాకుళం, జనవరి 12: జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ పాటూరి లక్ష్మీనృసింహం బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర కార్మిక, క్రీడల శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలెక్టర్‌ను గురువారం అభినందించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి కలెక్టర్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని మంత్రి పేర్కొన్నారు.