శ్రీకాకుళం

పేదోళ్ళ జీవితాల్లో సంతోషం నింపాలి!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: సంక్రాంతి పండుగ అందరి జీవితాలు శుభప్రదం కావాలి..పేదోళ్ళకు సంతోషం నింపాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ కేవలం పేదల కోసమే పుట్టిందన్నారు. పేదోళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి వారి సంక్షేమానికి బాటలు వేయడానికే టిడిపి ఆవిర్భవించిందని చెప్పారు. జన్మభూమి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, చంద్రన్నబీమా పథకం దేశంలోనే ఎంతో గొప్ప పథకమన్నారు. తెలుగువారి సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండుగ అంటూ అభివర్ణించారు. శుక్రవారం నిమ్మాడలో తన క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్న ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. ముందుగా సంక్రాంతి శుభవేళ జిల్లా ప్రజలకు, స్వర్ణశ్రీకాకుళం నిర్మాణానికి అహర్నిశలు శ్రమపడుతున్న అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు సకల శుభాలు కలిగి ప్రకాశవంతమైన జీవనం సాగించాలని కోరుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అవనిపై వెలసిన రంగవల్లులు..ఆకాశాన ఎగిరే గాలిపటాలు...తెలుగింటి సంక్రాంతి సొగసులు..సంప్రదాయపు తీపి గుర్తులు..పెద్దపండుగ శుభసమయంలో స్నేహితులకు, సన్నిహితులకు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
గత పదేళ్ళ పాలనతో విసిగివేసారిన ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా రానున్న 20 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ పాలన ఉంటుందని అచ్చెన్న అన్నారు. స్వర్ణశ్రీకాకుళం నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా మరో రెండేళ్ళలో జిల్లా అభివృద్ధికి మూలాలైన భావనపాడు పోర్టు, కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం, వంశధార రెండోదశ ప్రాజెక్టు, కాకరాపల్లి థర్మల్ పవర్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు తాను వెనుకడుగు వేసేదే లేదంటూ సుస్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధిలో ఏర్పాటుచేసే పరిశ్రమలకు మోకాలడ్డుతున్న వారు ఎవరైనా ఉపేక్షించమంటూ హెచ్చరించారు. ప్రతీ పేదోడి ఇంట్లో సంక్రాంతి కాంతులు వెలగాలన్న ఆలోచనలతో ‘చంద్రన్నకానుక’ అందించారు. కష్టసమయాల్లో ధైర్యం కల్పించే ప్రయత్నమే సంక్రాంతి చంద్రన్న కానుక అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి, మిల్లర్లతో ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తూ, జిల్లా యంత్రాంగాన్ని సమర్థవంతంగా పనిచేయాలంటూ సూచనలు ఇచ్చినప్పటికీ, ఆశించినంతగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేకపోయినప్పటికీ, వారంతా ధైన్యంగా ధాన్యం వైపు చూసే పరిస్థితులు ఉండబోవంటూ భరోసా ఇచ్చారు. గత రెండేళ్ళలో ఎన్నో శాశ్వత ప్రాతిపదిక ప్రాజెక్టుల పనులు చేశామని, మరో రెండేళ్ళల్లో స్వర్ణశ్రీకాకుళంగా సిక్కోల్ మారబోతుందన్నారు. మూడు పంటలు, తొమ్మిది లక్షల హెక్టార్ల వరి సాగుకు వంశ‘్ధర’ అందించి, జిల్లా నుంచి ఆకలికడుపులతో కూలీ పనుల కోసం వలసలతో రాష్ట్రాలు దాటే జిల్లావాసులు ఇకపై అటువంటి పరిస్థితులు లేకుండా పరిశ్రమలు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ముఖ్యంగా సిక్కోల్ జీవనాడి భావనపాడు పోర్టు నిర్మాణం జరిగితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిరుద్యోగ యువతకు పూర్తి ఉద్యోగ భద్రత కల్పించేందుకు వీలుగా ఉంటోందన్నారు. అలాగే, కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం నిర్మాణం పూరె్తైతే భావితరాలకు నిరుద్యోగ సమస్యే సిక్కోల్‌కు రాదన్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తాం..స్వర్ణశ్రీకాకుళం నిర్మిద్ధాం..అవినీతిలేని సమాజాన్ని కట్టుకుందాం..మహిళలు గౌరవాన్ని కాపాడేందుకు ప్రతీ ఇంటా మరుగుదొడ్లు నిర్మిద్దాం..స్వచ్చ శ్రీకాకుళం వైపు అడుగులు వేద్దాం..ఈ సంక్రాంతి పండుగ అందరికీ శుభప్రదం కావాలని మంత్రి అచ్చెన్న ఆకాంక్షించారు!!