శ్రీకాకుళం

ఓటు హక్కు.. వినియోగంపై అవగాహన తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, జనవరి 20: యువతకు ఓటు హక్కు వినియోగం అంశాలపై అవగాహన తప్పనిసరని ఆర్డీవో బలివాడ దయానిధి స్పష్టం చేశారు. మండలం పోర్టుకళింగపట్నం(కె.మత్స్యలేశం)పంచాయతీ పరిధిలోగల కోకావారి ప్రభుత్వ జూనియర్, ఉన్నత పాఠశాలలతోపాటు శ్రీకూర్మంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థి, విద్యార్థ్ధులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల సమక్షంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో బలివాడ దయానిధి మాట్లాడుతూ ఓటు హక్కు అంటే ఏమిటి.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ.. ఓటు హక్కు.. వినియోగం అంశాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఓటరు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచు బరాటం రామశేషు, తహశీల్దారు ఎ.సింహాచలం పాల్గొన్నారు.

23న అంబేద్కర్ ఆడిటోరియంలో ఎంపికలు
శ్రీకాకుళం(రూరల్), జనవరి 20: ఎంప్లారుూమెంట్ జనరేషన్ మిషన్ పథకంలో భాగంగా రెడేక్స్ లేబరేటరీ సర్వీస్ సంస్థ ఫార్మారంగంలో ప్రొడక్షన్ కెమిస్ట్రీ, అసిస్టెంట్ ఆపరేటర్ ఎంపిక శిక్షణ కి ఇంటర్య్వూలు నిర్వహిస్తున్నట్లు డిఆర్‌డిఏ పిడి కిషోర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23న ఉదయం 9 నుండి 2గంటల వరకు అంబేద్కర్ ఆడిటోరియంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారని స్పష్టంచేశారు. ప్రొడక్షన్ కెమిస్ట్రీ అసిస్టెంట్, ఆపరేటర్ ఎంపిక శిక్షణ కోసం అసక్తి ఉన్న అభ్యర్థులు హాజరు కావాలన్నారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీలో బిఎస్సీ పాస్ లేదా ఫెయిల్, ఐటిఐ ఫిట్టర్, ఎలక్ట్రికల్, డిప్లమో మెకానిక్, ఎలక్ట్రికల్, డి-్ఫర్మశీ పాసైన యువకులు మాత్రమే హాజరుకావాలన్నారు. వయస్సు 18-24 లోపు ఉండాలని, ఎంపికైన అభ్యర్థులకు 90రోజులు ఉచిత శిక్షణ వసతిభోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. శిక్షణ పూర్తయిన తరువాత హైదారాబాద్, విశాఖపట్నం, బెంగుళూర్, గోవా ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తిమని పి.డి స్పష్టంచేశారు. ఎంపిక ప్రక్రియకు హాజరుకాగల అభ్యర్థులు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, విద్యార్హతల సర్ట్ఫికెట్ జిరాక్సు, రెండు పాస్‌పోస్టు సైజు ఫొటోలు, బయోడేటా అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.

‘పల్స్ పోలియో విజయవంతం చేయండి’
ఎచ్చెర్ల, జనవరి 20: ఈనెల 29వతేదీన నిర్వహించనున్న మొదటి విడత పల్స్‌పోలియో, ఏప్రిల్‌లో జరగబోవు రెండవ విడత పల్స్‌పోలియోలను విజయవంతం చేయాలని డిఎంఅండ్ హెచ్‌వో ఎస్.తిరుపతిరావు స్పష్టంచేశారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో నిర్వహించే శిక్షణలో ఆయన మాట్లాడారు. సంయుక్త సంచాలకులు డాక్టర్ వసంతకుమారి అధ్యక్షతన జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య, పట్టణ ఆరోగ్య కేంద్రాల రూట్ పర్యవేక్షణకు పల్స్ పోలియో విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై రెండు బృందాలుగా శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా డిఎం అండ్ హెచ్‌వో మాట్లాడుతూ రెండు విడతలుగా జరగబోవు పల్స్ పోలియోలో ఐదేళ్ల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని, మొదటి రోజు పోలియో బూత్‌ల వద్ద రెండు మూడు రోజుల్లో పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు గ్రామాలు, పట్టణాల్లో ప్రతీ ఇంటిని సందర్శించి పోలియో చుక్కలు వేయాలన్నారు. పోలియో వ్యాక్సిన్ నిర్థేశించిన శీతలీకరణ విధానంలో ఉంచాలన్నారు. హైరిస్క్ ప్రాంతాలైన సంచార జాతులు, మురికివాడలు, ఇటుక బట్టీలు, పొలాల్లో, తోటల్లో నివసించే వారితోపాటు ప్రయాణంలో ఉన్నవారికి సంచార కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేయాలన్నారు. ఈ ప్రాంతాలపైనే ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈసమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జి.రత్నకుమారి, అడిషనల్ డిఎంఅండ్ హెచ్‌వో బి.జగన్నాథరావు, క్షయనివారణాధికారి బి.్భస్కరరావు, మాస్‌మిడియో అధికారి పి.విశ్వనాథం పాల్గొన్నారు.