శ్రీకాకుళం

సంక్షేమ పథకాలు అందరికీ అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జనవరి 21: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమపథకాలు పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ అందజేయాలని బీజేపి జి ల్లా ప్రధాన కార్యదర్శి శవ్వాన వెంకటేశ్వరరావు కోరారు. తన నివాస గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధినేత ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో రూపొందించబడిన అనేక సంక్షేమపథకాలు అర్హులైన ప్రతీ భారతీయ పౌరునకు అందించాలనే కృతనిశ్చయంతో ఉన్నారని తెలియజేశారు. ఇందులో భాగంగానే జన్‌ధన్‌యోజన, ప్రధానమంత్రిసురక్ష భీమా యోజన, జీవన జ్యోతి భీమా యోజన వంటి ఎన్నో కుటుంబ సంక్షేమ పథకాలు రూపొందించబడ్డాన్నారు. ఇందులో భాగంగానే వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు అందజేస్తున్నట్లు తెలియజేశారు. గతంలో రూ.200 స్థానంలో ప్రస్తుతం రూ.1000కు పెంచడం జరిగిందని తెలియజేశారు. జన్మభూమి కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించడమే తప్ప వాటిని పరిగణనలోనికి తీసుకోవడం లేదని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో బీజేపి జిల్లా కార్యదర్శి కొంచాడ సురేష్‌కుమార్, మందస మండలాధ్యక్షుడు భావనరంగరావు తదితరులు ఉన్నారు.

కిడ్నీ వ్యాధులపై ఎయిమ్స్ బృందం అధ్యయనం
వజ్రపుకొత్తూరు, జనవరి 21: ఉద్దానం ప్రాంతాన్ని ఊపేస్తున్న కిడ్నీ వ్యాధులపై మరో అడుగు ముందుకు పడింది. ఈ వ్యాధి ప్రబలంగా ఉన్న ప్రాంతంలో శనివారం ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన వైద్య బృందం అధ్యయనం చేపట్టింది. ఎయిమ్స్ రీజనల్ డైరక్టర్ అరుణ్‌కుమార్ ఆధ్యర్యంలో కిడ్నీవ్యాధి బాధితులు అధికంగా ఉన్న గుణుపల్లి, మెట్టూరు, ఒంకులూరు గ్రామాల్లో పర్యటించింది. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. ఈ ప్రాంతంలోని ఆహార అలవాట్లును బాధితుల నుంచి వివరాలు సేకరించారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం 25 నుంచి 50 ఏళ్ల వయసు మధ్యనే ఈ వ్యాధి ప్రబలంగా ఉందని గుర్తించారు. మూత్ర ఇన్‌ఫెక్షన్‌తో జ్వరం రావడంతోనే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారని ఎయిమ్స్ వైద్య బృందానికి స్థానికులు వివరించారు. సముద్రతీర ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. చేపలు పచ్చిగా తింటారా? ఎండబెట్టుకొని తింటారా? అని అడిగి తెలుసుకున్నారు. కొబ్బరి నీళ్లు తాగే అలవాటు ఉందా? అని స్థానికులను ప్రశ్నించారు. జీడి చెట్లకు పురుగు మందులు వాడుతున్న విధానం, పిచికారి సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. కాగా ఎయిమ్స్ వైద్య బృందం సమాచారం లేకుండా రావడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ బృందంలో ఎయిమ్స్ నెఫ్రాలజీ హెడ్ అగర్వాల్, వైద్యులు మహాపాత్రో, అనురాధ, కిరణ్, డి ఎం అండ్ హెచ్‌వో ఎస్.తిరుపతిరావు తదితరులు ఉన్నారు.