శ్రీకాకుళం

‘హామీలు అమలు చేసిన ఘనత చంద్రబాబుదే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రణస్థలం, జనవరి 21: రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందని రాష్టత్రెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు. పిసిమి గ్రామంలో శనివారం ఆయన విద్యుత్‌సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రణస్థలం మండల పరిధిలో వ్యవసాయ పంపెసెట్లు ఎక్కువగా ఉన్నందున రైతులకు ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో ఇక్కడ పర్యటనకు వచ్చిన సందర్భంలో దీనిని మంజూరు చేశారన్నారు. గతంలో ఆయన పిసిమి పంచాయతీలో పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడం జరిగిందని వివరించారు. ఈ ప్రాంతం లో భూగర్భజలాలు అడుగంటిపోతున్న తరుణంలో తోటపల్లి కాలువల ద్వారా నీరును విడుదల చేయడం జరిగిందని వివరించారు. ఈ పరిస్థితిలో అధనంగా వ్యవసాయ పంపుసెట్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 2003లో తోటపల్లికి పునాదులు వేయడం ద్వారా 14మండలాల్లో ప్రస్తుతం వ్యవసాయ రంగానికి నీరు అందుతుందని దీని వలన అన్ని వర్గాల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు. వృధాగా పోతున్న గోదావరి జిల్లాలను పట్టిసీమ ద్వారా కృష్ణానదికి తరలించడం వలన రాయలసీమలోని నాలుగు మండలాలకు తాగు, సాగునీరు అందిస్తున్నామన్నారు. పట్టిసీమ వలన తమిళనాడు రాష్ట్రానికి 3 టిఎంసి ల నీటిని కూడా పంపిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం లక్షకోట్లు తాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశామన్నా ఆచరణలో ఎక్కడా కనిపించలేదని వివరించారు. మండల పరిషత్ అధ్యక్షులు గొర్లెవిజయకుమార్‌నాయుడు, టిడిపి నాయకులు ఎన్. ఈశ్వరరావు, డి జి ఎం ఆనందరావు తదితరులు మాట్లాడుతూ రెండున్నరేళ్లలోనే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ పథకాలను అమలు చేసిందన్నారు. ట్రాన్స్ కో ఎస్ ఇ డి .సత్యన్నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న సబ్‌స్టేషన్ వలన 14 గ్రామాలకు సర్వీసులు అందించడం జరుగుతుందన్నారు.

బలమైన శక్తిగా స్వయంశక్తి సంఘాలు

శ్రీకాకుళం, జనవరి 21: రాష్ట్రంలో బలమైన శక్తిగా స్వయం సహాయకబృందాలు ( ఎస్ హెచ్ జి) అవతరించాయని స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ఉభయ రాష్ట్రాల జనరల్ మేనేజర్ రవీంద్రపాండే అభివర్ణించారు. శనివారం స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో ఎస్ బి ఐ రీజనల్ బ్రాంచ్ ఆఫీస్ ఆధ్వర్యంలో రైతులు, ఎస్ హెచ్ జి గ్రూపుల రుణవితరణ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి రవీంద్రపాండే ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. స్వయం సహాయక బృందాలు తమకు తాము సముపాద్యన చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా ఇతరులకు సైతం సహాయం చేసే శక్తిగా అవతరించిందన్నారు. ఇది ఎంతో ఆనందదాయకమన్నారు. ఎస్ బి ఐ స్వయం సహాయక బృందాలకు ఎప్పుడూ బాసటగానిలుస్తుందని, అతితక్కువ వడ్డీకి రుణాలను మంజూరు చేయడమే కాకుండా అధికమొత్తంలో రుణాలను మంజూరు చేసిన ఘనత తమకే దక్కిందన్నారు. రైతులు ఎస్ హెచ్ జిలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి తిరిగి రుణాలను పొందాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఖాతాదారులకు ఉపయుక్తంగా ఉండే అనేక పథకాలను ఎస్ బి ఐ అందిస్తుందన్నారు. ఉదాహరణకు మూట్యూవల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ తక్కువ రేట్లకు రుణాలు ఇలా మరెన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. పెద్దనోట్ల రద్దుతో గత రెండుమాసాల్లో ఏర్పడిన సమస్యను గుర్తించి అవసరమైన మేరకు కొత్తనోట్లను అందించగలిగామన్నారు. ప్రస్తుతం 90శాతం వరకు సమస్య తీరిపోయిందని త్వరలో శతశాతం తీరనుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ నగదురహిత లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో సాధారణ స్థితికి చేరుకుందన్నారు. రైతులు స్వయం సహాయక బృందాలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి మరింత మందికి స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో బ్రాంచ్‌మేనేజర్లు వేణుగోపాల్; నాగేశ్వరరావు, కామాక్షిప్రసాద్, ఉమామహేశ్వరరావు, జానకిరామ్, రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, భాస్కరరావు, ప్రభాకరరావు, రామరాజు, టి.వి రామారావు, లబ్ధిదారులు, రైతులు, స్వయం సహాయక బృందాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.