శ్రీకాకుళం

కరపత్రాల కలకలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 21:్భవనపాడు పోర్టు నిర్మాణం ఎవరికోసం? ఎందుకోసం?? ఇప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పే మాయమాటలన్నీ భవిష్యత్తులో సముద్రతీరంలో మత్స్యకార గ్రామాలన్నీ గంగలో కలిసిపోతాయంటూ భావనపాడు పోర్టు బాధిత గ్రామాల పేరిట కొద్దిరోజుల క్రితం కరపత్రం జిల్లాఅంతటా కలకలం సృష్టించింది. ఈ కరపత్రం మావోల సౌజన్యంతో వెలువడినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నా వాటిని ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు కొట్టిపారేస్తున్నారు. కాని - కరపత్రంలో ముద్రిం
చిన సారాంశాన్ని గమనిస్తే అల్టిమేటం, హుకుం, హెచ్చరికలు చోటుచేసుకుంటూ వ్రాయబడిన ఆయుధంలాంటి అక్షరాలు ఖచ్చితంగా పోర్టు నిర్మాణానికి మావోల వ్యతిరేకత ఈ కరపత్రంలో కన్పిస్తుంది. కాకరాపల్లి ధర్మల్ ప్రాజెక్టు అభివృద్ధి, పరోక్షంగా ఆ ప్రాజెక్టు మనుగడ కోసం దగ్గరలో ఓడరేవు అవసరమన్న విషయాన్ని సుస్పష్టంగా చెప్పిన కరపత్రంలో వివరాలు పరిశీలిస్తే..ప్రస్తుతానికి భావనపాడు వల్ల నష్టం వాటిల్లడంలేదని చెప్పుకొచ్చే మాటల్లో పచ్చిఅబద్ధం దాగివుందని పేర్కొనడం గమనార్హం. పోర్టుల నిర్మాణాలకు బంపర్ ఆఫర్ కూడా ప్రభుత్వం తరుఫున జిల్లా మంత్రి అచ్చెన్న ప్రకటించారు. అయినప్పటికీ, గ్రామాలకుగ్రామాలు మాయమైపోతాయన్న దుష్పప్రచారం జిల్లా అభివృద్ధిని మోకాలడ్డుకుంటోందంటూ ప్రజాప్రతినిధులు భావించి, ఆ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు చేసారు. అలాగే, పోర్టు నిర్మాణస్థలాన్ని కాకినాడ పోర్టు డైరక్టర్, ఐ.ఎ.ఎస్. అధికారి ప్రసన్న వెంకటేష్ పలుమార్లు సందర్శించి, అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. పోర్టు నిర్మితప్రాంతాన్ని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తామని వివరించినప్పటికీ, మత్స్యకారుల్లో భరోసా నింపలేకపోయారు. ప్రజాభిప్రాయ సేకరణకు సన్నద్ధం అవుతున్న ప్రభుత్వం ముందుగానే భూమిపూజ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 10న పోర్టు పనులకు భూమిపూజకు మూహూర్తాన్ని అచ్చెన్న ఖరారుచేసినట్టు బోగట్టా.

అంతర్జాతీయ స్థాయిలో విపత్తుల నివారణ ప్లానింగ్

శ్రీకాకుళం, జనవరి 21: అంతర్జాతీయ స్థాయిలో విపత్తుల నివారణా ప్లానింగ్ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలన్నది కేంద్రప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని జెసి కెవి ఎన్ చక్రధరబాబు పేర్కొన్నారు. జిల్లా విపత్తుల నిర్వహణ అధారిటీ ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్లు, మండల తహశీల్దార్లు, ఎంపిడివోలు, అన్ని శాఖల జిల్లా అధికారులతో ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ సునామి, తుఫానుల, వరదలు, రోడ్డు ప్రమాదాలు ఆకస్మీక సంఘటనలు జరిగినప్పుడు తక్షణం బాధితులకు అందించాల్సిన చర్యల గూర్చి ముందుగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాల్సి ఉందన్నారు. జపాన్‌లో జరిగిన సునామీని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ దేశాలన్నీ కలిసి విపత్తుల నివారణపై 2016లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆశియాప్లాన్ అమలు చేయాలని ప్రపంచ దేశాలు ఆమోదించినట్లు తెలిపారు. ఈప్లాన్ ప్రపంచ దేశాల్లో 2030 సంవత్సరం వరకు అమలులో ఉంటుందని దీనిలో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు వ్యక్తులను కలపాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. విపత్తులు సంభవించినప్పుడు రిస్క్యూ టీమ్‌లు ప్రజలతో కలిసి సమిష్ఠిగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. పంటనష్టాలతోపాటు, మనలను మనం రక్షించుకోవాల్సి ఉంటుందన్నారు. ఆలిండియా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ వచ్చిన ప్రోగ్రామ్ అధికారి ఇచ్చిన సూచనలను అనుసరించి ప్లానింగ్ తయారు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఏయే మండలాల్లో ఎటువంటి విపత్తులు తరచుగా గురౌతున్నది క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక తయారు చేయాలన్నారు. అహ్మదాబాద్ ఆలిండియా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆనందప్రకాశ్ మాట్లాడుతూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం 2005 సెక్షన్ 31 ప్రకారం జిల్లా స్థాయి నుండి ఈ ప్లాన్ తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. మండల స్థాయి అధికారులు, ఆయా మండలాలు తరచుగా ఎదుర్కొంటున్న తుఫాన్‌లు, వరదలు, రోడ్డు ప్రమాదాలు, పంటనష్టాలు, అగ్ని ప్రమాదాలు సీజనల్ వ్యాధులు, బోటు ప్రమాదం, వన్యప్రాణుల వలన కలుగుతున్న నష్టాలపై సమగ్రనివేదిక ఇవ్వాలని కోరారు. అనంతరం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విపత్తుల నివారణ ప్లానింగ్ తయారు చేయు విధానం గురించి వివరించారు.