శ్రీకాకుళం

భావనపాడు పోర్టుకు 10న భూమి పూజ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: స్వర్ణశ్రీకాకుళానికి జీవనాడీ అయిన భావనపాడు ఓడరేవు పనుల శ్రీకారానికి మూహూర్తం ఖరారైంది! వచ్చే నెల 10న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా భూమి పూజ నిర్వహించేందుకు జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రంగం సన్నద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి అనుమతులు పొందలేదని, అధాని గ్రూపునకు చెందిన ఇంజనీర్లు పలుమార్లు భావనపాడు పోర్టు నిర్మాణం ఏరియాను సర్వే చేయడం, వెళ్ళడమే జరుగుతుందని, భూసేకరణలో అధికారులు సుస్పష్టంగా అంచనాలు వేయలేక, అసలు ఎన్ని గ్రామాలు, ఎంత భూమి అవసరానికి వినియోగిస్తారన్న అంశాలు తేటతెల్లంకాకపోవడంతో అసలు భావనపాడు పోర్టు నిర్మాణం బూటకమని, అంతా ముఖ్యమంత్రి మాయాజాలమంటూ వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలంటూ నిరూపించుకునేందుకు మంత్రి అచ్చెన్న చేస్తున్న ప్రయత్నంలో భాగమే భావనపాడు భూమిపూజగా చెప్పకతప్పదు. కాని - చెప్పింది చేసేవరకూ పట్టువదలని అచ్చెన్న భావనపాడు పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలన్న దృఢసంకల్పంతో ఫిబ్రవరి 10న ముఖ్యమంత్రి చేతులమీదుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత మొదటి ఓడరేవు భావనపాడు అవుతుందంటూ ముఖ్యమంత్రి పదేసార్లు చెప్పారు. ఏడాదిన్నర క్రితం ఐదు వేల ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేస్తే, స్థానికంగా మత్స్యకారులు అభ్యంతరాలు తెలపడంతో 2500 ఎకరాలకు పరిమితం చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆదేశాల మేరకు అక్కడ ఆర్డీవో ఎం.వెంకటేశ్వరరావు గ్రామసభల్లో వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కాని - ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటనలు ఇవ్వలేదు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఇచ్చే విధంగా పరిహారం భావనపాడుపోర్టుకు భూములు ఇచ్చిన రైతులకు ఇస్తామన్న బంపర్ ఆఫర్ కూడా ప్రభుత్వం తరుఫున జిల్లా మంత్రి అచ్చెన్న ప్రకటించారు. అయినప్పటికీ, గ్రామాలకుగ్రామాలు మాయమైపోతాయన్న దుష్పప్రచారం జిల్లా అభివృద్ధిని మోకాలడ్డుకుంటోందంటూ ప్రజాప్రతినిధులు భావించి, ఆ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు చేసారు. అలాగే, పోర్టు నిర్మాణస్థలాన్ని కాకినాడ పోర్టు డైరక్టర్, ఐ.ఎ.ఎస్. అధికారి ప్రసన్న వెంకటేష్ పలుమార్లు సందర్శించి, అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. పోర్టు నిర్మితప్రాంతాన్ని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తామని వివరించినప్పటికీ, మత్స్యకారుల్లో భరోసా నింపలేకపోయారు. ప్రజాభిప్రాయ సేకరణకు సన్నద్ధం అవుతున్న ప్రభుత్వం ముందుగానే భూమిపూజ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 10న పోర్టు పనులకు భూమిపూజకు మూహూర్తాన్ని అచ్చెన్న ఖరారుచేసినట్టు బోగట్టా.