శ్రీకాకుళం

వంశధార ‘దంగల్’పై సి.ఎం. సీరియస్!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: అన్నదాత మూడు పంటలు వేసుకోవచ్చు.. తొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం.. నిర్వాసితులకు సమస్యలు ఉండవు.. వారిని అన్నివిధాలుగా ఆదుకుంటాం..పూర్తిగా నష్టపరిహారాలు, ప్యాకేజీలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.420 కోట్లు విడుదల చేసింది.. మూడు రోజుల్లో నిర్వాసితుల అకౌంట్‌లకే నేరుగా పరిహారం జమ అవుతుంది..అంటూ రెండేళ్ళుగా తెలుగుదేశం ప్రభుత్వం చెప్పే కథనాలు!! కాని - ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం కలిసి అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసుల నీడలో పనులు ప్రారంభించి, నిర్వాసితులను పొమ్మనకుండా - పొగపెట్టే ప్రయత్నం గా గార్లపాడు - తులగాం గ్రామాలకు గట్లుకట్టి వరదనీరు నిల్వ అయ్యేలా సాంకేతికపరంగా నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. నిర్వాసిత గ్రామాలన్నీ వరదనీటికి మునిగిపోతే వారంతటవారే ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడుతుందన్న ఇంజనీర్ల ఉచిత సలహాలను కలెక్టర్, ఎస్పీలతోపాటు, మంత్రులు సైతం ఆచరించేందుకు అత్యుత్సాహం చూపడంతో నిర్వాసితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాని పర్యవసానమే వంశధార నిర్మాణ పనులు చేపట్టిన సోమా సంస్థకు చెందిన రూ. 4.50 కోట్లు ఆస్తిని నిర్వాసితులు దగ్థం చేసి, ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కింజరాపు అచ్చెన్నాయుడు పట్ల అసహనం వ్యక్తం చేయడంతోపాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలు వ్యవహరించిన తీరుపట్ల ఆగ్రహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత ప్రభుత్వం పదేళ్ళ వ్యవధిలో వందల కోట్ల రూపాయలు నష్టపరిహారాన్ని పక్కదారి పట్టించి గణాంకాలు కూడా లేకుండా చేసిన పరిస్థితుల నుంచి వారిని రక్షించి, భరోసా ఇచ్చి, నష్టపరిహారాన్ని పెంచి, యూత్ ప్యాకేజీలు ఇచ్చి, నిర్వాసితుల గృహాలు కల్పిస్తున్న తరుణంలో సున్నితమైన వ్యవహారాన్ని జఠిలం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులపై సి.ఎం. సీరియస్ కావడంతో వంశధార ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న హిరమండలం ప్రాంతాన్ని మరోసారి రాష్ట్ర నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులను పర్యటించి అక్కడ నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించినట్టు సి.ఎం. క్యాంపు కార్యాలయం నుంచి సమాచారం. ఈ మేరకు మంగళవారం మంత్రులు దేవినేని, అచ్చెన్నతోపాటు రాష్ట్ర, జిల్లా అధికారులు హిరమండలం ఎమ్మార్వో కార్యాలయంలో రూ.148 కోట్ల చెక్కులు నిర్వాసితులకు పంపిణీ చేసేలా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పునరావాస ప్యాకేజీ కింద నాలుగు గ్రామాలకు రూ. 43.70 కోట్లు మంజూరు కాగా, హిరమండలంలో తులగాం, బర్రిపేట, భీమవరం, కృష్ణాపురం గ్రామాలకు పునరావాస ప్యాకేజీతోపాటు ఇతర గ్రామాలకు పెండింగ్‌లోగల పునరావాస పెండింగ్ బిల్లులకు రూ. 150 కోట్లను జాయింట్ కలెక్టర్ ఖాతాలో హుటాహుటిన సోమవారం రాత్రికిరాత్రి జమ చేశారు. ప్రాజెక్టు పరిధిలో 19 గ్రామాల్లో 19 ప్రత్యేక బృందాలను నియమించి నిర్వాసితులకు అందవల్సిన నష్టపరిహారం పదిరోజుల్లోగా సర్వే నిర్వహించి పూర్తి శాతం పరిహారం అందించాలంటూ ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
ఏడువేల మంది నిర్వాసితులు - 10 వేల ఎకరాల భూసేకరణతో ప్రారంభమైన వంశధార ఫేజ్-2, స్టేజ్-2 పనులు అత్యంతవేగంగా జరగాలంటూ మంత్రులు హుకుం, అధికారుల అత్యుత్సాహం వెరసి ఆగ్రహాజ్వాలలు మళ్ళీ పుట్టుకొచ్చాయి. రక్షణ కల్పిస్తామంటూ మంత్రి అచ్చెన్న, కలెక్టర్, ఎస్పీలు భరోసా ఇచ్చారంటూ సోమా సంస్థ ప్రతినిధులు ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. వారి ఇచ్చిన అభయంతోనే పనులు ప్రారంభించామని, ఇకపై ఇక్కడ నిర్వాసితుల సమస్యలు పూర్తిగా పరిష్కరించేంత వరకూ పనులు చేపట్టమంటూ సోమవారం వారి కార్యాలయాన్ని ఖాళీ చేసి, నిర్మాణ సామగ్రిని, సిబ్బందిని వెనక్కి పంపారు.