శ్రీకాకుళం

సజావుగా ఇంటర్మీడియట్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జనవరి 24: ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జెసి-2 పి.రజనీకాంతారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం జెసి-2 ఛాంబర్‌లో జిల్లా స్థాయి ఇంటర్మీడియట్ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పోలీస్, విద్యాశాఖ ఏపిఎస్ ఆర్టీసీ వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోస్టల్, జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషన్ అధికారులు పరీక్షల నిర్వహణలో విధులపై ఆదేశాలను జారీ చేశారు. జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషన్ అధికారి పరీక్షలను సజావుగా నిర్వహించాలని, ఇన్విజిలేటర్లుగా టీచర్లను నియమించేందుకు ఫర్నీఛర్‌ను అందించాలని విద్యాశాఖకు తెలిపారు. పరీక్షల సమయాలకు అనుగుణంగా మారుమూల పరీక్షా కేంద్రాలకు బస్సులను ఏర్పాటుచేయాలని కోరారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో మందులతో వైద్యసిబ్బంది అందుబాటులో ఉంచాలన్నారు. ప్రశ్నాపత్రాలు, జవాబుపత్రాలను త్వరితగతిన తరలించేందుకు పోస్టల్ శాఖ పనిచేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో పోలీస్‌శాఖ అప్రమత్తంగా పనిచేయాలన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలోని మంచినీరు అందుబాటులో ఉంచాలని, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆర్‌ఐవో బి.వరప్రసాద్ మాట్లాడుతూ మార్చి 2017 ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు మార్చి 1 నుండి 18వతేదీ వరకు ప్రతీ రోజూ ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12గంటలవరకు ఉంటాయని, ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 3నుండి 22వతేదీ వరకు ఉంటాయన్నారు. థియరీ పరీక్షలకు 96 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ 72 కేంద్రాల్లో నిర్వహిస్తారన్నారు. ఈ సమావేశంలో నరసన్నపేట సంతకవిటి కళాశాలల ప్రిన్సిపల్స్ ఐ.శంకరరావు, బి.శ్యామలరావు పాల్గొన్నారు.

హుదూద్ ఇళ్లు పక్కాగా నిర్మించాలి
* చీఫ్ ఇంజినీర్ ప్రసాద్
శ్రీకాకుళం(రూరల్), జనవరి 24: జిల్లాలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇళ్లు పనులు పక్కాగా ఉండాలని హౌగింగ్ చీఫ్ ఇంజినీర్ ఎంవిఎస్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో హౌసింగ్‌శాఖలో, నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాల ఆధ్వర్యంలో గృహ నిర్మాణ సంస్థ చేపడుతున్న ఇళ్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని పురపాలక సంఘాల్లో చేపడుతున్న హుదూద్ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటికీ ప్రారంభించని ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. జన్మభూమితోపాటు ఇళ్లు మంజూరు కోసం ఫిర్యాదుల విభాగానికి వచ్చిన దరఖాస్తులను శాఖాధికారుల సమన్వయంతో పరిశీలించి అర్హుల జాబితాలు సిద్ధం చేయాలన్నారు. ఈసమావేశంలో గృహ నిర్మాణ సంస్థ ఎస్ ఇ సిహెచ్ యుకె కుమార్, జిల్లా పిడి నర్సింగరావు పాల్గొన్నారు.

బాలికల రక్షణే ప్రభుత్వ ధ్యేయం
* జెడ్పీ చైర్‌పర్సన్ ధనలక్ష్మీ
శ్రీకాకుళం(రూరల్), జనవరి 24: బాలికల రక్షణే ప్రభుత్వ ధ్యేయమని జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ మహిళాడిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవంలో ఆమె మాట్లాడుతూ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని, మహిళల రక్షణ కోసం మహిళా కమీషన్‌ను పటిష్టంగా నిర్వహిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పేడాడ సన్యాసప్పారావు, కొమ్ము రమణమూర్తి, బెజ్జిపురం యూత్‌క్లబ్ అధ్యక్షులు ఎం.ప్రసాదరావు పాల్గొన్నారు.