శ్రీకాకుళం

వంశ‘్ధర’ ఎర్రన్న వరం!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 24: వంశధార ప్రాజెక్టు నిర్వాసితులంతా దివంగత నేత మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు పాదయాత్రను జ్ఞాపకం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వాలు చేసే కుట్రలు, కుతంత్రాల్లో నిర్వాసిత గ్రామాలకు అండదండగా నిలిచి పాదయాత్రలు చేసి, గ్రామాల్లో రాత్రిపూట బసచేసి న్యాయపోరాటంలో భాగస్వాములైన ఎర్రన్న మాటలు ఆయన తనయుడు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు వెల్లడిస్తుంటే ఆగ్రహజ్వాలల మధ్య రగిలిపోతున్న నిర్వాసితులంతా జేజేలు కొట్టారు. తెలుగుదేశం పార్టీకి ఎర్రన్న బ్రాండ్ అంబాసిడర్‌గా ఇంకా వ్యవహరించేలా మంగళవారం కృష్ణాపురం నిర్వాసిత గ్రామంలో కనిపించింది. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అంతా ఎర్రన్న పేరును ప్రతీ మాటకు ముందు - వెనుక మాట్లాడడంతోనే అక్కడ నిర్వాసితుల్లో ఆక్రోశం, ఆగ్రహం సన్నగిల్లేలా చేసింది. ఎర్రన్న పాదయాత్ర, ఆయన ప్యాకేజీల కోసం నిర్వాసితులతో కలిసి చేసిన పోరాటాలు అక్కడ నిర్వాసితులే స్వయంగా వివరించి, ఆయన ఆశయసాధన కోసమే నేడు చెక్కులు తీసుకుంటున్నామని పేర్కొనడం గమనార్హం. వంశధార ప్రాజెక్టు నిర్మాణం పనులు నిలిచిపోయి, గుత్తేదారులని ఆస్తులు రూ.కోట్లు ధ్వంసమైపోయి, సాక్షాత్తు ముఖ్యమంత్రి నేరుగా క్షమాపణ నిర్వాసితులకు చెప్పి, మంత్రులను వెంటనే నిర్వాసిత గ్రామాలకు వెళ్ళాలంటూ ఆదేశించిన ఘటనలన్నీటికంటే - ఎర్రన్న ఆయా గ్రామాలకు చేసిన మేలు ఇప్పుడు మంత్రి ఉమా, అచ్చెన్నలకు ఊపిరి తీసుకునేలా చేశాయి. ఎర్రన్న పట్ల గల సానుభూతి ఇంకా ఆయన తనయుడు రామ్మోహన్‌నాయుడుపై ప్రత్యక్షంగా కనిపించడం, ఎం.పి. మాటల్లో ఎర్రన్న నిస్వార్థాన్ని మరోసారి కృష్ణాపురం నిర్వాసిత గ్రామంలో అందరినీ కదిలించింది. అందుకే - అక్కడ 116 మంది నిర్వాసితులు ప్రాజెక్టు పనులకు సహకారం అందిస్తామని, ప్రభుత్వం పంపిన దూతలుగా మీకు గౌరవిస్తామంటూ చెక్కులు స్వీకరించి, ప్రాజెక్టు పనులకు అడ్డుతగలమంటూ భరోసా ఇచ్చారు.

జిల్లాకు కొత్తగా ఆరు డిగ్రీ కళాశాలలు
* ఆర్‌జెడి గంగేశ్వరరావు
శ్రీకాకుళం(రూరల్), జనవరి 24: జిల్లాకు కొత్తగా ఆరు డిగ్రీ కళాశాలలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయని ఆర్‌జెడి డాక్టర్ గంగేశ్వరరావు అన్నారు. జిల్లాలో కంచిలి, పలాస, కొత్తూరు, బూర్జ, పొందూరు, ఎచ్చెర్ల మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు నూతనంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు అందినట్లు తెలియజేశారు. త్వరలో ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రానున్నాయన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఫిబ్రవరి 16,17,18వ తేదీల్లో నేక్ బృందం మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించనున్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులను తెలుసుకొని వాటిని మరింత మెరుగుపరిచేందుకు ఆర్‌జెడి వచ్చినట్లు తెలిపారు. కళాశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వౌళిక వసతులు, ఫర్నీచర్, ల్యాబ్, మరుగుదొడ్లు నీటి వసతితోపాటు విద్యార్థులు వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అంశాలు, రికార్డులను ఆయన తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ జ్యోతిఫెడ్రిక్ పర్యవేక్షణలో మహిళా డిగ్రీ కళాశాలలో లెక్చరర్లు, విద్యార్థులు చేపడుతున్న కార్యక్రమాలు, ప్రగతి నివేదికలను ఆర్‌జెడి పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో ఎ-గ్రేడ్ సాధించిన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల దానిని కొనసాగించేలా చర్యలు చేపట్టేందుకు తగిన సూచనలు చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. విద్యార్థి కేంద్రబిందువుగా లెక్చరర్లు పనిచేయాలన్నారు. త్వరలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆర్ట్స్ కళాశాలలను స్వయంప్రతిపత్తి కళాశాలలుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. నేక్ గుర్తింపు కొనసాగడంతోపాటు స్వయం ప్రతిపత్తి అయ్యేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ప్రిన్సిపల్ వివరించారు. ఈకార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సీతామహాలక్ష్మీ, లెక్చరర్లు ఉన్నారు.