శ్రీకాకుళం

స్వర్ణశ్రీకాకుళం నిర్మాణంలో..జిల్లా ప్రజలు భాగస్వామ్యం కావాలి!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 26: సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పుతో అవినీతికి తావులేని విధంగా ప్రజలకు సుఖవంతమైన పాలన అందించాలని రెండేళ్ళుగా చేస్తున్న ప్రయత్నం అందరికీ తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండున్నర ఏళ్ళలో ఎంతో ప్రగతి సాధించాం. రానున్న రెండేళ్ళలో స్వర్ణశ్రీకాకుళాన్ని నిర్మించేందుకు ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలంటూ కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం పిలుపునిచ్చారు. ఇక్కడ కోడిరామ్మూర్తి స్టేడియంలో జరిగిన 68వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకల్లో కలెక్టర్ జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సన్‌రైజ్ సిక్కోల్ ప్రణాళికల్లో జిల్లావాసులు మద్యపానానికి దూరంగా ఉండాలని ఆశిస్తున్నానని, తద్వారా తమ కుటుంబాల ఆదాయం మెరుగుకాగా, పేదరికంపై గెలుపు సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సంపూర్ణనగదు రహిత జిల్లాగా, శతశాతం అక్షరాస్యత జిల్లాగా, అవినీతి రహిత జిల్లాగా, స్వచ్చ శ్రీకాకుళం జిల్లాగా ఆవిర్భవం చెందాలని అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నప్పటికీ, అందులో ప్రజా భాగస్వామ్యం ఉండి, చైతన్యవంతమైన యువత ముందుకు వస్తేనే సాధ్యమవుతుందన్నారు. జిల్లాలో అపారమైన జలవనరులు ఉన్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రాజెక్టులు సకాలంలోనే నిర్మించాలన్నారు. వంశధార ప్రాజెక్టు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయడానికి నిర్ణయించినట్టు చెప్పారు. నిర్వాసితుల సమస్యలు నిబంధనలకు లోబడి పరిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటికే నిర్వాసితుల కోసం రూ. 150 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.
తోటపల్లి నుంచి సాగునీరు పూర్తిస్థాయిలో అందేలా పనులు జరిగాయని, జలవనరులు శతశాతం వినియోగించుకోవడం వల్ల ఈ ఏడాది ధాన్యం దిగుమతులు 10 లక్షల మెట్రిక్ టన్నులు సాధించామన్నారు. అటువంటి జలవనరులు కల్పించే ప్రాజెక్టు పనులను అడ్డుకునే ప్రయత్నాలు మానాలన్నారు. భావనపాడులో అత్యాధునిక ఓడరేవును నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఫిషింగ్ హార్బర్‌ను నిర్మించి మత్స్యకారుల జీవనానికి మరింత ప్రయోజనకరంగా, ఆదాయవనరులను పెంచేందుకు ప్రణాళికలు ప్రభుత్వానికి పంపినట్టు పేర్కొన్నారు. 193 కిలోమీటర్లు సుదీర్ఘ సముద్రతీరం కలిగిన సిక్కోల్ మత్స్య ఉత్పాదన పెంచేందుకు కేజ్ కల్చర్, బ్రూడ్ స్టాక్ మ్లిటప్లికేషన్ సెంటర్ నెలకొల్పుతున్నట్టు కలెక్టర్ వివరించారు. అలాగే, 200 ఫిష్ డ్రైయింగ్ ప్లాట్‌లు, షోర్ బేస్‌డ్ సౌకర్యాలు కల్పించే విధంగా పనులు ఆరంభించామన్నారు. జిల్లా అంతటా వౌలిక మంత్రం వ్యాప్తిచెందేలా శ్రీకారం చుట్టామన్నారు.
పాలకొండ, రాజాం, నరసన్నపేట, పలాసలో కొత్త రైతుబజార్లు, 11 ప్రదేశాల్లో 21,600 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగులు రూ. 15 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. ప్రతీ పేదోడికి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు అహర్నిశలు యంత్రాంగం పనిచేస్తుందన్నారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద నియోజకవర్గానికి 1250 గృహాలు, హుదూద్ గృహాలు, అందరికీ ఇళ్ళుపథకం 2,500 ఇళ్ళను ప్రభుత్వం అనుమతించిందని, మరో 12000 గృహాలు అవసరమని గుర్తించి, ప్రభుత్వానికి నివేదించామన్నారు. శ్రీకాకుళాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు ముందుగా రింగ్ రోడ్డు నిర్మాణానికి రంగం సిద్ధం చేశామన్నారు. బహిరంగ మూత్రవిసర్జన రహిత నగరంగా చేయడంలో ప్రజలు సహకారం అందించినందుకు అభినందనలు తెలిపారు.
జిల్లాను కిడ్నీరోగాల కేంద్రంగా మార్చేసిన ఉద్దానంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. గత రెండున్నర దశాబ్ధాలుగా మూలాలు కనుగొనలేని పరిస్థితులపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమిస్తుందన్నారు. నాలుగు నెలల్లో ప్రతీ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఆరు సంచార వైద్యపరీక్షల బృందాలను ఏర్పాటు చేశారన్నారు. 1.20 లక్షల మంది జనాభాకు ఈ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. వ్యాధిగ్రస్తులకు పింఛన్లు, ఉచిత బస్సుపాస్‌లు, వేతనాలు కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు మంత్రి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. స్మార్ట్ గ్రామాలు, వార్డుల కార్యక్రమంలో భాగంగా జనరల్ పార్టనర్లు, సెక్టోరల్ పార్టనర్లు భాగస్వామ్యం అయ్యారని, సైరిగాం గ్రామాన్ని రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి ఎం.రవిచంద్ర, లాభాం గ్రామానికి ఐ.పి.ఎస్.అధికారి జి.సూర్యప్రకాశరావు దత్తత తీసుకుని పురోగతి దిశగా తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పర్యాటకానికి ఉజ్వల భవిత ఉందని, మెట్టుగూడ జలపాతం, ఈతమానుగూడ వ్యూ పాయింట్, చంద్రమ్మతల్లి గుడి, జలవిహారి ఏర్పాటు చేస్తారన్నారు. పెద్దనోట్లు రద్దుతో నగదురహిత జిల్లాగా రూపొందించడానికి 390771 రూపే కార్డులు పంపిణీ చేశామన్నారు. ఇప్పటికే 891 పి.ఓ.ఎస్ మిషన్లు లభ్యంగా ఉండా, మరో 2500 మిషన్లు అవసరమని భావించి వాటిని రప్పిస్తున్నామన్నారు. చంద్రన్న భీమా పథకంలో 11,23,330 మంది నమోదు చేయించుకున్నారని, ఇప్పటి వరకూ 607 మందికి క్లైమ్‌లుగా రూ. 2.29 కోట్లు చెల్లించామన్నారు. పసుపు-కుంకుమ పథకం కింద 4,84,355 మంది మహిళలకు రూ. 145.30 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్టు తెలిపారు. శ్రీకాకుళాన్ని జిల్లా సాంస్కృతిక రాజధానిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. క్రీడాకారులకు కొదవలేని సిక్కోల్ పేరున్న వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి ఆధ్వర్యంలో మల్టీ డిసిప్లినరీ అకాడమీ, రూ. 15 కోట్లతో కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణాలు చేపట్టామన్నారు. జాతీయ ఓటర్లు దినోత్సవం సందర్భంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులలో సిక్కోల్ పిల్లల అశోకచక్రం స్థానం సాధించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అందుకు కష్టపడిన వారందరికీ హృదయపూర్వకంగా అభినందించారు. జిల్లాలో శాంతిభద్రతల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలలో సమర్థవంతంగా వ్యవహరించిన యంత్రాంగానికి, పోలీసుశాఖకు, స్వచ్చంద సంస్థలకు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా జాతీయపతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుపెరేడ్‌లో గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాల్గొన్నారు.

నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి
2013 భూసేకరణ చట్టం అమలు చేయాలి
చెక్కులు పంపిణీ నిలుపుదల చేయాలి
హిరమండలం, జనవరి 26: రిజర్వాయర్ నిర్మాణం మూలంగా ముంపునకు గురైన గ్రామాల నిర్వాసితులు నిరసనలను కొనసాగిస్తున్నారు. గురువారం తులగాం రహదారి పక్కన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ 2013-్భసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని కోరారు. రిజర్వాయర్ పనులను యుద్ద ప్రాతిపదికన చేపట్టి నిర్వాసితుల సమస్యలను పక్కనపెట్టారని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలన్నారు. పునరావాసం, యూత్‌ప్యాకేజీ, ఇతర పరిహారాలు ఉన్నాయన్నారు. ఐకమత్యంగా నిర్వాసితులంతా ఉండాలని, సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యమన్నారు. ప్రభుత్వం 2013 భూసేకరణచట్టం అమలు జరిగే విధంగా చూడాలన్నారు. నిర్వాసిత గ్రామా ల యువత ప్యాకేజీ అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటామని, వీటిని అడ్డుకుంటామన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈమేరకు తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. తహశీల్దార్ మాట్లాడుతూ ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.