శ్రీకాకుళం

వెంటాడుతున్న.. స్వైన్‌ఫ్లూ...్భయం!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 31: తెలుగు రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ జాడలతో శ్రీకాకుళం వైద్య,ఆరోగ్యశాఖ రిమ్స్‌లో మళ్లీ స్వైన్‌ఫ్లూ వార్డుకు తాళాలు తెరిపించాయి. అందుబాటులోకి మందులు, మాస్కులు సమకూర్చేలా చేశాయి. ఎక్కడ చూసినా ఫ్లూ ఫీవరే కనిపిస్తోంది. తుమ్మినా, దగ్గినా అనుమానపు చూపులే. ఇతర ప్రాంతాల నుంచి జలుబు వంటి అనారోగ్యంతో ఎవరైనా వస్తే స్థానికులు భయపడుతున్నారు. రాష్ట్రంలో చుట్టుపక్కల జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు అవుతుండటంతో సిక్కోల్‌లో భయాందోళనలు తలెత్తున్నాయి. జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి అప్రమత్తంగా ఉన్నామని చెబుతుంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో రిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును మళ్లీ తెరిచారు. ఇంతవరకూ స్వైన్‌ఫ్లూ కేసు ఒక్కటి కూడా నమోదు కాకపోయినా ప్రజల్లో మాత్రం భయం వెంటాడుతోంది. ప్రస్తుతం వీస్తున్న శీతల గాలులకు జలుబు, జ్వరం వస్తే చాలు ఆందోళనలతో వణికిపోతున్నారు. సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు సైతం కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చలిగాలులు పెరగడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా మాస్క్‌లు పెట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. స్వైన్‌ఫ్లూ వ్యాపించకుండా వ్యక్తిగత శుభ్రతే ముఖ్యమని వైద్య,ఆరోగ్యశాఖ హెచ్చరిస్తుంది.
శ్రీకాకుళానికి వందలాది కిలోమీటర్లు దూరంలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైతే..ఇక్కడ స్వైన్‌ఫ్లూ కలకలం రేగుతోంది. హైదరాబాద్, విజయవాడ, తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలు ఇలా..అన్నీ ప్రాంతాల నుంచి సంక్రాంతి పండుగకు జిల్లావాసులు ఇంటికొచ్చారు. అక్కడ జ్వరాలు సిక్కోల్‌కు తీసుకువచ్చారేమోనన్న భయం ఇక్కడ వైద్యాధికారులకు వెంటాడుతోంది. గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ 33 అనుమానిత కేసులు తేలాయి. పరీక్షలు చేయగా, వీరిలో ఎనిమిది మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్థారణ అయింది. అదే తరహాలో ఇప్పుడు కూడా ఆ జాడలు సిక్కోల్‌ను వెంటాడితే..ప్రాణనష్టం జరిగిపోతాదన్న భయంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత ఏడాది ఇదే సమయంలో జిల్లాను స్వైన్‌ఫ్లూ వణికించింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతోపాటు, సీతంపేట, భామిని, ఉద్దానం, బొద్దాం, వంగర ప్రాంతాలలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీరంతా పక్క జిల్లాల నుంచి పండుగ కోసం ఇంటికి వచ్చిన కుటుంబాలకు చెందినవారే.
ఈసారి స్వైన్‌ఫ్లూ విజృంభించక ముందే వ్యాధికి సంబంధించి చికిత్స అందించేందుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వైద్య,ఆరోగ్యశాఖాధికారులు సుస్పష్టం చేస్తున్నారు. రిమ్స్ ఆసుపత్రితోపాటు ఏరియా ఆసుపత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, సీహెచ్‌సీలలో అవసరమైన పడకలతో ప్రత్యేక వార్డులను ఇందుకోసం ఏర్పాటుకు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సనపల తిరుపతిరావు చర్యలు తీసుకుంటున్నారు. ఫ్లూ లక్షణాలు ఉన్న జ్వరం కేసులను నిరంతరం పర్యవేక్షించేలా ఏజెన్సీల్లో అప్రమత్తమయ్యారు. నిత్యం ఇంటింటి సర్వే నిర్వహించాలని ఇప్పటికే పారామెడికల్ సిబ్బంది, వైద్యాధికారులకు ఆదేశించారు. గాలి ద్వారా ఒకరినుంచి మరొకరికి సోకే ఈ జ్వరం విపరీతమైన ఒళ్ళునొప్పులతో రావడం మొదలవుతుందని, బాగా జలుబు, దగ్గుతో ఇబ్బందిపడుతూ గొంతారిపోవడం, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడం, అలసట, వణుకు, వాంతులు, అతిసారం లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరగా ఉన్న ఆసుపత్రికి వెళ్ళి ఇన్‌పెషెంటుగా చేరాలంటూ జిల్లా వైద్యశాఖ ప్రచారం మొదలుపెట్టింది.
అప్రమత్తంగా ఉన్నాం :
జిల్లావైద్యాధికారి తిరుపతిరావు
ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో స్వైన్‌ఫ్లూపై చర్యలు తీసుకున్నామని, ముందస్తుగా పలు ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేసినట్టు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సనపల తిరుపతిరావు ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. దీనికి సంబంధించి జిల్లాలో వైద్యాధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇంతవరకూ ఎక్కడా కేసులు నమోదుకాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ఆసుపత్రికి వెంటనే వెళ్ళాలన్నారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అన్నీ ప్రాంతీయ వైద్యశాలల్లో రెండేసి పడకలు చొప్పున్న ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
* పార్టీని బలోపేతం చేయాలి * లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ

శ్రీకాకుళం(రూరల్), జనవరి 31: రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, పార్టీని బలోపేతం చేయాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టిబాబ్జీ అన్నారు. ఎన్జీవో హోమ్‌లో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తూ.గో జిల్లాల క్రియాశీల నాయకత్వ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజహితం కోరుకునే పార్టీ లోక్‌సత్తా అని అన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌గా భావిస్తే చంద్రబాబు దానికి ఆయింట్‌మెంట్ ఉందన్నారన్నారు. బిజెపి, చంద్రబాబు కుటిల డ్రామా ఆడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకురావాలని, లేకుంటే కనీసం వెనుకబడిన రాయలసీమ నాలుగు జిల్లాలకు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ 7 జిల్లాల్లోనూ తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తి, మానవాభివృద్ధి సూచికల్లోనూ వెనుకబడి ఉన్నాయని, ఈ నివేదికలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకుని రాజకీయ డ్రామాలు లేకుండా బిజెపి,టిడిపిలు వ్యవహరించాలని, లేకుంటే కాంగ్రెస్‌కి పట్టిన గతి వీరికీ పడుతుందన్నారు.
పెద్దనోట్ల విషయమై భారతప్రధాని నరేంద్రమోదీ చంద్రబాబును కమిటీకి అధ్యక్షునిగా నియమించారని, చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా విషయమై ప్రధానిమంత్రితో ఎందుకు ఒప్పించడం లేదన్నారు. అఖిలపక్షాలతో సమావేశం ఎందుకు నిర్వహించడం లేదన్నారు. మాయమాటలు చెప్పకుండా ప్రత్యేక హోదాపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం, స్టీరింగ్ కమిటీ సభ్యులు పంచాదిరాంబాబు, ఆకుల దామోదర్, ఎంఎస్‌ఎన్ మూర్తి, ముదునూరి రాజ్‌వర్మ, జిల్లా అధ్యక్షులు కె.పోలినాయుడు పాల్గొన్నారు.

టిడిపి సంస్థాగత కమిటీల్లో గిరిజనులకు చోటు
* పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి కలిశెట్టి

శ్రీకాకుళం, జనవరి 31: తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ నియమావళిపై ప్రజారాజధాని అమరావతి కేంద్రంగా మంగళవారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, కేంద్ర పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి జిల్లా నుంచి పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి కలిశెట్టి అప్పలనాయుడు హాజరై గిరిజన ప్రాంతాలకు సంస్థాగత కమిటీల్లో సముచిత స్థానం కల్పించాలని పార్టీ దృష్టికి తీసుకువెళ్లారు. గడిచిన ఎన్నికల్లో గిరిజన ప్రాంతాల్లో ఉన్న అధిక శాతం ఓటర్లు వైకాపా అభ్యర్థులను ఆదరించారని, అయితే తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో వారంతా ప్రస్తుతం టిడిపి వైపు ఆకర్షితులౌతున్నారన్నారు. ఇటీవల జిల్లాలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో తాను పర్యటించి ఈ అంశంపై అధ్యయనం చేశానని అధిష్టానం దృష్టికి అప్పలనాయుడు తీసుకువెళ్లారు. ఈ సూచనను పరిగణనలోకి తీసుకొని ఫిబ్రవరి నుండి మే వరకు సంస్థాగత ఎన్నికల్లో గిరిజన ప్రాంత యువతకు భాగస్వామ్యం కల్పిస్తామని, వారం రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని కళావెంకటరావు,లోకేష్‌బాబు స్పష్టంచేసినట్లు అప్పలనాయుడు తెలిపారు. ఈసమావేశంలో కోళ్ల అప్పలనాయుడు, ఎల్ ఎల్ నాయుడు, చాపర గణపతి, మల్లా బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే తలె భద్రయ్య జిల్లా నుంచి హాజరయ్యారు.

సేంద్రియ ఎరువుల వాడకం పెరగాలి
* కలెక్టర్ లక్ష్మీనృసింహం
సంతకవిటి, జనవరి 31: వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయం పెరగాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కాకరాపల్లి, మందరాడ, అప్పలఅగ్రహారం గ్రామాల్లోని సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలను పరిశీలించారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలన్నారు. అప్పలఅగ్రహారం గ్రామంలోని బొడ్డేపల్లి అప్పలనాయుడు అనే రైతు తనపొలంలో సేంద్రియ పద్ధతి ద్వారా సాగు చేస్తున్న తీరును చూసి కలెక్టర్ అభినందించారు. అనంతరం ఏపిఒ హరినాథ్‌కు మండలంలోని వర్మీకంపోస్టు యూనిట్లను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కాకరాపల్లి సర్పంచ్ రామకృష్ణారావు వర్మీకంపోస్టు బిల్లులు అందడం లేదని కలెక్టర్‌కు విన్నవించారు. త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం అప్పలఅగ్రహారం గ్రామ సమస్యలపై సర్పంచ్ దవళ సీతమ్మ కలెక్టర్‌కు వివరించారు. గ్రామంలో వార్డు మెంబర్ల నిర్వాహకం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. పింఛన్ల కోసం కోర్టు తీర్పు ఇచ్చినా నేటికీ మంజూరు చేయలేదన్నారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు ఆమె అందించారు. ఈ కార్యక్రమంలో ఏపిడి ప్రకాష్, తహశీల్దార్ సత్యనారాయణ, సివిల్ సప్లై డిటి సాయి, మాజీ సర్పంచ్ సురేష్‌కుమార్, నరసింహమూర్తి పాల్గొన్నారు.

ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వం
* ఎమ్మెల్యే జోగులు
వంగర, జనవరి 31: రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను మోసగించే విధానాలను అనుసరిస్తుందని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు విమర్శించారు. మంగళవారం మద్దివలస పంచాయతీ జగన్నాథవలస గ్రామంలో గడపగడపకూ వైకాపా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను గ్రామస్థులకు వివరించారు. గ్రామంలో నెలకొని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మడ్డువలసలో అనారోగ్యంతో బాధపడుతున్న విశ్రాంత ఏఎస్‌ఐ లక్షుంనాయుడును పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా కన్వీనర్ ఉత్తరావల్లి సురేష్‌ముఖర్జీ, కిమిడి ఉమామహేశ్వరరావు, బొంతు వెంకటరావు, మురళీకృష్ణ, కె.సుదర్శనరావు పాల్గొన్నారు.

కవిటి ఆసుపత్రిని సందర్శించిన ఎస్పీ
కవిటి, జనవరి 31: మండల కేంద్రం కవిటిలోని ప్రభుత్వాసుపత్రిని జిల్లా పోలీసు అధికారి బ్రహ్మరెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్యులు మనోహర్‌తోపాటు సర్పంచ్ పి.శేఖర్, జెడ్పీటిసి రమేష్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ ఎ.రాజులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు తమ వంతుగా రెడ్డీస్ ల్యాబరేటర్సీ ఆధ్వర్యంలో రెండు డయాలసిస్ యూనిట్‌లు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన సర్పంచ్, జెడ్పీటిసిలు మాట్లాడుతూ యూనిట్‌ల ఏర్పాటుతోపాటు నెఫ్రాలజిస్టు, కిడ్నీ వ్యాధి నిపుణులు, టెక్నిషియన్‌లను నియమించేందుకు చర్యలు తీసుకుంటే మా ప్రాంతానికి మేలు చేసేవారవుతారన్నారు. దీనిపై ఎస్పీ సానుకూలంగా స్పందించారు. అంతకుముందు స్థానిక పోలీసుస్టేషన్‌ను సందర్శించి పరిసరాలను, పోలీసుక్వార్టర్స్‌ను పరిశీలించారు. ఎస్పీతోపాటు డి ఎస్పీ వివేకానంద, ఇచ్ఛాపురం సిఐ అవతారం, కవిటి ఇన్‌ఛార్జి ఎస్ ఐ చిన్నంనాయుడుపాల్గొన్నారు.

విధుల్లో చేరేందుకు తహశీల్దార్ విముఖత
* నిలిచిపోయిన నిర్వాసిత గ్రామాల సమస్యలు
కొత్తూరు, జనవరి 31: కొత్తూరు రెవెన్యూ కార్యాలయానికి బదిలీపై వచ్చిన తహశీల్దార్ ఎం.సావిత్రి విధుల్లో చేరేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారని రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ పనిచేసిన తహశీల్దార్ రామకృష్ణను కలెక్టర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈయన స్థానంలో సీతంపేట తహశీల్దార్ సావిత్రిని కొత్తూరు తహశీల్దార్‌గా బదిలీ చేసినట్టు పేర్కొన్నారు. అయితే ఆమె కొత్తూరు తహశీల్దార్‌గా విధులు నిర్వహించేందుకు విముఖంగా ఉన్నారని రెవెన్యూ వర్గాలు తెలియజేస్తున్నాయి. విధుల్లో చేరకపోవడమే కాక సెలవుపై ఉన్నట్టు డిటి శంకరరావు తెలిపారు. ఇదిలాఉండగా మండలంలోని నిర్వాసిత గ్రామాల్లో యూత్ ప్యాకేజీల జాబితాలు తయారు చేయడంతోపాటు పలు సదస్సులు నిలిచిపోయాయి. సస్పెండ్‌కు గురైన తహశీల్దార్ అడవికొత్తూరు, గూనభద్ర, కృష్ణాపురం గ్రామాల్లో యూత్ ప్యాకేజీల జాబితాలో అనర్హులకు చోటు కల్పించిన నేపధ్యంలో సస్పెండ్‌కు గురికావడం గమనార్హం. జిల్లా అధికారులు స్పందించి ఈయన తయారుచేసిన జాబితాలను పరిశీలించి అర్హులకు చెక్కులు అందించాలనే ఉద్దేశ్యంతో సీతంపేట, సోంపేట తహశీల్దార్లు సావిత్రి, గోపాలరత్నంను కలెక్టర్ నియమించారు. కృష్ణాపురంలో ప్రభుత్వం 116 మంది యువతకు చెక్కులు పంపిణీ చేసింది. ఇక్కడ కూడా అనర్హులు, మృతి చెందిన వారు ఉండడంతో తహశీల్దార్ సావిత్రి పరిశీలించి చెక్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అయితే రాజకీయ ఒత్తిళ్లకు లోనై మంజూరైన యూత్ ప్యాకేజీలన్నీ ఆమె చేతుల మీదుగా పరిశీలించకుండా మంజూరు చేశారని ఆరోపణలు ఉండడంతో సమగ్ర దర్యాప్తు నిర్వహించి జాయింట్ కలెక్టర్ ఉన్నతాధికారులను నియమించారు. ఇక్కడ కూడా అనర్హులుంటే తనపై కూడా వేటు ఉంటుందని భావించి సావిత్రి విధుల్లో చేరకుండా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయినట్టు రెవెన్యూ వర్గాలు చర్చించుకుంటున్నారు. డిటి శంకరరావు వద్ద ఈ విషయం ప్రస్తావించగా కొత్తూరు తహశీల్దార్‌గా సావిత్రి విధుల్లో చేరలేదని, సెలవుపై వెళ్లినట్టు తెలిపారు.

ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం
* ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి

గార, జనవరి 31: మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించితీరుతామని స్తానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి స్పష్టం చేసారు. యేటా ఖరీఫ్ కాలంలో శివారు ఆయకట్టుకు సాగునీటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో రైతాంగం ఎదుర్కోంటున్న నీటి సమస్యలు దృష్టిలో ఉంచుకొని వాటిని అధిగమించేందుకు చర్యలు చేపట్టామని స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి స్పష్టం చేసారు. మండలం బూరవెల్లి, అంబళ్లవలస, పూసర్లపాడు ప్రాంతాల్లోని వంశధార నది పరీవాహకంలో ఎత్తిపోతలు పథకం ఏర్పాటు చేసి తద్వారా శివారు ఆయకట్టు రైతల సాగునీటి సమస్యలు అధిగమించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. భైరిదేశిగెడ్డ, వంశధార లింకు కాలువలు ద్వారా మండల రైతాంగానికి సాగునీరు అందుతుందని, అయితే వాతావరణం అనుకూలించక నదిలో నీటి ప్రవాహం తగ్గుతున్న సమయంలో ఆయకట్టు రైతాంగానికి నీటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. రైతుల నీటి సమస్యలు అధిగమించేందుకు గాను అత్యవసర పరిస్థితిలో ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకాన్ని నదీ పరీవాహకంలో ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ముందుగా బూరవెల్లి, అంబళ్లవలస, పూసర్లపాడు ప్రాంతాల్లో పరిశీలించినప్పటికీ బూరవెల్లి, పూసర్లపాడు ప్రాంతాల్లో ఏర్పాటునకు స్థలం అనకూలంగా ఉందని ఇరిగేషన్ ఇంజనీర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమె వెంట ఇరిగేషన్ ఎస్.ఇ. డి.అప్పలనాయుడు, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు గుండ భాస్కరరావు, సర్పంచులు గొండు వెంకటరమణమూర్తి, కొంక్యాణ ఆదినారాయణ, బడగల వెంకటప్పారావు, కొయ్యాన జగదీష్‌లతో పాటు మళ్ల అబ్బాయినాయుడు, అరవల పెదబాబు, పీస వెంకటరమణమూర్తి ప్రగఢ అమ్మన్నాయుడులతో పాటు నీటి సంఘాల అధ్యక్షులు, డిస్ట్భ్య్రిటరీ కమిటి సభ్యులు, ఆయకట్టు రైతులు, ఇరిగేషన్, వంశధార అధికారులు పాల్గోన్నారు.

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి
* మాజీ మంత్రి కోండ్రు
శ్రీకాకుళం(రూరల్), జనవరి 31: రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ పొందుపర్చడం జరిగిందని మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ అన్నారు. ఇందిరా విజ్ఞాన్‌భవన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ అప్పటి ప్రతిపక్ష నేత వెంకయ్యనాయుడు రాష్ట్రానికి పదేళ్లు హోదా కావాలని కోరగా, చంద్రబాబు నాయుడు పదిహేనేళ్లు కావాలన్నారని అయితే ప్రస్తుతం వాటిని ఎందుకు విస్మరిస్తున్నారో ప్రశ్నించారు. ప్రజలను నమ్మబలికేలా మోసగిస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంటులో 11 పార్టీలు ఒక చోటుకు తీసుకువచ్చి హోదాను ఇవ్వాలని కోరినట్లు తెలియజేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను మట్టిలో కలిపేస్తున్నారని, తస్మాన్ జాగ్రత్త అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడి పోతున్నారన్నారు. పడుతున్నారన్నారు. వంశధార నిర్వాశితులకు 2013 ప్యాకేజి ఇవ్వాలని కోరితే బూతులు తిట్టడం వంటివి చేపడుతున్నారని, తమకు కూడా వినతులు వచ్చినట్లు తెలియజేశారు. నిర్వాశితులపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులపై ఉన్నతస్థాయి అధికారిగా ఉన్న ఎస్పీ బ్రహ్మారెడ్డి ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు అన్నారు. విలేఖర్ల సమావేశంలో డిసిసి అధ్యక్షులు డోల జగన్, డి ఎస్‌కె ప్రసాద్, గోవింద మల్లిబాబు, సనపల అన్నాజీరావు, కామేశ్వరి, రాధ, ఈశ్వరి ఉన్నారు.