శ్రీకాకుళం

విక్టరీలు..విఐపిలు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 3: జిల్లాకు మాఘశుద్ధ సప్తమి ఘడియల్లో అరసవల్లి క్షేత్రములో వైభవంగా జరిగే ఆదిత్యుని జయంతి ఉత్సవమే కీలకమైన పండుగ. దీనికోసం రెండుమూడు నెలలుగా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తునే ఉంటోంది. భక్తుల సౌకర్యాలు, క్యూలైనే్ల ఆవశ్యకతగా తీసుకునే నిర్ణయాల్లో, ఈసారి ప్రొటోకాల్ పవర్‌ఫుల్ అంశాన్ని కలెక్టర్ తెరమీదకు తీసుకువచ్చారు. దీంతో రథసప్తమి రోజున ప్రజాప్రతినిధులంతా విక్టరీలుగా చూపించేందుకు జిల్లా యంత్రాంగం అష్టకష్టాలు పడింది. కేవలం అరకిలోమీటరు దూరంలోగల ఆలయ ప్రధాన సింహద్వారానికి చేర్చేందుకు పైలట్ వాహనాలు, బుల్లిసైరన్ బుగ్గలు కలిగిన సుందరమైన వాహనాలు, విఐపిల కుటుంబాలకు ప్రత్యేకాధికారిగా ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అందులో ఆయనకు సూటుకోటు..ఇలా జిల్లా కలెక్టర్, ఎస్పీల అత్యుత్సాహంగా అధికారాలు మండలాధ్యక్షుడు నుంచి మంత్రి వరకూ అందరికీ ఒకేరీతిలో గౌరవించడంతో ఈసారి విఐపిలంతా చాలా సంతోషంగా కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లు సూపర్‌డూపర్ అంటూ మీడియా మైకుల ముందు ప్రశంసలు గుప్పించారు. జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మీ, ఎం.పి. రామ్మోహన్‌నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు గౌతు శ్యామసుందరశివాజీ, బగ్గు రమణమూర్తి, కంబాల జోగులు, వి.కళావతి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, ఉత్తరాంధ్ర వైకాపా ఇన్‌ఛార్జి వీరభద్రస్వామి, విశాఖ జెడ్పీ చైర్మన్ భవానీ, జిల్లా ఉన్నతాధికారులు ఆదిత్యుని సేవలో పాల్గొన్నారు. వీరంతా రాష్ట్రం, జిల్లా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయంటూ కలెక్టర్, ఎస్పీలు పేర్కొన్నారు. అసలుకథలోకి వెళ్తే వీరు వచ్చిపోయే మార్గం డోనర్ భక్తులను చాలా ఇబ్బందులకు గురిచేసింది. శాఖాపరమైన ప్రొటోకాల్ అంటూ రెవెన్యూ యంత్రాంగానికి బాధ్యతలు అప్పగించిన విధులు నిర్వహించడంలో వారి ఆత్మాభిమానాన్ని కూడా పక్కనపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయంటూ రెవెన్యూ సిబ్బంది చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వశాఖలతోపాటు అన్నీ వర్గాల ప్రజలు సైతం విఐపిల రెడ్‌కార్పెట్ గుండా ఆదిత్యుని దర్శనానికి వెళ్తే...రాత్రింబవళ్ళు శాంతిభద్రతల విధినిర్వహణలో ఉన్న పోలీసులు మాత్రం వారి కుటుంబాలతో క్షీరాభిషేక సేవ, నిజరూప దర్శనానికి వచ్చేందుకు ఎస్పీ అల్టిమేటం అడ్డుతగిలింది. దీంతో వారంతా డీలా పడిపోయారు. అన్నీ శాఖలకు చెందిన వారి కుటుంబాలకు పోలీసులే ప్రధాన గేటులవద్ద ఎంట్రీ ఇస్తుంటే..వారి కుటుంబాలకు మాత్రం నో ఎంట్రీ చెప్పే మాట వారిని చాలా కుంగదీసిందంటూ చెబుతున్నారు.
ఆదిత్యా.. మన్నించు!!
ప్రత్యక్ష దైవం అరసవల్లి ఆదిత్యుని రథసప్తమి వేడుకల్లో ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఏర్పాట్లు చేయడంతో ఆలయ అర్చకులు ఆదిత్య మన్నించంటూ వౌనం దాల్చడం విశేషం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా సాధారణ భక్తులకు నిజరూప దర్శనం కల్పించాల్సిన అధికార యంత్రాంగం ముందుచూపు లేని అంచనాలతో నిర్ణయాలు తీసుకోవడంతో దేవాదాయశాఖకు లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లింది. జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి చివరి నిమిషం వరకు రథసప్తమి ఏర్పాట్లతో ఉత్కంఠ సృష్టించేలా నిర్ణయాలు తీసుకోవడం దేవాదాయ ఆలయ అర్చకులు పరుగులు పెట్టించాయి. క్యూలైన్ల ఏర్పాట్లలో ముందుచూపు కొరవడడంతో భక్తులు లేమి సుస్పష్టంగా కనిపించింది. రద్దీ నివారించేందుకు పోలీసులు హంగామా చేయడంతో సాధారణ భక్తులు దర్శనానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందనే చెప్పకతప్పదు. ముఖ్యంగా 500 రూపాయలు దర్శనానికి టిక్కెటు ధర నిర్ణయించడం, ఒకరికే ప్రవేశం కల్పిస్తూ భారీ అంచనాలతో తీసుకున్న నిర్ణయం వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం భక్తుల ప్రభావం దానిపై పూర్తిగా పడింది. అధికారుల అంచనాలు తలకిందులైంది. ఊహించిన స్థాయిలో ఆ టిక్కెట్లు చెల్లకపోవడమే కాకుండా ఖరీదైన భక్తుల కోసం ఏర్పాటుచేసిన క్యూలైన్లకు సుమారు ఐదు లక్షల రూపాయలు దేవాదాయశాఖ అధికారులు వెచ్చించి చేతులు కాల్చుకున్నట్లు ఆ శాఖ అసిస్టెంట్ కమిషనరే గోడు వినిపించడం గమనార్హం. గత ఏడాది మాదిరిగా టిక్కెట్లు ముద్రించాలని అధికారులు హితబోధ చేసినా జిల్లా ఉన్నతాధికారులు ససేమిరా అనడంతో లక్షల వ్యయం వృథా అయిందని అధికారులు వాపోతున్నారు. ఇదిలాఉండగా 500 రూపాయలు టిక్కెటు కొనుగోలు చేసిన భక్తులకు సత్వరమే దర్శనం కల్పించాలని, ఆగమ శాస్త్రం పక్కన పెట్టి ఉత్తర మార్గం గుండా ప్రవేశం కల్పించేందుకు ఆలయ పురాతన గోడను తొలగించడం గొప్ప అపచారమని అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఆలయ ఉత్తర ద్వారం నుంచి స్వామివారికి దర్శించకునేందుకు వీలుగా పురాతన కాలంలో ఉత్తర ద్వారాన్ని దేవతలు ఈ ఆలయ నిర్మాణంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ద్వారం ఉంటుండగా, అదే దిశలో 500 రూపాయలు మార్గాన్ని ఏర్పాటు చేయకూడదని అర్చక పెద్దలు చెప్పినా కలెక్టర్, ఎస్పీలు పెడచెవిన పెట్టి ఏకపక్షంగా ఉత్తర మార్గం గుండా దర్శనం కల్పించి ఆగమశాస్త్రాన్ని అవమాన పర్చాన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వలన 500 రూపాయలు దర్శనానికి భక్తులు కరువయ్యారని అర్చకులు చెప్పుకుంకున్నారు. ఏర్పాట్లలో పొరపాటు ఉన్నాయనడానికి బారికేడ్ల నేలకు ఒరగడం, టెండరింగ్‌కు పాల్పడడం పనుల్లో నాణ్యత లోపించడం వంటి తప్పిదాలు ఈ ఏడాది పునరావృతం అయ్యాయనడానికి నిదర్శనాలే.