శ్రీకాకుళం

స్వచ్ఛమైన నీటిని సద్వినియోగం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, ఫిబ్రవరి 3: తీరగ్రామాల్లో చెలమల ద్వారా సేకరించిన నీటితో పాటు నీటి పథకాల ద్వారా వచ్చే మంచినీరు ప్రజల దాహార్తిని అరకొరగా తీరుస్తుందన్న ఉద్ధేశ్యంతో సముద్రపు నీటిని స్వచ్ఛమైన తాగునీరుగా మార్చే ప్లాంటును ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారని, స్వచ్చమైన తాగునీటిని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మినృసింహం అన్నారు. ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో టాటా కంపెనీ ఆర్.ఓ.ప్లాంటును బందరువానిపేట తుపాను రక్షిత భవనంలో నెలకొల్పింది. జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కృషి మేరకు ఈ ప్రాంతంలో వాటర్ ప్లాంటు ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో శుక్రవారం వాటర్ ప్లాంటు ప్రారంభం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీనృసింహం మాట్లాడుతూ అందరూ సమష్టిగా కృషి చేస్తే సమస్యలు అధిగమించవచ్చన్నారు. మరుగుదొడ్లు, గ్రంథాలయం, రహదారులు తదితర అవసరాలు తీర్చేదిశగా చర్యలు చేపడతానని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ గడచిన ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రాధాన్యతా క్రమంలో నెరవేరుస్తున్నామన్నారు. తీరగ్రామ ప్రాంతాల ప్రజలు దాహార్తి తీర్చే దిశగా చర్యలు చేపట్టామన్నారు. రానున్న వేసవినాటికి బందరువానిపేట, మత్స్యలేశం పంచాయతీ గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందజేయనున్నట్లు ఆమెచెప్పారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఎ. పి.డి డా.కిషోర్, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎ.ఇ., మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు గుండ భాస్కరరావు, మార్కెటింగ్ కమిటి అధ్యక్షుడు ఎం.శ్రీను, మండల ఉపాధ్యక్షురాలు యల్లాయమ్మ, ఎం.పి.డి.ఓ. ఆర్.స్వరూపరాణి పాల్గ్గొన్నారు.

ఇంద్ర పుష్కరిణి వద్ద పూజలు
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 3: రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని శ్రీ సూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు ఇంద్రపుష్కరిణి వద్ద పూజలు నిర్వహించేందుకు పోటీపడ్డారు. జిల్లా నలుమూలల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. పితృదేవతలను సంతృప్తి పరిచేలా మట్టికుండలో పొంగలి తయారుచేసి వాటిని ఆముదం ఆకులలో నైవేధ్యం పెట్టి మొక్కులు చెల్లించుకునేందుకు మహిళా భక్తులు పోటీపడ్డారు. అలాగే జంగమ, దేవరలకు కానుకలు ఇచ్చి పితృదేవతలను పొడిగించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. భక్తులు పూజాసామగ్రికి ధరలు పెంచి చిరువ్యాపారులు సొమ్ము చేసుకోవడం కనిపించింది.