శ్రీకాకుళం

అక్రమాలకు పాల్పడిన ఎంపిడివో అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భామిని, ఏప్రిల్ 24: మూడేళ్ల కిందట శ్రీకాకుళం జిల్లా భామిని ఎంపిడివోగా పని చేస్తూ పింఛన్ల వ్యవహరంలో అక్రమాలకు పాల్పడిన ఎంపిడివో బి.విజయలక్ష్మిని ఆదివారం అరెస్టు చేసినట్లు బత్తిలి ఎస్సై టి.శ్రీనివాసరావు తెలిపారు. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన రూ.2,03,400లు పంపిణీ చేయకుండా సొంతానికి వినియోగించుకున్నట్లు విచారణలో వెల్లడైందని, దీంతో డిఆర్‌డిఎ పిడి తనూజరాణి బత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపిడివోను అరెస్టు చేసి కొత్తూరు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చినట్లు ఎస్సై పేర్కొన్నారు.

దళితులకు దర్శనం నిరాకరణపై
పోలీసులకు ఫిర్యాదు
మెళియాపుట్టి, ఏప్రిల్ 24: మెళియాపుట్టి మండలం బాణాపురం పంచాయతీ పరిధి సృజనిలో ఇటీవల గ్రామస్తుల ఆర్థిక సహాయంలో నిర్మించిన శ్రీ అభయ రామాలయం లోపలికి దళితులు ప్రవేశించరాదని ఆలయ కమిటీ ఆంక్షలు విధించింది. ఈ నెల 15 నుంచి 17 వరకు సృజనిలో శ్రీరామాలయం ప్రతిష్ఠకు గ్రామస్తులందరూ ఐకమత్యంతో ఘనంగా నిర్వహించారు.
17న అన్నదానంలో దళితులు సహఫంక్తి భోజనానికి దూరంగా ఉండాలని ఆలయ కమిటీ సూచించింది. దీంతో ఆలయంలో పూజలు నిర్వహించడానికి తమను అనుమతించలేదని గ్రామానికి చెందిన దళితులు ఇప్పిలి రామారావు, 30 కుటుంబాలకు చెందినవారు ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ లక్ష్మణరావు మాట్లాడుతూ సృజనిలో ప్రజల ఆర్థిక సహాయంతో నిర్మించిన రామాలయంలోకి దళితులను పూజల కోసం అనుమతించలేదని, సహపంక్తి భోజనం వద్ద అగ్రవర్ణాలు కులవివక్ష చూపారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దళితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన విలేఖరులకు తెలిపారు.