శ్రీకాకుళం

‘డయల్ యువర్ కలెక్టర్’కు 13 ఫోన్‌కాల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 6: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 13 ఫోన్‌కాల్స్ వచ్చాయి. జెసి-2 రజనీకాంతారావు డయల్‌యువర్‌కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలాకి మండలం నుండి వై.వాసుదేవరావు మాట్లాడుతూ పందిగుట్ట చెరువు గట్టును వ్యవసాయ రహదారిగా మార్చాలని కోరారు. వంగర మండలం నుండి వై.సుదర్శన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు తన కుడిచేయి విరిగిందని, వికలాంగుల పింఛన్‌కోసం దరఖాస్తు చేసుకున్నానని ఇంతవరకు పింఛన్ మంజూరు కాలేదని,తన దరఖాస్తును పరిశీలించాలని కోరారు. శ్రీముఖలింగం యాత్రకు భక్తుల సౌకర్యార్థ్యం సరైన ఏర్పాట్లు చేయాలని అదే గ్రామ వాసి ఎన్.రాజశేఖర్ కోరారు. కొత్తూరు మండలం బలద గ్రామానికి చెందిన ఐ.ప్రభాకరరావు మాట్లాడుతూ బలద వద్ద డీజిల్ జనరేటర్లు వాడటం వలన ధ్వని కాలుష్యం ఎక్కువగా ఉందని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. హిరమండలం చినకొల్లివలస నుండి ఆర్.మనోహర్ మాట్లాడుతూ వంశధార నిర్వాసితుల యూత్‌ప్యాకేజీకి అనర్హురాలైన గేదెల కుసుమకు చెక్కు అందజేశారని, దీనిపై చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి కిషోర్‌కుమార్, సెట్‌శ్రీ సిఇఓ మూర్తి, సిపిఓ శివరామనాయకర్ పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌కు పలు వినతులు
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 6: జిల్లా కలెక్టర్ కార్యాలయ ఫిర్యాదుల విభాగంలో జెసి-2 రజనీకాంతారావు వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన వారు వినతులు అందజేశారు. వ్యక్తిగత సమస్యలు భూమి తగాదాలు, స్వయం ఉపాధి కల్పనకు పింఛన్లు మంజూరుకు వినతులు సమర్పించారు. సంతబొమ్మాళి మండల వడ్డితాండ్రకి చెందిన మత్స్యకారులు వినతిపత్రం సమర్పిస్తూ తంపరభూములు ఆక్రమించుకొని రొయ్యల చెరువును తవ్వుతున్నారని, దీనివలన తమ జీవనోపాధి దెబ్బతింటోందని, సమస్య పరిష్కరించాలని కోరారు. హిరమండలం కోరాడ గ్రామస్థులు వంశధార రిజర్వాయర్‌లో భూములు కోల్పోయామని, తమ గ్రామానికి యూత్ ప్యాకేజీ వర్తింపజేయాలని కోరారు. ఇదే మండలం నీలకంఠాపురం వాసులు రిజర్వాయర్‌లో తాము భూములు కోల్పోయామని, తమ గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా గుర్తించాలని కోరారు. హైదరాబాద్‌లో ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ క్రైస్తవ మత పెద్దలు వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి కిషోర్‌కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ భాస్కరరావు, సెట్‌శ్రీ సిఇఓ మూర్తి, సిపివో శివరామనాయకర్ పాల్గొన్నారు.