శ్రీకాకుళం

గర్బిణికి పలాస ప్రభుత్వాసుపత్రిలో చేదు అనుభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, ఫిబ్రవరి 7: తల్లీబిడ్డల సంరక్షణే ప్రభుత్వ ఆసుపత్రి ధ్యేయమని పెద్దపెద్ద ప్రకటనలు చూడడానికి తప్పితే సర్కారు దవాఖానాల్లో గర్బిణులకు చేదు అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. పలాస ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం కోసం రంగోయి నుంచి యోగీశ్వరీ అనే గర్బిణి సోమవారం వేకువజామున 5 గంటల సమయంలో తల్లిబిడ్డల ఎక్స్‌ప్రెస్‌లో పలాస ప్రభుత్వాసుపత్రికి చేరుకుంది. అప్పటికే ఆమెకు రక్తస్రావం అవుతుండడంతో ఆసుపత్రి సిబ్బంది ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారు. ఆ సమయంలో స్ర్తి వైద్యనిపుణులు లేకపోవడంతో దిగువస్థాయి సిబ్బంది ఆమెను చేర్చుకునేందుకు వెనుకంజ వేస్తూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిపోవాలన్నారు. దీంతో యోగీశ్వరీ తల్లిదండ్రులు కామేశ్వరరావు, రూపవతి ఆవేదన వ్యక్తం చేస్తూ తమవద్ద అంత డబ్బు లేదని, మా కుమార్తె ప్రాణాలను కాపాడాలని ప్రాథేయపడ్డారు. ఈ విషయం మీడియాకు తెలియడంతో కొంతమంది ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ గాలి కృష్ణారావుకు సమాచారం ఇవ్వడంతో పలాస ఎమ్మెల్యే శివాజీతో వచ్చి సిబ్బందిని ఏమి జరుగుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తూ ముందుగా ఆమెను చేర్చుకొని వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. డ్యూటీ డాక్టరు కోదండరావు నిర్లక్ష్యంగా వ్యవహరించారని గర్బిణి బంధువులు ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే వారి తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ జిల్లా వైద్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో డిసిహెచ్ ఎస్.సోమేశ్వరరావు ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టారు.

కిడ్నీ వ్యాధిపై కేంద్ర అధ్యయన కమిటీ జిల్లాకు రాక

శ్రీకాకుళం, ఫిబ్రవరి 7: కిడ్నీ ప్రభావిత ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిపై అధ్యయనం చేయడానికి కేంద్ర కమిటీ జిల్లాకు వచ్చింది. మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో ఎన్టీఆర్ యూనివర్శిటీ డైరెక్టర్ డాక్టర్ రవిరాజ్ అధ్యక్షతన కేంద్ర కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో గత రెండు దశాబ్దాలుగా కిడ్నీ వ్యాధి ఉందన్నారు. 114 గ్రామాల్లో 15 మెడికల్ స్కీమ్‌ల ద్వారా ఇంటింటికీ రక్తపరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 9వేల మంది నుండి రక్తనమూనాలను సేకరించి రక్తపరీక్షలు నిర్వహించామని, అందులో 2వేల మందికి కిడ్నీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారన్నారు. ప్రాథమిక దశలో గుర్తించిన వారికి నివారణ కోసం మందుల సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 1.25లక్షల మందికి రక్తపరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. 20 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సుగల ప్రతీ వారికి పరీక్షలు చేపడుతున్నామని తెలిపారు. గతంలో జరిపిన సర్వే వివరాలు, వ్యాధి బారిన పడినవారికి ఇస్తున్న మెడికల్ సదుపాయాలు, మంచినీటి సరఫరా, కిడ్నీ వ్యాధి రాకుండా తీసుకుంటున్న చర్యల ను కమిటీ సభ్యులకు కలెక్టర్ వివరించారు. కేంద్ర కమిటీ అధ్యక్షుడు డాక్టర్ రవిరాజ్ మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ఎక్కువగా ఉందని తెలిపారు. వ్యాధి ఎందుకు సోకుతుంది.. ఆహారపు అలవాట్లు, వాతావరణం, మంచినీరు అంశాలను అధ్యయనం చేస్తామన్నారు. శాశ్వత నివారణకు సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. సుమారు 6నెలల నుండి సంవత్సరంలోపు నివేదికలు ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. కిడ్నీ వ్యాధి అధ్యయనానికి ప్రముఖ డాక్టర్లు చెన్నై నుండి ముగ్గురు, బెంగుళూరు నుండి ఒకరు, ముంబై నుండి ఒకరు వచ్చినట్లు తెలిపారు. కేంద్ర అధ్యయన కమిటీ సభ్యులు డాక్టర్ మనోజ్, డాక్టర్ ప్రభుదీప్‌కౌర్, డాక్టర్ జాజ్‌అబ్రహం, డాక్టర్ గంగాధర్ జిల్లా కలెక్టర్‌ను కలిసిన అనంతరం కిడ్నీ వ్యాధి ప్రభావిత కంచిలి బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సనపల తిరుపతిరావు, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.