శ్రీకాకుళం

పలాస-కాశీబుగ్గలో ఐటి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, ఫిబ్రవరి 7: నవంబర్ 8వ తేదీ నుంచి పెద్దనోట్లు రద్దుతో నల్లకుబేరులు జరిపిన లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడంతో ఆదాయపన్ను శాఖ దాడులకు శ్రీకారం చుట్టింది. ఈ దాడుల పరంపరలోనే పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లోని పలువురు వ్యాపారులు, డాక్టర్లు జరిపిన లావాదేవీలపై ఆరా తీసేందుకు ఐటి దాడులు జరిపినట్లు విశ్వసనీయసమాచారం. పలాస-కాశీబుగ్గలో ఆదాయ పన్ను అధికారులు సోదాలు చేయడంతో బంగారం దుకాణాలు, జీడిపరిశ్రమలు, ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడ్డాయి. ఆదాయపన్ను శాఖ కమిషనర్ ఓంకారేశ్వర్ ఆదేశాల మేరకు సుమారు 80 మంది అధికారులు 15 బృందాలుగా విడిపోయి సిందిరి సతీష్, త్రిబుల్ ఎస్.సంతోష్, టి.రవిశంకర్‌గుప్తా, మల్లా కాంతారావులకు చెందిన పరిశ్రమలు, ఇళ్లపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. మరికొన్ని బృందాలు జంట పట్టణాల్లోని డాక్టర్ మల్లేశ్వరరావు, డాక్టర్ బాలకృష్ణతోపాటు మరికొన్ని ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించారు. ఐటి అధికారులు ఆసుపత్రి వద్దకు వచ్చి రోగులు మాదిరిగా పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రయత్నిస్తూ వారివద్ద ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. జీడిపరిశ్రమల్లో ఉన్న ప్రతి కాగితాన్ని పరిశీలించి ఇటీవల జరిపిన క్రయవిక్రయాలు, లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు జరుగుతున్నాయని వార్త గుప్పుమనడంతో వ్యాపారులు, డాక్టర్లు తమ సముదాయాలను మూసివేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఐటి అధికారులు మాత్రం వారికి ఉన్న ముందస్తు సమాచారం మేరకు ఆయా ప్రాంతాలకు వెళ్లి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల వివరాలను వెల్లడించేందుకు ఐటి అధికారులు నిరాకరించారు. ఈ దాడులతో జంట పట్టణాల్లోని వ్యాపారస్తులు బెంబేలెత్తిపోయారు.