శ్రీకాకుళం

పుస్తకవిందును అందరూ ఆస్వాదించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 10: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పుస్తక విందును అందరూ ఆస్వాదించాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పిలుపునిచ్చారు. స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శుక్రవారం రాత్రి నవ్యాంద్రపుస్తక ప్రదర్శనని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ మనిషికి పుట్టుకతో వచ్చే ఓ సంస్కారం ఉంటుందని, పుస్తక పఠనం ద్వారా మంచి సంస్కారాన్ని నేర్చుకోవాలన్నారు. వేదాలు భారతదేశానికి వైశిష్ట్యాన్ని తెచ్చిపెట్టాయని, ప్రపంచానికి దిక్సూచి భారతదేశమన్నారు. పుస్తక ప్రదర్శన ఏర్పాటుకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్పీ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ పుస్తకం చదవడం ప్రతీ ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. కథానిలయం వ్యవస్థాపకులు కాళీపట్నం రామారావు మాట్లాడుతూ అన్నింటికీ కారణం పుస్తకమని, చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. తాను ఇప్పటికీ రోజుకు 8గంటల పాటు పుస్తకాలు చదువుతానని తెలియజేశారు. చిన్నతనంలో సరదాగా పుస్తకం చదవడం అలవాటుగా ఇంతటి స్థాయికి తీసుకువచ్చిందన్నారు. స్వయంకృషితో తాను ఎదిగినట్లు తెలియజేశారు. ఎమెస్కో ఎం.డి. విజయకుమార్ మాట్లాడుతూ సాహిత్యం నేర్పేది ప్రశ్నించడమని, ఇప్పటితరం విద్యార్థుల్లో సాహిత్యం చదివే అలవాటు తగ్గిందని, ప్రతీ ఒక్కరికీ పుస్తక స్పర్శ కలగాలనే ఉద్దేశంతో పుస్తక ప్రదర్శన ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇంత సాహిత్యం, విజ్ఞానం అందుబాటులో ఉందన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. గతఏడాది అక్టోబర్ 1న అనంతపురంలో ప్రారంభమైన నవ్యాంధ్రపుస్తక మహోత్సవాలు తిరుపతి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం చివరగా శ్రీకాకుళంలో ఏర్పాటుచేసినట్లు తెలియజేశారు. ఈకార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి పప్పల జగన్నాధరావు, స్వాతిసోమనాథన్, బివిఏ రామారావునాయుడు, దూసి ధర్మారావు, ఇన్‌ఛార్జి డిఇఓ సుబ్బారావు, విజయవాడ బుక్‌ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి సాయి, ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధి రామకృష్ణ పాల్గొన్నారు.

బెజ్జిపురం క్లబ్‌కు జాతీయ పురస్కారం
లావేరు, ఫిబ్రవరి 10: మండలంలో బెజ్జిపురం యూత్‌క్లబ్ అందించిన సేవలకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. కేంద్ర, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ భారతప్రభుత్వం నిర్వహించిన 3వ రెస్పాన్స్‌బుల్ ఇండియన్ డిఎంఓఎస్ అవార్డు బెజ్జిపురం క్లబ్‌కు వరించింది. జాతీయ స్థాయిలో 15మందిని ఈ అవార్డులకు ఎంపిక చేయగా, బెజ్జిపురం క్లబ్ 3వ స్థానంలో నిలిచి పురస్కారాన్ని అందుకుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహాపరిశ్రమల శాఖ కార్యదర్శి కె.కె.జైన్ పురస్కారం కింద ప్రశంసాపత్రాన్ని జ్ఞాపికను క్లబ్ డైరెక్టర్ ఎం.ప్రసాదరావుకు శుక్రవారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అందించారు. జ్యూట్‌క్లస్టర్‌లో కామన్‌ఫెసిలిటీ సర్వీస్ సెంటర్ మహిళలకు చేతివృత్తులలో శిక్షణ, వారి ఆదాయ మార్గాలు పెంపుదలకు చేసిన కృషికి అవార్డు లభించింది. ప్రధానంగా 1980లో ఏర్పడిన బెజ్జిపురం యూత్‌క్లబ్ అనేక సాంఘీక, సామాజిక సేవాకార్యక్రమాల్లో పాలు పంచుకొని వేలాదిమందికి ఉపాధి మార్గాలను చూపింది. సుమారుగా 10వరకు వివిధస్థాయిల్లో పురస్కారాలు పొందిన క్లబ్ సేవలు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ అవార్డు పట్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావు, మండల పరిషత్ ప్రత్యేక సలహాదారుడు ముప్పిడి సురేష్, జెడ్పిటిసి పిన్నింటి మధుబాబు, ఏ ఎంసి చైర్మన్ తోటన్నదొర, మండల అధ్యక్షురాలు మీసాల శాంతమ్మ అభినందనలు తెలియజేశారు.