శ్రీకాకుళం

ఉపాధి హామీ లక్ష్యాలను సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 14: జిల్లాలో ఉపాధిహామీ పనుల నిర్ణీత లక్ష్యాలను అధికారులు సమన్వయంతో పనిచేసి సాధించాలని సంయుక్త కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధరబాబు ఆదేశించారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో ఉపాధిహామీ పనుల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం అమలులో జిల్లా చివరిస్థానంలో ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దీనిపై ప్రత్యేక శ్రద్ధను చూపాలన్నారు. రాష్ట్రంలో తృతీయ స్థానంలో వచ్చేందుకు అవసరమైన లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జె.సి అధికారులను సూచించారు. ఉపాధిహామీలో మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు అవకాశం ఉందని, దానిపై ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. అనంతరం మండల అభివృద్ధి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగాఎం. పిడిఓలతో జెసి మాట్లాడుతూ మండల అభివృద్ధి బాధ్యతలో భాగంగా ఉపాధిహామీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతీరోజూ ఉదయం ఆరు గంటలకు క్షేత్ర సహాయకులు, క్షేత్ర ఉపసహాయకులు, పంచాయతీ కార్యదర్శులు, వెలుగు సిబ్బంది క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లి గ్రామసభలను నిర్వహించాలని, మైకుల ద్వారా ప్రజలను చైతన్యపరచాలన్నారు. ఎక్కువ పనులను చేపట్టాలన్నారు. ప్రతీ కుటుంబానికి 100రోజులు కల్పించడానికి కావల్సిన ప్రణాళికను నిర్దేశించుకొని పనిదినాలను కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీల వారీగా, క్షేత్ర సహాయకుల వారీగా లక్ష్యాలను నిర్ధేశించుకొని వేజ్ ఇంటెన్సివ్ పనులకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ప్రతీ రోజూ కనీసం లక్ష నుండి లక్షన్నర మందికి పని కల్పించాలన్నారు. సి.సి. రోడ్లు, అంగన్‌వాడీ, పంచాయతీ భవనాలు, మండల మహిళా సమాక్య, వర్మికంపోస్టు, అవెన్యూ ప్లాంటేషన్, ట్రంచ్‌వర్క్స్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల పనులను ఉపాధిహామీ కింద కల్పించాలన్నారు. ప్రతీయేటా డిసెంబర్ నెలాఖరు నాటికి రూ.400 నుండి 500 కోట్ల ఎస్టిమేషన్స్ జనరేట్ చేయగా, ఈ ఏడాది కేవలం రూ. 147కోట్లు ఎస్టిమేషన్స్ జనరేట్ అయ్యాయన్నారు. జిల్లాలో వేజ్‌కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్ కలిపి 122 కోట్ల పనిదినాలు లక్ష్యాలను నెరవేర్చడానికి ఐదురెట్లు అధికంగా పనిచేయాలన్నారు. మార్చి నెలాఖరు నాటికి ఈ లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. ఫారంపాండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాల లక్ష్యంలో జిల్లాలో ప్రగతి లేదని, దీనిపై శ్రద్ధ చూపాలని, స్ర్తినిధి, ఉపాధి హామీ నిధుల ద్వారా ఈ లక్ష్యాలను నెరవేర్చాలన్నారు. ఓడిఎఫ్‌గా ప్రకటించిన మండలాల ఎంపిడివోలకు ఇంక్రిమెంట్లు, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తారన్నారు. ఈ సమావేశంలో జెసి-2 పి.రజనీకాంతారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు డాక్టర్ జి.సి కిషోర్‌కుమార్, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఆర్‌వి నర్శింగరావు, బిసి కార్పొరేషన్ కార్యనిర్వహక సంచాలకులు జి.రాజారావు, జిల్లా పంచాయతీఅధికారి కోటేవ్వరరావు, జిల్లా అటవీ శాఖ శాఖాధికారి శాంతిస్వరూప్, పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజినీర్ మోహన్‌మురళీ, జిల్లా నీటియాజమాన్య సంస్థ అదనపు పథక సంచాలకుడు కె.లోకేశ్వరరావు పాల్గొన్నారు.

పంట భూములకు
కడగండి రిజర్వాయర్ నీరు
ఎల్ ఎన్‌పేట, ఫిబ్రవరి 14: మండలంలోని జంబాడ గిరిజన గ్రామం సమీపంలో నిర్మించిన కడగండి రిజర్వాయర్ నీరు పంట భూముల సాగుకు సరఫరా చేసేందుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈమేరకు మంగళవారం కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి భూసేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం ఆర్డీవో బలివాడ దయానిధి కాలువ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో విలేఖర్లతో మాట్లాడారు. బొర్రంపేట గ్రామానికి చెందిన పది మంది రైతుల భూములను కాలువల నిర్మాణానికి సేకరించినట్టు తెలిపారు. రైతులకు పరిహారం అందించడానికి రూ.1.44 కోట్లు మంజూరయ్యాయన్నారు. కడగండి రిజర్వాయర్‌కు అనుసంధానంగా కుడి, ఎడమ ప్రధాన కాలువలను నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఎడమ కాలువ 4.5 కిలోమీటర్లు దూరాన నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. జంబాడ, వలసపాడు, బొర్రంపేట, ఎం.కె.పురం, శ్యామలాపురం గ్రామాల పంట భూములకు సాగునీరు సరఫరా చేయనున్నట్టు తెలిపారు. కుడి ప్రధాన కాలువ రెండు కిలోమీటర్లు పొడవున నిర్మాణం చేయనున్నట్టు వివరించారు. వీటి మూలంగా జంబాడ, సరుబుజ్జిలి మండలం అమృతలింగానగరం పంట భూములకు సాగునీరు అందుతుందన్నారు. కాలువల నిర్మాణానికి రూ.1.73 కోట్లు నిధులు మంజూరు అయ్యాయన్నారు. కాలువల పనులకు టెండర్లు కూడా పూర్తయినట్టు తెలిపారు. త్వరలో పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకుముందు రైతులు అప్పలనాయుడు, మల్లేశ్వరరావు, ఆనందరావు, నీలంనాయుడు, వాసుదేవరావు మాట్లాడుతూ కొన్నాళ్ల క్రితం కాలువల నిర్మాణానికి పంట భూములు సేకరించారని, ఇప్పటివరకు పరిహారం చెల్లించడానికి జాప్యం కావడం వల్ల తీవ్రంగా నష్టపోయామని, ఇప్పటికైనా పరిహారం త్వరితంగా చెల్లించాలని ఆర్‌డిఒ ను కోరారు. ఈయనవెంట ఇరిగేషన్ డి ఇ రాజేంద్రప్రసాద్, జెఇ ఆదినారాయణరెడ్డి, ఎంపిడిఒ మోహన్‌ప్రసాద్, తహశీల్దార్ అప్పారావు పాల్గొన్నారు.