శ్రీకాకుళం

నింగికెగసిన భారత్ కీర్తిపతాకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 15: భారత్ కీర్తి పతాకం నింగికెగసిన వేళ..! ప్రపంచమంతా ఎంతో ఉత్సుకతతో ఇండియా వైపు ఉత్కంఠగా చూసిన వేళ..! ఇస్రో శాస్తవ్రేత్తల కృషి, ప్రతీ భారతీయుని కాంక్ష నెరవేరింది. ఇస్రో 104 శాటిలైట్‌లు అంతరిక్షంలో విజయవంతంగా ప్రవేశపెట్టిన శుభసమయాన శ్రీకాకుళంలో యువత జాతీయ జెండాలు చేతబట్టి జయహో భారత్...జయహో ఇస్రో, భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలుచేశారు. ఎన్‌సిసి కేడెట్స్, విద్యార్థులు, అధికారులు, గీతాశ్రీకాంత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొని ఇస్రో శాస్తవ్రేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి 104 జాతీయ జెండాలతో వందలమంది విద్యార్థులు పాలకొండ రోడ్ మీదుగా 7రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం మానవహారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండలక్ష్మీదేవి మాట్లాడుతూ భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచానికి మరోమారు శాస్తవ్రేత్తలు చాటిచెప్పారన్నారు. 104 శాటిలైట్లు సమర్థవంతంగా శ్రీహరి కోట నుంచి విజయవంతంగా ప్రయోగించి దేశఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేసిన కృషి అమోఘమైందని కొనియాడారు. డిఎస్పీ భార్గవరావునాయుడు, క్షేత్రప్రచార అధికారి డా.జి.కొండలరావు మాట్లాడుతూ అమెరికా 87 శాటిలైట్స్ మనద్వారా ప్రయోగించిందంటే మనదేశం ప్రపంచదేశాల్లో తీవ్ర ఘనత చాటి చెప్పుకుందన్నారు. ప్రతీ భారతీయుడు సగర్వంగా తలెత్తుకొనేలా శాస్తవ్రేత్తలు చేసిన కృషి గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎం.బాబూరావు, లెక్చరర్ పి.సూరిబాబు, ఎన్‌సీసి అధికారి పోలినాయుడు, రోటరీ అద్యక్షులు మోహన్, జి.ఇందిరాప్రసాద్, గీతాశ్రీకాంత్ ఫౌండేషన్ కో- ఆర్డినేటర్ ఎం.వి.ఎస్.ఎస్.శాస్ర్తీ పాల్గొన్నారు.

ఇస్రో చరిత్రలో ప్రపంచ రికార్డు
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 15: భారతదేశం గర్వించదగ్గ రోజు ఫిబ్రవరి 15వతేదీ అని బిజెపి జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు తెలిపారు. బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో ఇస్రో శాటిలైట్ ద్వారా 104 ఉపగ్రహాలను విజయవంతంగా పంపించి సాధించిన ఘన విజయం పట్ల జాతీయ జెండాలతో బిజెపి నేతలంతా నినాదాలు చేశారు. డే అండ్ నైట్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం నారాయణరావు మాట్లాడుతూ ఎన్నో అగ్రదేశాలు, అభివృద్ధి దేశాలకు సాధ్యం కాని విధంగా భారతశాస్తవ్రేత్తలు విజయాన్ని సాధించారని, ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో చరిత్రలోనే ప్రపంచ రికార్డు సృష్టించిందన్నారు. ఈసందర్భంగా ఆ శాస్తవ్రేత్తలకు అభినందనలు తెలియజేశారు. ఫిబ్రవరి 15వతేదీ చరిత్రలో లికించదగ్గ రోజు అన్నారు. యువమోర్చా నాయకులు టేకి మాధవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శవ్వాన ఉమామహేశ్వరి, శవ్వాన వెంకటేశ్వరరావు, వడ్డిమురళీమోహన్‌రావు, ఎస్వీ రమణమూర్తి, టి.గోవిందరావు, సూర్యచంద్రశేఖర్, జి.శ్రీనివాసరావు, పాతిన గడ్డెయ్య, సువ్వారి వెంకటసన్యాసిరావు, బి.చంద్రరావు, వై.రమేష్, ఎష్.సురేష్‌కుమార్, జి. శ్రీనివాస్ పాల్గొన్నారు.

జయహో ఇస్రో
* 104 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ
నరసన్నపేట, ఫిబ్రవరి 15: దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచ దేశాల్లోనే గొప్పదనంగా నిలిచిన భారతదేశ ఖ్యాతిని 104 ఉపగ్రహాలు పంపడంతో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. ఈసందర్భంగా మండల కేంద్రంలో బుధవారం పద్మావతి డిగ్రీ కళాశాల, ఎంఎల్‌ఆర్ నాయుడు, జ్ఞానజ్యోతి డిగ్రీ కళాశాల విద్యార్థులు మానవహారాన్ని ఏర్పాటు చేసి భారత్‌కు జేజేలు పలికారు. ఈసందర్భంగా చైతన్యభారతి కన్వీనర్ సిహెచ్.పాపారావు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోనే ఎంతో ఖ్యాతిని భారతదేశం సాధించిందని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి ఈప్రయోగం చేయడంవలన రాష్ట్ర ప్రగతి ఇనుమడింపజేసిందన్నారు. అనంతరం 104 అడుగుల జాతీయ జెండాతో పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీని నిర్వహించారు.