శ్రీకాకుళం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. ఇటీవల ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడం, ఈ సీటును బిజెపికి కేటాయించిన విషయం తెలిసిందే. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ పదవీకాలం ఈ ఏడాది మే 1వతేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈయన స్థానంలో కొత్త సభ్యుని ఎన్నికకు ఎన్నికల కమిషనర్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఈనెల 21వతేదీన నోటిఫికేషన్ విడుదల, 28న నామినేషన్ స్వీకరణ ప్రారంభం అవుతుంది. మార్చి 1న నామినేషన్ల పరిశీలన, 3న ఉపసంహరణకు గడువు ఎన్నికల కమిషన్ విధించింది. అదే నెల 17వతేదీ ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటలవరకు ఎన్నిక జరగనుంది. 20న ఫలితాలు ప్రకటిస్తారు. స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపిటిసిలు, జెడ్పిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారు. ఇలా ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేయగా, ఆశావహులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు విషయంలో మరిన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎంపిక ప్రక్రియ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అమరావతిలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా ఎమ్మెల్యేల అభిప్రాయాలను, ఆశావహుల దరఖాస్తులను స్వీకరించడమే కాకుండా ప్రజల్లో ఏమేరకు పలుకుబడి ఉందన్న విషయంపై ఇప్పటికే ఇంటలిజెన్స్ అధికారుల నుండి అభ్యర్థుల జాతకాలను బాబు రాబట్టినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా దరఖాస్తు చేసుకున్న ఆశావహులపై పార్డీ కేడర్ మనోగతాన్ని తెలుసుకునేలా ఐవిఆర్ ప్రక్రియను నిర్వహించేందుకు హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టింది. సామాజిక సమత్యులత, ప్రాంతీయ అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. ప్రధాన సామాజిక వర్గాలకు ఈ పదవికి కేటాయిస్తారా? లేకుంటే మైనార్టీలకే అప్పగిస్తారా?అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 805మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంపిటిసిలు 666, జెడ్పిటిసిలు 38మంది, వార్డు కౌన్సిలర్లు, చైర్‌పర్సన్లు 91మంది, ఎమ్మెల్యేలు 10మంది ఉన్నారు. ఈ మొత్తం ఓటర్లలో 90శాతానికి పైగా టిడిపికి చెందిన వారే ఉండటంతో అధిష్టానం సీటు ఎవరికి ఇస్తే వారు గెలుపుసాధించడం మరింత సులువు. దీంతో జిల్లాలో ఈ సారి ఈ సీటుకోసం పోటీ తీవ్రంగా ఉంది. అభ్యర్థత్వం ఖరారుపై అధిష్టానం పలు కోణాల్లో పరిశీలించడంతో ఆశావహుల్లో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. ఎవరికి సీటు వస్తుందో అన్న చర్చ తమ్ముళ్లలో వాడిగావేడిగా సాగుతోంది. జిల్లా నుంచి సుమారు 8మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంతకవిటికి చెందిన కోళ్ల అప్పలనాయుడు, టిడిపి జిల్లా పూర్వపు అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు, పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యదర్శి కలిశెట్టి అప్పలనాయుడు, డిసిసిబి మాజీ చైర్మన్ శింతు సుధాకర్, రణస్థలానికి చెందిన నడుకుదిటి ఈశ్వరరావు, దివంగత మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబునాయుడు సతీమణి లలిత, మాజీ జెడ్పిటిసి ఎల్‌ఎల్‌నాయుడు దరఖాస్తుచేసుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడి నుంచి అందరు శాసనసభ్యులు, నియోజకవర్గం ఇన్‌ఛార్జిలతోపాటు రాష్ట్ర పార్టీ నేతలకు కూడా దరఖాస్తులను అందించి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఇదిలాఉండగా విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన మాజీ విప్ గద్దె బాబూరావును కూడా శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని పార్టీ పెద్దలను కోరినట్లు తెలిసింది. వీరిలో ఎవరికి ఎమ్మెల్సీ సీటు వరిస్తుందో తేలాల్సి ఉంది.
* విశాఖ కేంద్రంగా సిక్కోలు నేతల సమావేశం
ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధినేత చంద్రబాబు అభ్యర్థత్వంలో తీసుకోవాల్సిన మార్గదర్శకాలకు, అంశాలపై సమీక్షను దృష్టిలో ఉంచుకొని విశాఖలో ఉన్న శివాజీ స్వగృహంలో గురువారం రాత్రి ఇక్కడి నేతలు సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విప్ కూన రవికుమార్, ఎం.పి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్సీ ప్రతిభాభారతీ, ఎమ్మెల్యేలు గౌతు శ్యాంసుందరశివాజీ, బెందాళం అశోక్, కలమట వెంకటరమణ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆశావహులు దరఖాస్తులను అధిష్టానం ముందుంచి అధినేత నిర్ణయానికి అనుగుణంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయపథం వైపు అడుగులు వేద్దామని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ సమావేశానికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, జెడ్పీచైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గైర్హాజరు కావడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ నేతను ఆంధ్రభూమి షాడో మీటింగా? అని ప్రశ్నించగా లేదులేదు జస్ట్ టీ బ్రేక్ మాత్రమే అని బదులివ్వడం కొసమెరుపు.