శ్రీకాకుళం

పిడిఎఫ్ ప్యాకేజీ కావాలంటూ ఆర్డీవో కార్యాలయం ముట్డడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ (టౌన్), ఫిబ్రవరి 20: వంశధార రిజర్వాయర్ కోసం తమ పంట భూములను ఇచ్చి తాము జీవనాధారాన్ని కోల్పోయామని, పిడిఎఫ్ ప్యాకేజీ వర్తింప చేయాలని హిరమండలం గ్రామ పంచాయతీకి చెందిన వంశధార నిర్వాసితులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా అధికారులకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు. నిర్వాసిత గ్రామ ప్రజలకు యూత్ ప్యాకేజీతో పాటు పలు సౌకర్యాలు కల్పిస్తున్నారని, వాటన్నింటినీ తమకు అందజేయాలన్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఫలితం దక్కలేదన్నారు. 2013 చట్టం ప్రకారం యూత్ ప్యాకేజీ, పంట భూముల ప్యాకేజీ వర్తింప చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సుమారు గంటసేపు ఆర్‌డిఒ కార్యాలయం ఎదురుగా నినాదాలు చేశారు. వీరిలో మహిళలు అధిక సంఖ్యలో పా ల్గొన్నారు. ఆర్‌డిఒ రెడ్డి గున్నయ్యకు వినతిపత్రం అందించి సమస్య పరిష్కరించాలని కోరగా, ఆయన ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పినప్పటికీ అక్కడ నుంచి కదలలేదు. నినాదాలు చేస్తూ కా ర్యాలయం లోపలకు చొరబడి ఆర్‌డిఒ తో వాగ్వివాదానికి దిగారు. తమ బతుకులు బజారున పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం నిర్వాసితులంతా బయటకు వచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఆర్‌డి ఒ నిర్వాసితులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు వినకపోవడంతో డిఎస్పీ ఆదినారాయణకు సమాచారం అందించారు. దీంతో సిఐ వేణుగోపాలరావుతోపాటు పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆర్‌డిఒ కార్యాలయం బయట నినాదాలు చేస్తున్న నిర్వాసితుల దగ్గరకు వచ్చి సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ఆర్‌డిఒ హామీఇవ్వడంతో కొద్దిరోజులు వేచిచూసి తమకు ప్యాకేజీ అందించకపోతే ఆందోళనకు దిగుతామని చెప్పి నిర్వాసితులు వెనుదిరిగారు.

బోర్డర్‌లో ట్రాఫిక్ జామ్
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 20 : ఒడిశా సరిహద్దులో పురుషోత్తపురం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు నుంచి గిరిసోల చెక్‌పోస్టు వరకు నాలుగు కిలోమీటర్ల మేర సోమవారం ట్రాఫిక్‌జామ్ ఏర్పడంతో వందలాది లారీలు, కార్లు 16వ నంబరు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. బరంపురానికి బస్సుల రాకపోకలు నిలిచిపోవటంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. గిరిసోల చెక్‌పోస్టులో ప్రతి లారీ బరువును తూనిక వేస్తుండమే ట్రాఫిక్‌జామ్‌కు కారణమని వాహనదారులు తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఒడిశా అధికారులను ఎన్నోసార్లు కోరినా ఫలితం ఉండటం లేదని వాపోయారు.