శ్రీకాకుళం

ఏకమవుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: మనలో మనం కొట్లాడుకునేటప్పుడు వారు నూరుగురు. మనం ఐదుగురం. బయటి నుంచి ముప్పు వచ్చినప్పుడు మాత్రం మనం నూట ఐదుగురం-అని మహాభారతంలో పాండురాజుగారి పెద్దబ్బాయి అంటే అందరూ ఆహాఓహో అన్నారు. అదేనీతిని సిక్కోల్ రాజకీయ భారతంలో మన నేతలు అనుసరించి ‘ఏకమవుదాం’ అంటే జనం ఛీఛీ అంటున్నారు! ఇది చాలా అన్యాయం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మొదలు వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు నుంచి సరికొత్త ఆలోచనలతో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని చేపట్టిన ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ సూచించిన పార్టీ కేలండర్ సూత్రానే్న ‘సమన్వయం’ కోసం సర్దుబాటు చేసిన రికార్డు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. జిల్లా పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశాలు దశాబ్ధాలుగా నిర్వహించి, అందుకు కావల్సిన భోజనవసతులు కల్పించిన సీనియర్ మాజీ అధ్యక్షులందరికీ కనువిప్పు కలిగేలా నెలకో నియోజకవర్గంలో జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించుకునేందుకు పార్టీ పెద్దలంతా నిర్ణయం తీసుకున్నారు. రజతోత్సవాలు ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఆర్థికపరమైన భారాన్ని వాటాలు వేసుకునేందుకు ‘సమన్వయం’ పేరిట జిల్లా టిడిపి సమావేశాలు నియోజకవర్గాల వారీగా మార్చేసిన బిజినెస్ ఫార్ములా పార్టీలో చాలామందిని అబ్బురపరిస్తే - మరికొంతమందికి ఆశ్చర్యం కలిగించింది. అందరూ కలిసే పనిచేస్తామంటూ సంకేతాన్ని ఇవ్వటానికే ఈ సమాలోచన నిర్ణయం అంటూ కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పుకొస్తున్న నేపథ్యంలో పార్టీ సమావేశాల ఖర్చులు సర్దుబాటు లెక్కలకే ఈ నియోజకవర్గాల వారీగా జిల్లా సమావేశాలంటూ విమర్శలు వినిపిస్తున్నా - అడిగేందుకు మంత్రికి, చెప్పేందుకు పార్టీ వ్యవహారాలు నడిపే జిల్లా ఇఇఒకు మధ్య గల అభిమానం అడ్డుపడడంతో నియోజకవర్గాల వారీగా, జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశాలకు ఎమ్మెల్యేలంతా నెలకో టూర్ వారి డైరీల్లో కేటాయించుకోవల్సి వచ్చిందంటూ వాపోతున్నారు. సమయం వృథా తప్ప సమస్యలు పరిష్కారం కావు, కేడర్‌కు ప్రయోజనం కలగదంటూ సీనియర్లు పెదవి విరుస్తున్నారు. కాని - దీనివెనుక బాబు క్లాసు బాగా పనిచేస్తున్నది నిగూఢ రహస్యం. అందరూ కలిసి పనిచేస్తేనే 80 శాతం ఓటర్లు మనతో ఉంటారన్న పాఠంలో నియోజకవర్గాల వారీగా తేడాలు కన్పించరాదంటూ చేసిన హెచ్చరికలే ఈ ‘సమన్వయం’ సభలంటూ కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పుకొస్తున్నారు. కాని - అధికారంలో ఉన్నా ఆనందం కేడర్‌కే కాదు..ముఖ్యనేతలకు కూడా లేదంటూ విసిగెత్తిపోతున్నారు. సాక్షాత్తు అధినేత చంద్రబాబు జిల్లా మంత్రికి, సీనియర్ ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయడం లేదని అమరావతిలో ఇటీవల జరిగిన పార్టీ వర్క్‌షాపులో సిక్కోల్ తమ్ముళ్ళందరికీ అక్షింతలు వేశారు. దానిని సరి చేసుకునేందుకు సమన్వయం సభలు ఆరంభించిన తొలి సమావేశంలోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఇక్కడ నేతలకు మరింత తలనొప్పిగా మారింది. జిల్లా పార్టీ కార్యాలయంలో పది నియోజకవర్గాలకు చెందిన ముఖ్యులు కూర్చొని సమస్యలపై చర్చించే దాఖలాలు లేవని తమ్ముళ్ళే విమర్శిస్తున్నారు. ఏ ఇద్దరు మధ్య ఐక్యత లేకపోవడం, ఒకరి నియోజకవర్గం వైపు మరొకరు చూడద్దంటూ బాబు హుకుం జారీ చేసినా ఇందుకు భిన్నంగా ఇక్కడ ముఖ్యనేతలు బదిలీలు, పదోన్నతలు, కాంట్రాక్టులు అంటూ వేలు పెట్టడం, జన్మభూమి కమిటీల పేరిట పెత్తనం చలాయించిన నివేదికలు పార్టీ చీఫ్ బాబుకు మంట పుట్టిస్తున్నాయి. ఇటువంటి అంశాలను ఏకాంతంగా ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో బహిరంగంగా వర్క్‌షాపులో బుజ్జగించడం అందరికీ తెలిసిందే. ఇటువంటి అనిశ్చిత పరిస్థితులు జిల్లా పార్టీని రోజురోజుకూ దిగజారేలా చేస్తున్నాయంటూ జిల్లా టిడిపి సర్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాల కేంద్రాల్లో ‘సమన్వయ’సమావేశాలు ఏర్పాటుచేసి జిల్లా పార్టీ సమీక్షలు నిర్వహించి సమష్టి నిర్ణయాలు తీసుకుని అధినేత పాఠాలు వంట పట్టించుకునేందుకు బుధవారం ఆమదాలవలస నియోజకవర్గం టిడిపి కార్యాలయంలో జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి శ్రీకారం చుట్టారు. అధికారం వచ్చిన తర్వాత దేశం పార్టీ కార్యక్రమాలు వెనుక అడుగడుగునా ఆర్థిక లెక్కలు ముడిపెడుతున్నారన్న ఆరోపణలకు ఈ నిర్ణయం ఊతం ఇచ్చేలా ఉందంటూ బలంగా తమ్ముళ్ళు వారి గొంతు వినిపిస్తున్నారు. మంత్రి - విప్ మధ్య ఉప్పు-నిప్పు వాతావరణం కొనసాగుతుందంటూ పుకార్లు ఉన్నాయి.
శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో ఆమదాలవలస నియోజకవర్గం కీలకమైనప్పటికీ హోంమంత్రి చినరాజప్ప పర్యటనలో మంత్రి అచ్చెన్న ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టారే తప్ప ఇన్‌ఛార్జి మంత్రి పర్యటనలో పాల్గొనలేదు. అలాగే వీరిమధ్య దూరంతోనే మరో మంత్రి గంటా కార్యక్రమం అర్థాంతరంగా రద్దయింది. ఇటువంటి ఇబ్బందులను అధిగమించేందుకు కేడర్ దృష్టిలో మేమంతా కలిసే ఉన్నామంటూ సంకేతాన్ని ఇచ్చేందుకే నియోజకవర్గాల వారీగా జిల్లా విస్తృతస్థాయి సమావేశాలు పనికట్టుకుని పెట్టాల్సి వచ్చిందని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు రాష్ట్ర పార్టీ చీఫ్‌గా బాధ్యతలు వ్యవహారిస్తుండడం వల్ల జిల్లాలో సమన్వయకమిటీ, జెడ్పీ సర్వసభ్యసమావేశాలు, జిల్లా అభివృద్ధి మండలి సమావేశాలకు హాజరయ్యే పరిస్థితులు అరుదు. ఎచ్చెర్ల తన సొంత నియోజకవర్గంలో విస్తృతస్థాయి సమావేశం ఎవరు నిర్వహిస్తారన్న సందేహాలు కూడా తొంగిచూస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు సగానికిపైగా నియోజకవర్గాల్లో కనిపించకతప్పదు. సమన్వయ సమావేశాలు ఆరంభ శూరత్వంగా మిగిలిపోతాయా? అందరూ ఏకం కావడానికి దోహదపడుతాయా? అన్నదే లక్ష డాలర్ల శేషప్రశ్న!

కోడ్...కూసింది
* విగ్రహాలకు ముసుగులు

శ్రీకాకుళం, ఫిబ్రవరి 21: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ నియమావళిని కూడా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం స్థానిక సంస్థలు, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఎన్నికల నియమావళి అన్నింటా అమలయ్యేలా ఓ బృందాన్ని జిల్లాలో నియమించారు. జాతీయ నేతలు, రాజకీయ నాయకులు విగ్రహాలకు ముసుగువేసి ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు, గోడరాతలు, కరపత్రాలు ప్రచార సామగ్రికి ఖర్చు కూడా అభ్యర్థులే భరించేలా ఎన్నికల కోడ్‌ను అమలు చేస్తున్నారు. అన్ని కోణాల్లో నిశితంగా పరిశీలించి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు మరింత నిఘా పెంచి ముందస్తు చర్యలు జిల్లాలో అధికారులు తీసుకుంటున్నారు.

2.50 లక్షల కార్యకర్తలకు కార్డుల పంపిణీ
* టిడిపి జిల్లా అధ్యక్షురాలు శిరీష
ఆమదాలవలస, ఫిబ్రవరి 21: విలువలతో కూడిన క్రమశిక్షణ సిద్ధాంతాలు కలిగిన తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్న సు మారు 2.50లక్షల మందికి సభ్య త్వ నమోదు కార్డులను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా తెలుగుదేశం పా ర్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష తెలిపారు. పట్టణంలోగల 13వ వార్డు ధర్మారావు క్వార్టర్స్‌లో మెంబర్‌షిప్ కార్డులు పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర పార్టీకార్యాలయం నుండి వచ్చిన ఈ కార్డు ద్వారా ప్రతీ కార్యకర్తలకు పార్టీలో మంచి గౌరవం, హోదా లభిస్తుందన్నారు. వీరికి చంద్రన్న బీమా సదుపాయం కల్పిస్తున్నామన్నారు. గుర్తింపు కలిగిన కార్యకర్తలు మరింత బాధ్యత, క్రమశిక్షణ, సమన్వయంతో పనిచేయాలని శిరీష సూచించారు.
జిల్లాలో పలాస, కాశీబుగ్గ నియోజకవర్గంలో అత్యధికంగా సభ్యత్వం నమోదైందని, పాలకొండ నియోజకవర్గంలో అతిస్వల్ప సభ్యత్వ నమోదు జరిగిందన్నారు. ఈ ఏడాది మరో 50వేల మందికి పార్టీ సభ్యత్వ నమోదు ఇవ్వనున్నామన్నారు. ఈసమావేశంలో చైర్‌పర్సన్ గీత, నక్క సుజాత, దేశం నాయకులు విద్యాసాగర్, చిన్నమ్మడు, కొన్నామణి పాల్గొన్నారు.

‘చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చాలి’
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 21: రాష్ట్భ్రావృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయకత్వాన్ని బలపరిచేందుకు పార్టీ కేడర్ మరింత కృషి చేయాలని మ ండల దేశం పార్టీ అధ్యక్షులు బెం డు మల్లేశ్వరరావు అన్నారు. ము ద్దాడ గ్రామంలో దేశంపార్టీ సభ్యులకు గుర్తింపుకార్డులను మంగళవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువనేత లోకేష్ రూ.5లక్షల బీమా సదుపాయాన్ని పార్టీ కార్యకర్తలకు వర్తింపజేస్తున్నారన్నారు. అందువల్లే లక్షలాది మంది సభ్యులు పార్టీలో శాశ్వతంగా కొనసాగుతున్నారని తెలిపారు. చంద్రన్న బీమా, ఎన్టీఆర్ భరోసా, రేషన్‌కార్డులు, దీపం కార్యక్రమాలు ప్రజల ముంగిటకు తీసుకువెళ్లి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బెండు రామారావు, పెంట సీతారాం, అశిరిపోలి యాదవ్ పాల్గొన్నారు.

ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆందోళన
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 21: మండలంలోని అరిణాం అక్కివలస గ్రామానికి చెందిన ప్రజలు అదే పంచాయతీ పరిధిలో ఉన్న శ్యాంక్రగ్ పరిశ్రమ ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాం డ్ చేశారు. అనేకమంది నిరుద్యోగ యువత గ్రామంలో ఉపాధి లేకుండా ఉన్నారని, ఇటువంటి వారికి ఉద్యోగాలు కల్పించాలని గత నవంబర్‌లో యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్ అంబటి సుజాత, శ్రీనివాసరావు ఆరోపించారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించకుంటే పరిశ్రమ కార్యకలాపాలను అడ్డుకుంటామని వారంతా గేటు ముందు ఆందోళనకు దిగి హెచ్చరించారు.
ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సందీప్‌కుమార్ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఏపిఓ లక్ష్మణరావుకు ఉద్యోగాలు కల్పించాలని సర్పంచ్‌తోపాటు మరికొంత మంది మరో వినతిపత్రాన్ని అందజేశారు. యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులంతా ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో ఉప సర్పంచ్ రవి, ఆదినారాయణ, నానాజీ, అప్పలసూర్యనారాయణ పాల్గొన్నారు.

‘ప్రభుత్వ విధానాలతో మాతృభాష నిర్వీర్యం’
సారవకోట, ఫిబ్రవరి 21: రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలు మాతృభాషను పూర్తిగా నిర్వీర్యం చేసి మంటగల్పుతున్నాయని పదవీ విరమణ చేసిన తెలుగుపండితుడు పి.చంద్రభూషణరావు విమర్శించారు. మాతృభాష దినోత్సవం సందర్భంగా స్థానిక ఉన్నత పాఠశాలలో పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ మంగళవారం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా 15కోట్ల మంది తెలుగుభాషను మాట్లాడుతున్నారని, తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఈ భాష క్రమేపీ అంతరించి పోతుందన్నారు. ప్రభుత్వ విధానాలతోపాటు ఆంగ్లభాషపై ఉన్న మోజు తల్లిదండ్రుల విధానాలు దీనికి కారణం అవుతున్నాయన్నారు. స్థానికులైన తెలుగుపండితులు స్వర్గీయ మావుడూరి శ్రీరామమూర్తి, ఆనందరావు స్మారకార్థం ఉపన్యాసపు పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. స్థానిక ఉన్నత పాఠశాల హెచ్‌ఎం అంగూరు గణపతిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఇఓ కిల్లారి రాంబాబు, భాషా పండితులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

హామీలపై అధికార పార్టీని నిలదీయండి
* చంద్రబాబుపై ధ్వజం
* వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన

శ్రీకాకుళం, ఫిబ్రవరి 21: నగరానికి వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చేసి ఇచ్చిన హామీలను విస్మరించారని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. మంగళవారం ఒక కల్యాణ మండపంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళానికి అండర్ డ్రైనేజ్, రింగురోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. వీటిపై అధికార పార్టీ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. కంపోస్టు యార్డు వద్ద 200 ఇళ్లను నిర్మించి కార్యకర్తలకు 2లక్షల రూపాయల వంతున అమ్ముకున్నారని ఆరోపించారు. పాత్రునివలస, సిద్ధిపేట సమీపంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం రూ.8కోట్లు కల్యాణ మండపం నిర్మాణానికి మంజూరు చేస్తే పాలకులు వీటిని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. 80 అడుగుల రోడ్డులో ఎస్సీల కోసం కేటాయించిన భూమిని ప్రభుత్వం కబ్జా చేసి పార్టీ కార్యాలయం నిర్మించేందుకు సమాయత్తం కావడం విచారకరమన్నారు. కార్పొరేషన్‌లో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని విమర్శించారు. పారిశుద్ధ్యం, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలు పౌరులకు తీర్చడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. పన్నుల భారం పెంచడమే తప్ప పౌరులు అవసరాలు తీర్చాలన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లంతా రాజకీయ అనుభవంతో ప్రత్యేక దృష్టి సారించి వార్డుల వారీగా కమిటీలకు నాయకత్వం వహించాలన్నారు. అధికార పార్టీ ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకునేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగి 50వార్డుల్లో ఉన్న సమస్యలను గుర్తించాలన్నారు. ముఖ్యంగా హద్దులు, సామాజికవర్గాల గణాంకాలపై ప్రత్యేక దృష్టి సారించి వైకాపా బలోపేతానికి కృషి చేయాలన్నారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ రెండేళ్లపాటు పదవి లేదని, ఇంటికే పరిమితమై సిఎం చంద్రబాబు మేయర్‌కుర్చీ ఇస్తాననే సరికి ప్రజల్లోకి రావడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళలంటే అప్పలసూర్యనారాయణ పడదనడానికి ఇదో నిదర్శనమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అంధవరపు వరహానృసింహం(వరం), ఎం.వి.పద్మావతి, చల్లా అలివేలు, అంధవరపు సూరిబాబు, సుంకర కృష్ణ, ఎంఎ రఫీ, పిల్లల నీలాద్రి, పండరి పాల్గొన్నారు.

వేతనదారులకు పనికి తగిన వేతనం
* కలెక్టర్ లక్ష్మీనృసింహం
వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 21: ఉపాధి హామీ పనులు చేస్తున్న వేతనదారులకు పని చేసిన మేరకే వేతనం లభిస్తుందని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. మంగళవారం మంచినీళ్లపేట మరిడమ్మ చెరువు, కిడిసింగి ఎర్ర చెరువులలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించారు. వేతనాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులకు వస్తే రూ.192 వేతనం వస్తుందని అధికారులు చెబుతున్నారని, రూ.120లు కూడా వేతనం లభించడం లేదని వేతనదారులు కలెక్టర్ ఎదుట వాపోయారు. వేతనదారులకు ఇచ్చిన కొలతలు ప్రకారం పూర్తి చేసిన పనులకు మాత్రమే ప్రభుత్వం నిర్ణయించిన వేతనం అందుతుందన్నారు. వేసవి ఎండలు ముదురుతున్న దృష్ట్యా ఉపాధి పనులవద్ద ఖచ్చితమైన వేళలు పాటించాలన్నారు. మస్తర్లు కచ్చితంగా పాటించాలన్నారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి పని కల్పిస్తారన్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో గ్రామాల నుంచి వలసలు వెళ్లిపోకుండా నిరోధించేందుకే ఉపాధి హామీ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. వేతనదారులు బ్యాంకులో జీరో అకౌంట్‌లో ఖాతా తెరుచుకోవాలని, వేతనాలు నేరుగా బ్యాంకులకు వేస్తారన్నారు. ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశంలో ఫీల్డ్ అసిస్టెంట్‌లు తప్పనిసరిగా ఉండాలని, ఎటువంటి అలసత్వం ప్రదర్శించినా చర్యలు తప్పవన్నారు. ఆయనతోపాటు జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డి, తహశీల్దార్ కె.వెంకటేశ్వరరావు, ఎంపిడిఓ వి.తిరుమలరావు, ఎపిఓ బి.ప్రసాదరావు, ఆర్‌ఐలు కె.రామకృష్ణ, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

మున్సిపల్ షాపులపై సేవా పన్ను భారం
* రూ.9 లక్షల వసూలుకు సన్నాహాలు
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 21 : పట్టణంలోని మున్సిపల్ షాపుల లీజుదారులపై కేంద్రప్రభుత్వం పెనుభారం మోపింది. 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి నెలసరి అద్దెపై 15 శాతం చొప్పున సేవా పన్ను వసూలుచేసి నేరుగా ఖాతాలో జమ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు లీజుదారుల నుంచి 9లక్షల 8 వేల 707 రూపాయల వసూలుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత ఈ మొ త్తాన్ని మున్సిపాలిటీ ముందుగా కేంద్రప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు చెల్లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నిధుల కొరతతో సతమతం అవుతున్న మున్సిపాలిటీకి ఇది భారం కానుంది. దీని ప్రభావం అభివృద్ధి పనులపై పడుతుందని మున్సిపల్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పట్టణంలో మొత్తం 182 మున్సిపల్ దుకాణాలు ఉన్నాయి. 2010-2013 ఆర్థిక సంవత్సరాల్లో వీటి నుంచి ఏడాదికి 10.30 లక్షల రూపాయలు, 2013- 2016 ఆర్థిక సంవత్సరాల్లో 12.36 ల క్షలు అద్దె కింద వసూలుచేశారు. ప్రస్తు త ఆర్థిక సంవత్సరం నుంచి అద్దె డి మాండ్ 22 లక్షలకు పెరిగింది. లీజుదారులు ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దెకు 15 శాతం సేవా పన్ను కలిపి వసూలు చేస్తున్నారు. కాగా 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు వచ్చిన అద్దెలపై సేవాపన్ను కింద 9 లక్షల రూపాయలకుపైగా వసూలు చేయాల్సి ఉంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ పి.రవిబాబును ప్రశ్నించగా 2010 ఆర్థిక సంవత్సరం నుంచి షాపుల అద్దెపై 15 శాతం సర్వీస్ టాక్స్ వసూలుచేసి తమ ఖా తాలో జమ చేయాలని కేంద్రం ఆదేశించిన మాట వాస్తవమేనని చెప్పారు. ఈ మేరకు 9 లక్షలు జమ చేయనున్నామని తెలిపారు. ఈ మొతాన్ని వసూలు చేయడానికి లీజుదారులకు త్వరలో నోటీసులు జారీ చేస్తామని చెప్పారు.