శ్రీకాకుళం

ఇంకా సస్పెన్స్ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 26: జిల్లాలో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆచితూచి అడుగులు వేయడంతో ఇక్కడ ఇంకా సస్పెన్ కొనసాగుతోంది. నిన్నమొన్నటివరకు పార్టీ శ్రేణులు ఆదివారం నిర్వహించే తెలుగుదేశం పార్టీ పాలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించి అభ్యర్థిత్వాన్ని అధినేత చంద్రబాబు వెల్లడిస్తారని ప్రచారం జోరందుకుంది. ఒకవైపు సిఎం నివాసంలో ఉదయం 10గంటలకు పాలిట్‌బ్యూరో సమావేశం ఆరంభం కాగా, జిల్లాలో ఆశావహులతోపాటు పార్టీ కేడర్ టివిలకు అతుక్కొని ఎవరికి కుర్చీ దక్కుతుందన్న ఉత్కంఠ రేపింది. సమావేశానికి జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు పాలిట్‌బ్యూరో సభ్యురాలు కావలి ప్రతిభాభారతీ హాజరయ్యారు. వీరిద్దరికి ఇక్కడ అనేకమంది నేతలు ఫోన్‌లు చేసి ఎవరు అభ్కర్థి అని విషయాన్ని రాబట్టేందుకు నానా తంటాలు పడటం కనిపించింది. వారివారి అనుయాయుల ద్వారా అభ్యర్థుల పేర్లను తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు వృథా ప్రయాసగా మిగిలాయి. పాలిట్‌బ్యూరో సమావేశ సభ్యులంతా నిర్ణయం అధినేత చంద్రబాబుదే అని తెగేసి చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లా నుంచి 20మంది అభ్యర్థులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం దరఖాస్తు చేసుకొని వారివారి అనుయాయుల ద్వారా సుమారు 90శాతం ఓటర్లు తెలుగుదేశం పార్టీలో ఉండటం వలన ఎవరికి బి-్ఫరం లభిస్తే వారే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపు ఖాయమని ప్రచారం. దీనిని దృష్టిలో ఉంచుకునే అభ్యర్థులు అధిష్టానం స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.
తొలుత సామాజిక వర్గాల వారీగా దరఖాస్తులు పరిశీలించి అధిష్ఠానానికి నివేదిస్తామని జిల్లా నాయకత్వం చేసిన ప్రయత్నానికి ఆదిలోనే బ్రేక్ పడింది. అక్కడ నుంచి ఇక్కడి నేతలంతా సిఎం చంద్రబాబుదే తుది నిర్ణయం అని రూటుమార్చి ఆశావహుల నుంచి ఒత్తిడి తప్పించుకున్నారు. పాలిట్‌బ్యూరో సభ్యులు కూడా ఇదేమార్గాన్ని ఎంచుకొని పుణ్యం పురుషార్థం బాబుకే దక్కేలా ఏకవాక్య తీర్మానం చేయడం పార్టీ క్రమశిక్షణకు ఓ తార్కాణం. ఆశావహుల్లో మాత్రం ఉత్కంఠ వీడకపోవడం వారివారి అనుయాయులు ఒకింత హైటెన్షన్‌కు లోనవుతున్నారు. నామినేషన్ గడువుకు కేవలం 24గంటలే సమయం ఉండటంతో ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈనెల 28వతేదీలోగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయాల్సి ఉన్నప్పటికీ అధినాయకత్వం మాత్రం పేరు వెల్లడించక పోవడంతో గ్రామం నుంచి రాజధాని వరకు వాడివేడి చర్చ సాగుతోంది. అనేకమంది ఆశావహులు అమరావతికి చేరుకొని అభ్యర్థిని ఖరారు చేయించుకునే పనిలో తీరిక లేకుండా గడపగా, వారి మందీమార్బలం మాత్రం ఇక్కడ నామినేషన్ ఏర్పాట్లకు సిద్ధం అవుతున్నారు. 3 నుండి 6 పేర్లు పార్టీ అధిష్ఠానం పరిశీలించిందని, అమావాస్య కావడం వలన నిర్ణయం వెల్లడించలేదని ముఖ్య నేతలు చెబుతున్నారు. సామాజికవర్గాల వారీగా పరిశీలకుల పేర్లు పరిశీలించిందా? లేకుంటే కార్పొరేట్ మైండ్‌సెట్‌తో ముందుకు వెళుతుందా? అన్న సందేహాలు ఇక్కడ తమ్ముళ్లను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం 2004 నుంచి పార్టీ విధేయులుగా సేవలు అందించిన వారిని ఎంపిక చేస్తామని వెల్లడించడంతో సీనియర్లు ఆశలు పెంచుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కావలి ప్రతిభాభారతీ, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు మరికొన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయనే వాదన కూడా లేకపోలేదు. ఎమ్మెల్సీ అభ్యర్థత్వాన్ని చంద్రబాబు వెల్లడించేవరకు జిల్లాలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. సీనియారిటీ కా....సామాజిక వర్గానికా పెద్దపీట వేస్తారో సాగుతున్న చర్చ అధికార పార్టీని వేడెక్కిస్తోంది.

పెంచిన పన్నులు రద్దు చేయాలి
* 28న రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు బంద్
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 26: రవాణా రంగంపై పెంచిన పన్నులు, ఫీజులు, పెనాల్టీలు రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 28వతేదీన రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌బంద్‌ను జయప్రదం చేయాలని సిటు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్, డి.గోవిందరావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సిటు కార్యాలయంలో ట్రాన్స్‌పోర్టు బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి-టిడిపిలు రవాణా రంగంపై కోలుకోలేని విధంగా భారాలు వేస్తున్నాయని విమర్శించారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత గడచిన 30 నెలల్లో 20సార్లు డీజిల్ ధరలు పెంచారని, ముఖ్యమంత్రి లీటర్ డీజిల్‌పై అదనంగా రూ.4 పన్ను వేశారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో రిజిస్ట్రేషన్, ఫైనాన్స్, ట్రాన్స్‌ఫర్, పాసింగ్ ఫీజులు 110 శాతం నుండి 500శాతం వరకు పెంచారని విమర్శించారు. లారీ రిజిస్ట్రేషన్, పాసింగ్, ట్రాన్స్‌ఫర్ ఫీజులు 50 నుండి 800శాతానికి పెంచారన్నారు. కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంపై కత్తి కట్టిందని, మోటారు రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు వేలాది కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ మరోవైపు రవాణారంగంపై భారాలు వేస్తుందని విమర్శించారు. రవాణా రంగంపై భారాలు వేస్తూ ఇచ్చిన 894 ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 28న ట్రాన్స్‌పోర్టు బంద్ సందర్భంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు.

తెలగ కులస్థులను
బిసి జాబితాలో చేర్పించాలి
* నిరాహార దీక్షలో సంఘ నాయకులు
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 26: తెలగ, కాపు, బలిజ, ఒంటరి అని పిలువబడే కాపు కులస్థులను బిసి జాబితాలో చేర్చే విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వలనే రాష్ట్ర కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపుమేరకు ఆదివారం 80 అడుగుల రోడ్డు సమీపంలో నిరాహారదీక్ష చేపట్టారు. జిల్లా తెలగ సంక్షేమ సంఘంఅధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశరావు అధ్యక్షతన దీక్ష జరిగింది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో నిరాహారదీక్షలు చేస్తున్నామని, ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారమే కాపు జాతిని బిసి జాబితాలో చేర్చాలని కోరుతున్నామే తప్ప కొత్తగా అడిగిందేమీ లేదని గ్రామస్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకు కాపు జె ఏసి ఏర్పాటుచేసి బిసిలో చేర్చేంతవరకు ఉద్యమ కార్యక్రమాలు దశలవారీగా కొనసాగుతాయన్నారు. కాపులను బిసిలో చేర్పించే విషయమై అసెంబ్లీలో తీర్మానం చేసి 9వ సెడ్యూల్‌లో చేర్పించాలని కేంద్రానికి లేఖ రాస్తానన్న ముఖ్యమంత్రి హామీ విస్మరించారన్నారు. 1966వరకు బిసిలో ఉన్న తెలగ కులస్థులను అనంతరం తొలగించినందువలనే మళ్లీ దానిని పునరుద్ధరించాలని కోరుతున్నట్లు తెలిపారు. నిరాహార దీక్షలో సిరిగిరి వరదరాజులు, కొత్తపల్లి నారాయణరావు, ముత్తా రమణ, లక్ష్మణరావు, మామిడి ఈశ్వరరావు, యర్నాగుల జగ్గారావు, ముత్తా వెంకటరమణ, కె.నర్శింగరావు, బత్తుల రామనర్శింగరావు, ప్రగడ వాసుదేవరావు పాల్గొన్నారు. తెలగ సంఘ నాయకురాలు శవ్వాన ఉమామహేశ్వరి దీక్షలో కూర్చొన్న వారికి సాయంత్రం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.