శ్రీకాకుళం

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 27: నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని నగరపాలక సంస్థ పి.ఏ శోభ ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలంటే సరైన విద్యాబోధన, వౌలిక సదుపాయాలు ఉండవనే అపోహ ప్రజల్లో ఉందని, అందుకే ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చడం లేదన్నారు. అటువంటి అపోహలను తొలగించి ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన విద్యాభోదన, సృజనాత్మకత ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఉందనేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. సోమవారం స్థానిక పుణ్యపువీధిలో పిఎస్‌ఎన్ ఎం హెచ్ స్కూల్ ప్రాథమిక పాఠశాలల సముదాయం ఆధ్వర్యంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సృజనోత్సవాలు జరిగింది. వివిధ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఆమె తిలకించారు. అనంతరం ప్రదర్శనల వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలో 30 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని, వాటిలో పూర్తిస్థాయిలో విద్యార్థులు చేరేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి ఉచిత విద్యతోపాటు భోజనం, ఏకరూపుదుస్తులు, పుస్తకాలు అన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వీటిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తిస్థాయిలో విద్యార్థులు ఉండేలా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. మంచి విద్యాభోదనతోపాటు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచినట్లయితే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై మక్కువ పెంచుకుంటారని తెలిపారు. నెలరోజుల క్రితం విద్యావైజ్ఞానిక ప్రదర్శనలపై ఆదేశాలు జారీ చేశారని, తక్కువ సమయంలో ఇంతమంచి ప్రదర్శనలను విద్యార్థులతో ఏర్పాటు హర్షణీయమన్నారు. విద్యార్థులు తయారుచేసిన వివిధ ప్రదర్శనలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయని కితాబిచ్చారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచినట్లయితే వారు మరింత ఉన్నత స్థాయికి చేరుకోగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటుచేసిన పుణ్యపువీధి, చేపలవీధి, రెల్లివీధి, రెల్లవీధి, ఇలిసీపురం, బొందిలీపురం, బలగ, ఆదివారం, హడ్కోకాలనీ, డగ్లస్ ఏయిడెడ్ పాఠశాలల విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. తొలుత ప్రముఖ భౌతిక శాస్తవ్రేత్త చంద్రశేఖర వెంకటరామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పిఎస్‌ఎన్‌ఎంహెచ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు పి. ఇందిరామణి అధ్యక్షతనజరిగిన కార్యక్రమంలో సిటిఆర్వో జగన్మోహనరావు, ఎంఇవో జగన్నాధరావు, పుణ్యపువీధి నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.రామారావు, రమేష్‌బాబు, భరద్వాజ, సత్యనారాయణమూర్తి, బి.లక్ష్మీనారాయణమ్మ, రమాదేవి, విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.