శ్రీకాకుళం

జాబ్ రావాలంటే బాబు పోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 27: యువతకు జాబ్ రావాలంటే బాబు పోవాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం యువజన, రైతు, మహిళా , విద్యార్థి విభాగాల కమిటీల ఏర్పాటుకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు విభాగాల కమిటీల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు రుణమాఫీ చేయరని తేలిపోయిందని, మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. తాము మోసపోయామన్న ఆవేదన మహిళల్లో ఎక్కువగా ఉందని, రూ.లక్ష అప్పు తీసుకున్న వారికి 12శాతం వడ్డీ రూ.30వేలు అవుతుందని రూ.1.30 లక్షలకు బదులుగా కేవలం రూ.30వేలు ఇచ్చి పసుపు-కుంకుమ కొనుక్కోమనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయాన్ని మహిళలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో నమ్మి చంద్రబాబుకు ఓటు వేశారని, ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించలేదన్నారు.
వైకాపా హైపవర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ పార్టీ నిర్మాణం గ్రామస్థాయి నుండి జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైకాపా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అడుగడుగునా వైఫల్యం చెందిందని, ఆ పార్టీ నాయకులు అరాచకశక్తులు రోజురోజుకూ పెచ్చుమీరి పోతున్నాయన్నారు. జిల్లా పరిశీలకుడు కొయ్య ప్రసాదరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధానాలను ఎండగట్టేందుకు సమాయత్తం కావాలన్నారు. రానున్న రోజుల్లో వైకాపా అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు. వ్యవసాయ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయిందన్నారు. బాబు అనుసరిస్తున్న విధానాల వలన ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందన్నారు. లక్షలాది మంది రైతు కుటుంబాలు వలసబాట పడుతున్నారన్నారు. పార్టీ విభాగాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జగ్గంపూడి రామ్మోహనరావు మాట్లాడుతూ వై ఎస్ కుటుంబాన్ని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదన్నారు. అనుబంధ విభాగాలు పటిష్టం చేయడానికి చిత్తశుద్ధితో పనిచేసే వారు ముందుకు రావాలన్నారు. వరుదు కళ్యాణి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గడచిన మూడేళ్లలో వైకాపాను అణచివేసేందుకే కుట్రలు, కుతంత్రాలు పన్నిందన్నారు. వైకాపాకి ప్రజాబలం ఉందన్నారు. సంస్థాగత నిర్మాణంపై పార్టీ దృష్టి సారించిందని, అనుబంధ విభాగాలు మరింత తోడ్పాటును ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో 38 మండల కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి, చింతాడ మంజు, సలామ్‌బాబు పాల్గొన్నారు. అనంతరం 38 మండలాల కమిటీలను ఏర్పాటు చేశారు.