శ్రీకాకుళం

దరఖాస్తు చేయకుండానే సిఎం అభ్యర్థిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిన వెంటనే ఎన్నికల రణరంగంలోకి దూకిన వారు కొందరైతే.. రూ.కోట్లు ఖర్చు పెడతామంటూ కోతళ్ళరాయుళ్ళు మరికొందరైతే..చాంతాడులా ఆశావహుల జాబితా 20 మందికి పైగా తెలుగుతమ్ముళ్ళు ఎమ్మెల్సీ బరిలో ఉంటామంటూ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మంత్రికి దరఖాస్తులు అందిజేస్తే...తంతే బూర్లు గంపలో పడినట్టు సామెత మాదిరిగా శత్రుచర్ల విజయరామరాజు శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ ఖరారు చేసింది. జిల్లా నుంచి జెండా మోసిన అనుభవంతో అనేకమంది సీనియర్లు వివిధ సామాజికవర్గాలకు చెందిన పది నియోజకవర్గాల నుంచి 20 దరఖాస్తులు జిల్లా పార్టీ నుంచి రాష్ట్ర పార్టీకి చేరిన జాబితాలో శత్రుచర్ల దరఖాస్తే లేదు. కాని - అనూహ్యరీతిలో ఆయన పేరు తెరమీదకు అమరావతి నుంచి వచ్చింది. ఆయన ఓటు హక్కుతోపాటు వ్యక్తిగతంగా అన్ని కోణాల నుంచి నామినేషన్‌కు దాఖలుకు అడ్డంకులు లేవన్న విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలుసుకునే ప్రయత్నంలో జిల్లా అంతటా శత్రుచర్లకే ఎమ్మెల్సీ బి.్ఫరం బాబు ఇస్తారన్న ప్రచారం జోరందుకుంది. చివరిగా సోమవారం అర్థరాత్రి వరకూ హైడ్రామా తర్వాత మంగళవారం నామినేషన్ ఘట్టానికి ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీత సమక్షంలో జిల్లా ఎమ్మెల్యేలంతా అంకురార్పణం చేశారు. అయితే శత్రుచర్లకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎటువంటి దరఖాస్తు లేకుండా ప్రకటించడంతో ఇక్కడ ఎమ్మెల్యేలు అంతగా ఆస్వాదించ లేకపోయారు. దీంతో భారీ ఊరేగింపుగా నామినేషన్‌కు వెళ్ళాల్సిన తమ్ముళ్ళలో జోష్ కనిపించలేదు. ర్యాలీ అనుకున్నంతగా ఉత్సాహంగా సాగించలేకపోయారు. దీంతో ‘రాజు’గారికి కోపం వచ్చింది. ఆయన మందీమార్బలం వచ్చినంతవరకూ నామినేషన్ వేసేందుకు కలెక్టరేట్ మెట్లు కూడా ఎక్కకుండా ఉండిపోవడంతో, గంటన్నర సమయం తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీషా, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆయన వద్దకు వచ్చి కలెక్టర్ ఛాంబర్‌లో ఎమ్మెల్యేలంతా చాలా సమయం నుంచి వేచి చూస్తున్నారంటూ చెప్పకుండానే రాజుగారిలో అసహనాన్ని గమనించి ఆ ఇద్దరు జూనియర్లు వెనుదిరిగారు. ఇంతలో శత్రుచర్ల జనం, నామినేషన్లు సెట్లు పట్టుకుని ఆయన అనుచరులు రావడంతో కలెక్టర్ ఛాంబర్‌కు వెళ్ళగా, సుమారు మూడున్నర గంటలపాటు ఆ సెట్లు నింపే పనిలో విప్ కూన రవికుమార్ నిమగ్నం కావడంతో నామినేషన్లు దాఖలు సకాలంలో చేయగలిగారు. అంతకుముందుజిల్లా ఎమ్మెల్యేలు, ఎం.పి. పార్టీ శ్రేణులు ఆయనతో నామినేషన్ వేయించేందుకు కలెక్టరేట్ వరండాలపై పరుగులు తీస్తూ కావల్సిన పేపర్లన్నీ సమకూర్చే పనిలో పడ్డారు. ఇన్‌ఛార్జి మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే శివాజీ తప్ప ఆయన పరివారం మాదిరిగా పనిచేయాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితికి రాజుగారి కోపమే!
శ్రీకాకుళంలో యుద్ధం.. మూలాలు విజయనగరం
ఉద్యమాల పురిటిగడ్డయైన శ్రీకాకుళంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కుర్చీకోసం నామినేషన్ల పర్వం పూర్తయి అభ్యర్థి యుద్ధానికి సిద్ధమయ్యారు. అయితే - అధికార పార్టీ నుంచి బరిలోకి దిగిన శత్రుచర్ల విజయరామరాజు చినమేరంగి రాజావారు కాగా, బలిజిపేటకి చెందిన మామిడి శ్రీకాంత్ పొరుగు జిల్లా వాసే. వీరిద్దరు టిడిపి, వైకాపా నుంచి బరిలో ఉన్నప్పటికీ ఈ పరిస్థితి కల్పించింది కూడా పొరుగు మంత్రి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇలా..మూలాలు విజయనగరం జిల్లావైనప్పటికీ యుద్ధం మాత్రం శ్రీకాకుళం వేదికగా మారింది. ఓటర్లు స్థానికులైనా ‘బాబు’ నిరంకుశ నిర్ణయంపై ఆశలు పెంచుకుని రంగంలోకి దిగిన శ్రీకాంత్ ఉనికి ఏ మేరకు కాపాడుకుంటారో ‘కాపు’కాసిన బొత్స ఎటువంటి పాత్ర పోషిస్తారో అన్న చర్చ జిల్లాఅంతటా తారాస్థాయికి చేరుకుంది. ఇదిలాఉండగా రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన పంథా కొనసాగించి అధికార పార్టీకి ఝలక్ ఇస్తారా? లేకుంటే జగన్ మైండ్‌సెట్‌తో వౌనం వహిస్తారా? అన్న చర్చ మొదలైంది. ఈ ట్విస్టుల నడుమ ఎమ్మెల్సీ పోరు సిక్కోల్ గడ్డపై ఎలా ఉంటుంది. రాజకీయ పరిణామాలు ఎటుదారి తీస్తాయో అంటూ పరిశీలకులు అంచనాలు వేయలేకపోతున్నారు.
వంశధారే ‘రాజా’ వారిని జిల్లాకు రప్పించింది
నిజాయితీగా రాజకీయాలు చేస్తారంటూ పేరున్న విజయరామరాజును పెద్దల సభలో అడుగుపెట్టించేందుకు బి.్ఫరం నేరుగా బాబే అందించేందుకు వంశధార సమస్యే ప్రధాన కారణంగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల జరిగిన నిర్వాసితుల పోరాటం, అందుకు సి.ఎం. క్షమాపణ, స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు వైఫల్యానికి మూల్యమే రాజుగారికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చేలా చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. భవిష్యత్‌కు మరో పవర్ సెంటర్ పాతపట్నంలో తెరుచుకుంటేనే పార్టీకి బలం ఉంటోందన్న బాబుకు అందిన ఫీడ్‌బ్యాక్ ఆచరణలోకి అత్యంతవేగంగా వచ్చింది. దీంతో కలమటకు చెక్..మంత్రి అచ్చెన్న మైలేజ్‌కు బ్రేకులు పడేలా ఈ నిర్ణయం ఉందని తమ్ముళ్ళే బహిరంగంగా మాట్లాడుతున్నారు.
మూడు నామినేషన్లతో ముగిసిన పర్వం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నియోజకవర్గ విధానమండలి సభ్యుల స్థానానికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు ప్రక్రియ ఈ నెల 21వ తేదీన ప్రారంభం అయినప్పటికీ, చివరి రోజు మంగళవారం మాత్రమే మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఎమ్మెల్సీ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధరబాబుకు పోటీ చేస్తున్న అభ్యర్ధులు దరఖాస్తులు అందించారు. తెలుగుదేశం పార్టీ నుంచి శత్రుచర్ల విజయరామరాజు, ఇండిపెండెంట్లుగా మామిడి శ్రీకాంత్ రెండేసి సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే, తమరాల శోభనబాబు ఒక సెట్ నామినేషన్ వేశారు. మార్చి 1న నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుంది. మూడో తేదీన అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువుగా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ నామినేషన్ల ప్రక్రియలో డిఆర్వో సహాయ రిటర్నింగ్ అధికారిగా నటుకుల సత్యనారాయణ పాల్గొన్నారు.

నిస్పక్షపాతంగా విచారణ
సీతంపేట, ఫిబ్రవరి 28: సీతంపేట గిరిజన సహకార సంస్థలో ఇటీవల జరిగిన పరిణామాలపై ఇచ్చిన ఫిర్యాదులు మేరకు విచారణ చేపట్టేందుకు గిరిజన సహకార సంస్థ విజిలెన్స్ అధికారి జె.వెంకటమురళి మంగళవారం కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భం గా తనను కలిసిన విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన సీతంపేట బ్రాంచి మేనేజర్ సాధు నారాయణరావుపై అదే కార్యాలయంలో పనిచేస్తున్న నరసింహులు, సూ ర్యారావు, సాయమ్మ అనే ఉద్యోగులు కార్యాలయం లోపలికి వచ్చి పాతకక్షతో నాపై దాడి చేశారని బిఎం, జిసిసి ఎండికి 22వతేదీన ఫిర్యాదు చేశారన్నారు. అట్రాసిటీ కేసు కూడా తనపై పెట్టారన్నట్టు తెలిపారు. ఎండి ఆదేశాల మేరకు తాను ఈ ఘటనపై విచారణ నిమిత్తం వచ్చి ఇరువర్గాల నుంచి వాం గ్మూలం తీసుకున్నానన్నారు. జిసిసి బ్రాంచి మేనేజర్ సాయ మ్మ అనే దళిత మహిళపై దుర్భాషలతో దాడి చేసినట్టు గిరిజన, దళిత సంఘాలు కూడా ప్రధాన కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు ఇచ్చాయన్నారు. తాను సీతంపేట వచ్చి స్వయంగా ఈ ఘటనపై ఇంకేమైనా అదనపు వివరాలు, సాక్ష్యాలు తెలుసుకొనేందుకు ఇక్కడకు వచ్చి విచారణ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
చర్యలు తీసుకోండి: గిరిజన సహకార సంస్థలో బ్రాంచి మేనేజర్‌గా పనిచేస్తున్న సాధు నారాయణరావు బిఎంగా పనిచేసేందుకు అనర్హుడని ఎమ్మెల్యే కళావతి పేర్కొన్నారు. విచారణ నిమిత్తం జిసిసి కార్యాలయానికి వచ్చిన విజిలెన్స్ అధికారి జె.వెంకటమురళీని కార్యాలయంలో కలిసి ఈ సంఘటనపై ఆమె వివరించారు. గతంలో ఈయనపై అనేకమార్లు జిసి సి ఎండికి ఫిర్యాదు చేశామన్నారు. అయినప్పటికీ ఆయన పనితీరులో ఎటువంటి మార్పు రాలేదని, గిరిజనులకు అనుకూలంగా పనిచేయాల్సిన ఆయన ఇష్టానుసారం వ్యవహరిస్తూ దళిత మహిళపై ఈ విధంగా దాడి చేయడం, దుర్భాషలాడడం దారుణమన్నారు. దీనిపై విజిలెన్స్ అధికారి మాట్లాడుతూ విచారణ నిస్పక్షపాతంగా చేపడుతున్నామని, విచారణ నివేదికను జిసి సి ఎండికి అందజేస్తామని సమాధానం ఇచ్చారు. ముందుగా గిరిజన సంఘాల నాయకులు సత్యారావు, లక్ష్మణరావు, కాంతారావు విజిలెన్స్ అధికారిని కలిసి బిఎం విధుల నుంచి తొలగించి సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు.

బడాబాబుల కోసమే థర్మల్ పవర్ ప్లాంట్
* ఆలిండియా కిసాన్ మజ్దూర్ సభ జాతీయనాయకుడు బాలచందన్ సడంగి
సంతబొమ్మాళి, ఫిబ్రవరి 28: థర్మల్ పవర్‌ప్లాంట్లు, అణు విద్యుత్ కేంద్రాలు, పోర్టులు బడాబాబుల కోసమని ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ జాతీయనాయకుడు బాలచందన్ సడంగీ అన్నారు. థర్మల్ ప్లాంట్ వ్యతిరేక పోరాటంలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన వారికి జోహర్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. హనుమంతునాయుడు వద్ద ఉన్న జీరు నాగేశ్వరరావు, ఎర్రయ్య, బారికియ్య అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల్లో థర్మల్ పవర్‌ప్లాంట్లు ఎక్కడా లేవని, సూర్యరశ్మి, గాలిద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారని, భారతదేశంలో వెనుకబడిన జిల్లా శ్రీకాకుళంతోపాటు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజలకు హానికరమైన థర్మల్ పవర్‌ప్లాంట్‌ను, అణువిద్యుత్ కేంద్రాలు నిర్మించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయన్నారు. బడాబాబులకు కొమ్ము కాసేందుకు సామాన్యులకు నష్టం కలిగించే వాటిని విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు ప్రకాశ్, వడ్డితాండ్ర పోరాట కమిటీ అధ్యక్షుడు హన్నురావు, కార్యదర్శి నర్శింగరావు, ఎం.వెంకటరావు, మోహన్‌రెడ్డి, ఎస్.రాజారావు పాల్గొన్నారు.