శ్రీకాకుళం

అణుపార్కు గ్రామాల్లో ముగిసిన పల్స్‌సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రజాసాధికార సర్వేను నిర్వహించి తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుకు తీసుకోవాల్సిన కార్యక్రమాలను రూపకల్పన చేసే బాధ్యతలను ఉన్నతాధికారులకు అప్పగించింది. ప్రపంచ పటంలోనే శ్రీకాకుళం జిల్లాను పదిలపరిచే ఉన్నతమైన అణుపార్కు నిర్మించే పరిసర గ్రామాల్లో పల్స్ సర్వేను మరింత సమగ్రంగా పూర్తి చేసి ఈ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం సమర్పించారు. అంతర్జాతీయ స్థాయిలోనే కొవ్వాడ అణుపార్కుకు ఒక ప్రత్యేకత ఉంది. నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామాతో ఈ పార్కు ఏర్పాటుకు ప్రధాని నరేంద్రమోదీతో ఒప్పందం కుదుర్చుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం పనుల వేగవంతానికి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగింది.
ముఖ్యంగా నిర్వాసితుల సమస్య పరిష్కరించేందుకు ప్రధాన భూమిక పోషించే పల్స్ సర్వే నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి అందించిన వెనుక మెరుగైన ప్యాకేజీ సాధించాలన్న లక్ష్యం దాగి ఉంది. అక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా అన్ని కోణాల్లో నిర్వాసితులకు ప్రభుత్వం అండగా నిలిచే కార్యక్రమాలను చేపట్టేందుకు పల్స్ సర్వేలో సేకరించిన వివిధ అంశాలు ప్రామాణికంగా నిలుస్తాయని ఉన్నతాధికారుల విశ్వాసం. ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వానికి నివేదికలు అందించి అక్కడ నుండి మరిన్ని అనుమతులు పొందేందుకు జిల్లా యంత్రాంగం వేగాన్ని పెంచింది. ముఖ్యంగా అణుపార్కుకు కావాల్సిన భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ విడుదల, అలాగే బాధిత రైతులకు పరిహారం చెల్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు పల్స్ సర్వే కీలకంగా నిలుస్తుందని అధికారులు చర్చించుకున్నారు. ఈ నెలలోనే భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసే ప్రక్రియను కూడా ఇక్కడ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అణుపార్కు నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించే పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు విశాఖలో ఉన్న కేంద్ర కార్యాలయాన్ని శ్రీకాకుళానికి తరలించాలని కూడా జిల్లా కలెక్టర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఈ కార్యాలయం తరలింపునకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే అణువిద్యుత్ కేంద్ర నిర్మాణ పనులు మరింత ఊపందుకోనున్నాయి. శాంతిభద్రతలు పరిరక్షించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగానికి చేదోడు, వాదోడుగా ఉండేలా కేంద్ర బలగాలను ఈ ప్రాంతంలో మోహరించేందుకు ఇప్పటికే ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. అణుపార్కుపై ఉన్న అపోహలను తొలగించాలని వామపక్షాలు గగ్గోలు పెడుతున్నా స్థానికుల నుంచి మాత్రం స్పందన అంతంతమాత్రంగా ఉండటంవలన జిల్లా యంత్రాంగం కూడా ప్రాజెక్టు రూపకల్పనకు వడివడిగా అడుగులు వేస్తూ మరింత వేగం పెంచిన విషయం అందరికీ తెలిసిన నిజం.