శ్రీకాకుళం

నిర్వాసిత గ్రామాలుగా గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం, మార్చి 6: వంశధార రిజర్వాయర్ నిర్మాణం మూలంగా నష్టపోయిన హిరమండలం, పెద్దకోరాడ, కోరాడ, కొండకోరాడ గ్రామాలను నిర్వాసిత గ్రామాలుగా గుర్తించాలని నిర్వాసితులు కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో పోలీసులు అదుపుచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిర్వాసిత సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణంవల్ల భూములు కోల్పోయి నిరాశ్రయులై ఆర్థికంగా నష్టపోయామని నిర్వాసితులు తెలిపారు. నిర్వాసిత గ్రామాలుగా గుర్తించి తమను ఆదుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు కోరినప్పటికీ స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు చెల్లించే పరిహారాలను అందించాలని కోరారు. అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో సహనం కోల్పోయిన నిర్వాసితులు గొట్టాబ్యారేజ్ సమీపంలోని రిజర్వాయర్ గట్టు వద్ద నిరసన తెలిపారు. అనంతరం హిరమండలం ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టడంతో పోలీసులు పహరా కాసి అదుపు చేశారు. ఈ సమయంలో నిర్వాసితులకు మద్దతు తెలిపిన గంగరాపు సింహాచలంను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. దీనిని గమనించిన నిర్వాసిత మహిళలు సింహాచలాన్ని చుట్టుముట్టి రక్షణ కల్పించడంతో పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. గొడవ సద్దుమణిగే సమయంలో సింహాచలాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని పాతపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం డిటి శంకరరావుకు వినతిపత్రం అందించారు. నిర్వాసితులు శంకరరావు, తవుడు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు. పాతపట్నం సి ఐ ప్రకాశరావు ఆధ్వర్యంలో సారవకోట, పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.