శ్రీకాకుళం

ముగిసిన ‘మండలి’ సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 9: ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సాయంత్రం 6 గంటలకు పూర్తయింది. ఎవరికి ఓటు వేయాలో..ఎవరిపై వేటువేయాలో విద్యావంతులు నిర్ణయానికి వచ్చేకే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలు కట్టారు. తొలుత మందగొడిగా సాగిన పోలింగ్, తర్వాత ప్రతి రెండు గంటల ఓటింగ్ ప్రక్రియ పరిశీలిస్తే...పుంజుకుంది! అసలు 50 శాతం కంటే పోలింగ్ జరగదని ఒక సమయంలో పోలింగ్ నిర్వహణాధికారులే తమ బూత్‌ల వద్ద సుస్పష్టం చేస్తున్న తరుణంలో సాయంత్రానికి 73.2 శాతం పోలింగ్ జరిగింది. టిడిపి - బిజెపి కూటమి కలిసి తమ శాయశక్తుల పనిచేస్తే 80 శాతం పోలింగ్ జరిగితే, బిజెపి అభ్యర్థి మాధవ్ విజయం తథ్యమంటూ అంచనాలు వేసుకున్న విషయం తెలిసిందే. బిజెపి - టిడిపి వర్గాలకు మేధావివర్గం పూర్తి సహకారం అందించినట్టు పోలంగ్ సరళి సుస్పష్టం చేస్తుంది. పోలింగ్ శాతం పెరిగేకొద్దీ పిడిఎఫ్ అభ్యర్థి అజశర్మ విజయానికి అడ్డంకులు ఏర్పడతాయన్న కామ్రేడ్లు అంచనాలకు పోలింగ్ సరళి ఉక్కిరిబిక్కిరి చేసినట్టు కనిపిస్తోంది. శర్మకు మద్దతు పలికిన కార్మిక,ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలు కంటే - అధికార పార్టీ మంత్రివర్యులు వారివారి శాఖాధికారులకు ఇచ్చిన సూచనలే భారీయెత్తున పోలింగ్ శాతం పెరిగేలా చేసిందంటూ పోలింగ్ నిర్వహణాధికారులు చెప్పుకొస్తున్నారు. మాధవ్ విజయానికి అంచనాలు వేసుకున్న టిడిపి నేతలు పట్ట్భద్రుల ఓటును నమోదు చేయించగలిన వారందరినీ పోలింగ్ కేంద్రం వరకూ తీసుకువెళ్ళి ఓటు వేయించు కోలేకపోయారు. దీనివల్ల మాధవ్ విజయానికి మార్గం సుమగం అయ్యేలా ఉందంటూ రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు. ఇకపోతే కాంగ్రెస్ మార్కుతో యడ్ల ఆదిరాజు హోరాహోరీలో కనిపించకపోయే పరిస్థితులే రాజకీయ పరిశీలకులకు కనిపిస్తోందని అంటున్నారు.
ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం పూర్తి చేపట్టినప్పటికీ, శ్రీకాకుళం నగరంలో పోలింగ్ కేంద్రం 48లో సాంకేతికపరమైన లోపాలు తలెత్తాయి. వాటిని వెంటనే సరిచేసేలా కలెక్టర్ దృష్టిసారించారు. అలాగే పోలింగ్ కేంద్రం 47కు వెళ్ళేందుకు పట్ట్భద్రులైన ఓటర్లు ఇబ్బందులు పడాల్సివచ్చింది. సుమారు కిలోమీటరు దూరంలోగల పోలింగ్ కేంద్రాన్ని గుర్తించడానికి అవస్థలు పడిన వారంతా వారి ఓటు స్లిప్‌ను తీసుకునేందుకు మరికొంతదూరం వెళ్ళాల్సి వచ్చింది. టి.పి.ఎం.హెచ్.స్కూల్ కొత్త్భవనానికి దారి తెలియని వారు కొందరైతే, ఓటు హక్కు కలిగిన వారికి సరైన విధంగా అక్కడ ఏజెంట్లు సూచనలు చేయలేక, వారి ఓటు హక్కుకు గల స్లిప్‌లు, వరుస సంఖ్య ఇవ్వలేకపోవడంతో చాలామంది వెనుదిరిగిపోయారు. ప్రతి పోలింగ్ సెంటర్‌లో సూక్ష్మ పరిశీలకులతోపాటు వీడియోగ్రాఫర్‌ను నియమించారు. అదే విధంగా రెండు వెబ్ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఓటు వినియోగించుకునేందుకు వచ్చేవారికి తమ ఓటు ఏ కేంద్రంలో ఉందో తెలుసుకునేందుకు పోలింగ్ కేంద్రాలవద్ద హెల్ప్‌డెస్క్‌లు కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయించినప్పటికీ వాటి ప్రయోజనం అంతంత మాత్రంగానే ఓటర్లకు కలిగింది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్సీ పోలింగ్ తొలుత మందగొడిగా సాగింది. రెండు గంటల సమయం దాటిన తర్వాత ఉదయం 10 గంటలకు 7.33 పోలింగ్ శాతం నమోదైంది. మధ్యాహ్నం 12 గంటలకు 25.90 శాతం నమోదుకాగా, 2 గంటల సమయానికి 45.1 శాతం, 4 గంటల సమయానికి 58.91 శాతం, పోలింగ్ సమయం ముగిసేసరికి 6 గంటలకు 72.70 శాతం పోలింగ్ నమోదైంది. గతసారి పట్ట్భద్రుల ఎన్నికల పోలింగ్‌తో పోలిస్తే సుమారు 25 - 32 శాతం పోలింగ్ పెరిగింది. దీనివల్ల పట్ట్భద్రులంతా పార్టీ మార్కుతో ఓట్లు గుద్దేశారన్న అంచనాలే ఇప్పుడు కథనాలుగా వినిపిస్తున్నాయి.

పట్ట్భద్రులుగా మేము సైతం
* సీతంపేటలో 88 శాతం పోలింగ్
* చైతన్యవంతులైన గిరి‘జనం’

శ్రీకాకుళం, మార్చి 9: మారుతున్న సమాజంలో మన్యం నుంచి మహానగరాలకు చేరుకుని వృత్తిశిక్షణలు పొంది, ఉద్యోగాలు సాధించుకునే పట్ట్భద్రులైన గిరిజన యువకులు వారి తొలి ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఉత్తరాంధ్ర జిల్లాల పట్ట్భద్రుడిని ఎంపికచేసి పెద్దల సభకు పంపించేందుకు ‘మేముసైతం’ అంటూ అత్యంత అధికంగా తమ ఓటు హక్కును సీతంపేట పట్ట్భద్రులు వినియోగించుకున్నారు. ఏకంగా 88 శాతం మంది గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకున్నారు. జిల్లాలోగల గిరిజన మండలాలైన సీతంపేట, కొత్తూరు, భామిని, సరుబుజ్జిలి, వీరఘట్టాం, ఎల్.ఎన్.పేట, హిరమండలం, మెళియాపుట్టి, మందస ప్రాంతాలకు చెందిన పోలింగ్ కేంద్రాల్లో గిరిజన పట్ట్భద్రులు తన ఓటు హక్కు వినియోగించడంలో సగటున 76 శాతం మంది ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలో మా నిర్ణయం కీలకమేనంటూ రుజువుచేశారు. మావోయిస్టులకు దారిచూపే యువతే కాదని, వారి కొరియర్ వ్యవస్థకు దిక్చూచిగా ఉండే యువత అంతకంటే కాదని, మన్యం ఒడిలో పుట్టిపెరిగిన గిరిపుత్రులమంతా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఆయుధంగా తమ ఓటును వినియోగించే సాధనంగా మార్చుకున్నామంటూ చాటిచెప్పే ప్రయత్నంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్ట్భద్రులు ఏకంగా 88 శాతం మంది సీతంపేటలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీలో యువత చైతన్యం అధికారులనే ఉక్కిరిబిక్కిరి చేసింది. సీతంపేట మండలంలో 301 మంది పట్ట్భద్రుల ఓటర్లకుగాను 262 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని 88 శాతం పోలింగ్ జరిగేలా రికార్డు సృష్టించారు. కొత్తూరులో 523 ఓటర్లకు, 390 మంది వినియోగించుకుని 74.6 శాతం పోలింగ్ నమోదుకాగా, భామినిలో 212 మంది ఓటర్లకు 170 మంది హక్కు వినియోగించుకుని 80 శాతంగా, సరుబుజ్జిలిలో 383 ఓట్లుకుగాను, 264 మంది ఓటుహక్కు వినియోగించుకుని 62 శాతంగా, వీరఘట్టాంలో 64 శాతంగా 618 మంది ఓటర్లకు 427 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎల్.ఎన్.పేటలో 185 మందికిగాను 131 మంది ఓటువేసి 75 శాతంగా, హిరమండలంలో 360 మందికి 267 మంది ఓట్లు వేసి 65 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే, పలాస డివిజన్‌లో మందసలో 74 శాతం (686/523), మెళియాపుట్టిలో 65 శాతం(384/256)గా నమోదైంది. ఇలా జిల్లా అంతటా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన పట్ట్భద్రుల యువకులు ఓటు హక్కును వినియోగించుకునే తీరును పరిశీలిస్తే వారిలో కలిగిన చైతన్యంతోపాటు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు వినియోగం, చదువుసంధ్యల్లో వారికి ప్రతిభ, వీటన్నింటికంటే - స్వర్ణశ్రీకాకుళానికి గిరిపుత్రులు సైతం!! అంటూ వారి భాగస్వామ్యాన్ని సర్కార్‌కు ఇటువంటి సందర్భాల్లో చెప్పకనే చెబుతున్నారు.