శ్రీకాకుళం

వసతిగృహాల ట్యూటర్లకు జీతాల బకాయిల విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, మార్చి 10: తమశాఖ పరిధిలో గడచిన మూడేళ్లుగా వసతిగృహాలలో ట్యూటర్లుగా పనిచేస్తున్న 72మందికి జీతాల బకాయిలను విడుదల చేసినట్లు డిడి ధనుంజయరావు తెలిపారు. స్థానిక సమీకృత వసతిగృహంలో శుక్రవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్యూటర్ల వ్యక్తిగత కారణాలకు 24లక్షలను జమ చేశారన్నారు. రాబోవు రెండేళ్లలో జిల్లాలోని 16 వసతి గృహాల విద్యార్థులకు గురుకుల పాఠశాలలకు తరలించాలని ఆయన తెలిపారు. జిల్లాలో 41 ప్రీ మెట్రిక్ వసతిగృహాలు ఉన్నాయని, ఇందులో 33 వసతిగృహాల నుండి 800మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరౌతున్నట్లు స్పష్టంచేశారు. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలలో శతశాతం ఫలితాలు సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 8300మంది విద్యార్థులు పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనంకోసం దరఖాస్తు చేయగా 7500మందికి రూ.9కోట్లను ఆయా విద్యార్థుల బ్యాంకు ఖాతాలలో జమ చేసినట్లు స్పష్టంచేశారు. అదేవిధంగా ఐదవ తరగతి 10వ తరగతి వరకు చదువుతున్న 3200 మంది విద్యార్థులకు రూ.1.40 ఉపకార వేతనంగా విడుదల చేసినట్లు వివరించారు. కులాంతర వివాహం చేసుకున్న 62మంది దంపతులకు చెరి రూ.50వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులుగా అందజేశామని తెలిపారు. వసతిగృహాలలో లేని విద్యార్థులకు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు రూ.2లక్షలమేరకు నగదులో నేరుగా అందజేస్తున్నామన్నారు. విలేఖర్ల సమావేశంలో పాలకొండ సహాయ సంక్షేమాధికారి కె.ప్రేమభూషణరావు, వసతిగృహాల సంక్షేమాధికారులు , ఉన్నత పాఠశాల హెచ్‌ఎం గణపతిరావు పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడికి ముందస్తు
చర్యలు తీసుకోవాలి

శ్రీకాకుళం, మార్చి 10: రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్‌కల్లాం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్యలు ఏర్పడకుండా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న మండలాలు, పురపాలక ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని ప్రజలకు సరఫరా చేయాలన్నారు. వేసవి దాటికి అంటువ్యాధులు సోకకుండా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పశుగ్రాసం కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని జిల్లాల వారీగా ఆయా శాఖలకు అవసరమైన కంటింజెంటు నిధులకు కార్యాచరణ ప్రణాళికను తయారుచేసి నిర్ణీత ప్రొఫార్మాలో ప్రతిపాదనలు రెండు రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో మందస, మెళియాపుట్టి, పాతపట్నం, సారవకోట మండలాల్లో వర్షాలు కురవడం వల్ల జిల్లాలో చల్లని వాతావరణం ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో తాగునీటి సమస్య లేదని, వేసవిలో కరువు నివారణకు కంటింజెంట్ ప్లాన్ తయారుచేసి ప్రభుత్వానికి నిర్ణీత ప్రొఫార్మాలో ప్రతిపాదనలు పంపించనున్నట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమీషనర్ పిఏశోభ, డిఎంఅండ్ హెచ్‌వో తిరుపతిరావు, డాక్టర్ మెండ ప్రవీణ్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు జి.రామారావు పాల్గొన్నారు.