శ్రీకాకుళం

బీల భూములపై భయం నీడలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఉద్దానం కొబ్బరి..సముద్రతీరం..పర్యాటక అందాలు..ప్రాచీన దేవాలయాలు..కాలుష్యం కాటులేని బీల భూములు..1272 ఎకరాలు. ఇందులో 300 ఎకరాలు రైతుల నుంచి ఎన్‌సిసి సంస్థ థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసింది. మరో 972 ఎకరాలు ప్రభుత్వం అప్పగించింది. మళ్ళీ ఆ బీల భూములపై భయం నీడలు కమ్ముకుంటున్నాయి! ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎన్‌సిసి సంసిద్ధం అవుతుంది. అందుకే - నవ్యాంధ్ర రాజధాని అమరావతి గడ్డమీద ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌లో ఉత్తరకోస్తా జిల్లాల్లో ఆహార ఆధారిత పరిశ్రమలను తొమ్మిది నెలకొల్పుతామని, అందులో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలోనే ఐదు ఏర్పాటు చేస్తామంటూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ప్రకటన వెనుక మతలబు ఉందంటూ విమర్శలు తెరమీదకు వస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం జిల్లాలో ఏర్పాటు కోసం సిద్ధమైన సోంపేట ధర్మల్ పవర్ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం అదే ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సోంపేట పరిధిలో పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న వివిధ సంస్థలు బీల ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలను అంగీకరించేది లేదని, ఎంతో ప్రాధాన్యం ఉన్న బీల ప్రాంతాన్ని యథాతథంగా ఉంచాలంటూ పలు సమావేశాలు నిర్వహించి, ఇటీవల మత్స్యకార ఐక్యవేదిక, పర్యావరణ పరిరక్షణ సమితి ప్రభుత్వానికి హెచ్చరించారు. అనంతరం కొంతకాలంపాటు ఎటువంటి కదలిక లేకుండా ప్రభుత్వం మిన్నకుండిపోయింది. 2016 చివరిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం సోంపేటతోపాటు బీల ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో రివాజుగా జరిగిన పర్యటనగానే అందరూ భావించారు.
2017 - 18 బడ్జెట్ సందర్భంగా ఆహార ఆధారిత పరిశ్రమలు నెలకొల్పే ఆలోచనలను ప్రభుత్వం బయటపెట్టగానే గతంలో కలెక్టర్ పర్యటన వెనుక ఇదే ఉద్దేశ్యం ఉందంటూ తాజాగా సోంపేట ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కమిటీ విమర్శలు ప్రారంభించింది. ఎటువంటి పరిశ్రమనైనా బీల ప్రాంతంలో నిర్మించాలనుకుంటే ఆ ప్రాంతాన్ని ఎత్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతో సముద్ర జలాల నుంచి ఈ ప్రాంతంలో ఉండే జీవరాశులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం తప్పదు. ఇప్పటికే సోంపేట ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కర్మాగారాన్ని నిర్మించేందుకు స్థానికుల నుంచి నాగార్జున సంస్థ సుమారు 300 ఎకరాలు భూములు కొనుగోలు చేసింది. సుమారు 972 ఎకరాల భూమిని ప్రభుత్వం పరిశ్రమ కోసం కేటాయించింది. ఈ భూమి సోంపేట ఉద్యమం, కాల్పులు అనంతరం వినియోగంలో లేకుండా పోయింది. స్థానికులు వారి భూమిని ఆధీనంలోకి తెచ్చుకుని సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఆహార ఆధారిత పరిశ్రమ నెలకొల్పేందుకు నాగార్జున సంస్థ మరోసారి రంగంలోకి దిగడం బడ్జెట్ సాక్షిగా దాదాపు ఖరారుగా కనిపిస్తుంది. దీనికి ముందే ఎన్‌సిసి ప్రతినిధులు 40 ఎకరాల భూమిని వారి స్వాధీనంలోకి తీసుకుని వ్యవసాయానికే వినియోగిస్తామంటూ అక్కడ రైతాంగాన్ని, పర్యావరణ పరిరక్షణ కమిటీ, మత్స్యకార ఐక్యవేదికకు నమ్మబలికి రాళ్ళు వేశారు. గతంలో కాలుష్యం కారణంగా చూపి ఉద్యమాన్ని నడిపిన నాయకులు, సంస్థలు ఆహార అధారిత పరిశ్రమ నెలకొల్పితే కాలుష్యం ప్రధాన కారణమని చెప్పలేరు.
ఇప్పటికే పశ్చిమగోదావరిలో ఏర్పాటవుతున్న మెగా ఆక్వా ఫుడ్ పార్కు విషయంలో కాలుష్యమంటూ ఉద్యమం నడిపినా ఎపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దానిని కొట్టిపారేసింది. దీంతో రానున్న రోజుల్లో సోంపేట పరిసరాల్లో కాలుష్యమంటూ ఉద్యమం వృథా ప్రయాసగానే మిగులుతుంది. సోంపేట ప్రాంతానికి ఉన్న బీల భూములు ప్రత్యేక పర్యావరణ ప్రాంతం కావడంతో బీల పరిరక్షణ కోసం మాత్రమే ఇప్పుడు ఉద్యమం ప్రారంభమైతే - దానికి ఏ మేరకు గుర్తింపు లభిస్తుందో చూడాల్సిఉంది. దేశవ్యాప్తంగా బీల ప్రాంతాలు దాదాపుగా కనుమరుగు అవుతున్న పరిస్థితులు నెలకొన్నాయని, బీల ప్రాంతాన్ని పరిరక్షిస్తే సముద్ర జీవరాశులతోపాటు, మడ అడవులు మరింతగా పెరిగి సునామీ వంటి ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతాయని ప్రముఖ పర్యావరణ వేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. థర్మల్ విద్యుత్ విషయంలో ఆ ప్రాంత ప్రజల్లో వచ్చిన స్పందన బీల పరిరక్షణను ఏ మేరకు వస్తుందో అనుమానమే? ఏదిఏమైనప్పటికీ, జిల్లా బాట పట్టిన ఆహార అథారిత పరిశ్రమలు ఇప్పటికే ఉత్తర్వులు పొందిన నాగార్జున సంస్థ తమ భూములను మరోసారి ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తే కొంత ఉద్రిక్తతతోపాటు మరోసారి సోంపేటలో ఉద్యమాలు ఊపందుకుంటాయని మాత్రం చెప్పకతప్పదు!

అధికారులు సక్రమంగా
విధులు నిర్వహించాలి
* రోడ్డు ప్రమాదాలకు
నివారణకు చర్యలు తీసుకోవాలి
* కలెక్టర్ లక్ష్మీనృసింహం
పాత శ్రీకాకుళం, మార్చి 16: జాతీయ రహదారి-16ను విస్తరించే ఆరులైన్ల నిర్మాణానికి అనుకూలంగా భూసేకరణ సరైన పద్ధతిలో నిర్వహించాలని, రోడ్డు పక్కన ఉన్న ఇళ్లను యజమానులతో మాట్లాడి జాగ్రత్తలు వహించి సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో గురువారం ఆరులైన్ల రోడ్ల విస్తరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్క ఫిబ్రవరిలోనే 34 రోడ్డు ప్రమాదాలు జరిగాయంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హైవే పక్కన ఉన్న మద్యం దుకాణాలను మూయించేందుకు ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో మద్యం యథేచ్చగా అమ్మకాలు చేపట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్‌పి ధరకు అధికంగా విక్రయాలు చేపడుతుంటే ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కనీసం బాధ్యత లేకుండా విధులు నిర్వహిస్తున్నారన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని, త్వరలో వాటిని కూడా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని కలెక్టర్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. హెల్మెట్‌ను వాటడం నామమాత్రంగా ఉండిపోయిందని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, నగరపాలక సంస్థ కమీషనర్ పి.ఏ.శోభ, డిటిసి శ్రీదేవి, ఆర్టివోలు, ట్రాఫిక్, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి
* నేటినుండి 10వ తరగతి పరీక్షలు
* 187 కేంద్రాలు * 37,422 మంది విద్యార్థులు
* సమస్యాత్మక కేంద్రాలో సిసి కెమెరాల ఏర్పాటు
శ్రీకాకుళం(రూరల్), మార్చి 16: ఈనెల 17వతేదీన శుక్రవారం నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డిఇఓ విఎస్ సుబ్బారావు తెలియజేశారు. విద్యార్థికి తొలిపబ్లిక్ పరీక్ష 10వ తరగతి పరీక్షలు. జిల్లా వ్యాప్తంగా 37,442మంది రెగ్యులర్, 812మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాలు ఇప్పటికే పలు సెంటర్ల సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో ప్రత్యేక గదిలో ప్రశ్నాపత్రాలు పోలీసు రక్షణలో ఉంచారు. జిల్లా వ్యాప్తంగా 187 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డిఇఓ తెలియజేశారు. పలు సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని డిఇఓ తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు పది ఫ్లైయింగ్‌స్వ్కాడ్‌లను నియమించినట్లు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో పూర్తిస్థాయి ఫర్నీచర్‌ను ఏర్పాటు చేశామన్నారు. 1744మంది ఇన్విజిలేటర్లను ఈ పరీక్షలకు వినియోగిస్తున్నట్లు డిఇఒ స్పష్టంచేశారు. 51మంది రూట్ ఆఫీసర్లకు 19 రూట్‌లుగా విభజించి పరీక్షల పర్యవేక్షణకు వినియోగిస్తున్నామన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఆయా కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది, పోలీసులు అందుబాటులో ఉంటారని, వేసవి కావడంతో తాగునీటితోపాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఏర్పాటుచేశామన్నారు. పరీక్ష ఉదయం 9:30 నుండి 12:15గంటల వరకు జరుగుతుందని, అరగంట ముందుగా పరీక్షా కేంద్రానికి విద్యార్థి చేరుకునేలా తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొత్త విధానంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలపై ఇప్పటికే పలుమార్లు విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులకు ఎటువంటి ఒత్తిడి కలిగించకుండా ప్రశాంతంగా ఉంచాలన్నారు. పరీక్షలు జరిగే క్రమంలో ఎటువంటి వదంతులను తల్లిదండ్రులు విశ్వసించవద్దని, ఎక్కడైన అవాంఛనీయ సంఘటనలు, మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే హెల్ప్‌లైన్ నెంబరు 9966735151, 9966745151 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని డిఇఓ సుబ్బారావు కోరారు.

పోస్టల్ ఉద్యోగులు సమ్మె
శ్రీకాకుళం(రూరల్), మార్చి 16: ఎన్‌జెసిఏ యూనియన్ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులకు జరిగిన ద్వైపాక్షిక చర్చలలో ముగ్గురు కేంద్రమంత్రులు హామీ నెరవేర్చడంలో ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా గురువారం ఒక్కరోజు పోస్టల్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెను నిర్వహించారు. అఖిలభారత తపాల ఉద్యోగుల సంఘం గ్రూప్-సి, అఖిలభారత పోస్టుమ్యాన్ ఎంటిఎస్ గ్రూప్-డి, అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం జిడిఎస్ సంఘాలు సంయుక్తంగా సమ్మెలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జిల్లా తపాల కార్యాలయం వద్ద నిరసనను తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం మొండివైఖరి, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారన్నారు. ఏప్రిల్ తరువాత శాఖలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, స్ట్ఫా మాత్రం లేరని ఉన్న వారితోనే పనులన్నీ చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిడిఎస్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి గుంట ముక్కల వీరభద్రరావు, గ్రూప్-సి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సింహాచలం, కార్యదర్శి వీరభద్రరావు, ట్రెజరర్ కె.రమేష్, పోస్టుమ్యాన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి బి.చంద్రమోహన్, ట్రెజరర్ త్రినాథ, జిడిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బిఎస్ ఆర్ మూర్తినాయుడు, కార్యదర్శి వి.విజయకృష్ణ, కోశాధికారి పి.రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.

అమరజీవికి ఘన నివాళిలు
* త్యాగం చేసిన వ్యక్తిపట్ల కృతజ్ఞత ఉండాలి
* మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం(రూరల్), మార్చి 16: నిస్వార్థ ఆలోచనలతో ప్రాణాలు అర్పించి దేశం, సమాజం కోసం త్యాగం చేసిన వ్యక్తిపట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైకాపా ఆధ్వర్యంలో గురువారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నగరంలోని పాతబస్టాండ్ సమీపంలో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 1901 మార్చి 16వతేదీన పొట్టి శ్రీరాములు జన్మించారని, ఇది 117వ జయంతిని అన్నారు. రాష్ట్ర ప్రజలను దివాలాతీయించే దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఆంధ్రరాష్ట్ర విడిపోయే సరికి రూ.9700 కోట్లు అప్పుల కలిగి ఉంటే నేడు మరో లక్షకోట్ల రూపాయలు అప్పు తెచ్చి రాష్ట్ర ప్రజలను చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. మూడేళ్లలో లక్షకోట్ల రూపాయలు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించే దిశకు తీసుకువెళ్లారన్నారు. అప్పు రాష్ట్ర ప్రజల ప్రమాణాల పెరుగుదలకు ఉపయోగపడాలే తప్ప పప్పు బెల్లాలకు ఖర్చు చేస్తున్నారన్నారు. దొంగ జిడిపి లెక్కలు చూపిస్తున్నారన్నారు. 11.6శాతం గ్రోత్‌రేటు ఉందని చెబుతూ రాష్ట్రప్రజలను, అంతర్జాతీయ సంస్థలను మోసగిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాపై చట్ట్భద్రత లేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకపోవడం వలనే నిధులు రావడం లేదని పోలవరం చట్టంలో ఉన్నందునే దానికి నిధులు కేటాయిస్తున్నారన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియచెప్పి ప్రజలను చైతన్యవంతం చేయనున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం నగరంలో ఓ వ్యక్తిని గెలిపించడం కోసం డివిజన్లన్నీ అస్తవ్యస్తంగా విడదీశారని పేర్కొన్నారు. ఒకే కుటుంబంలో ఉన్న నలుగురు వ్యక్తులు నాలుగు డివిజన్లలో ఓట్లను విడదీశారన్నారు. ఒక వ్యక్తిని గెలిపించడం కోసం ఇలా చేయడం అన్యాయమన్నారు. ఆ ఓటరు ఏ ప్రాంతానికైనా వెళ్లి టిడిపికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు అంధవరపు వరహానృసింహం, ఎం.వి పద్మావతి, అంధవరపు సూరిబాబు, పిఏసిఎస్ అధ్యక్షుడు నర్శింగరావు, మండవిల్లి రవి, శిమ్మ రాజశేఖర్, కామేశ్వరి, కోణార్కు శ్రీను, పైడి మహేశ్వరరావు పాల్గొన్నారు.

ఛలో విజయవాడ జయప్రదం చేయండి
* విఆర్‌ఏల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అప్పలస్వామి
శ్రీకాకుళం(రూరల్), మార్చి 16: గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాల పెంపుదల కోసం ఈనెల 24వతేదీన నిర్వహించనున్న ఛలో విజయవాడ జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యజ్జల అప్పలస్వామి కోరారు. సిటు కార్యాలయంలో గురువారం ఛలో విజయవాడ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గత ఎన్నికల ముందే దేశం పార్టీ అధికారంలోకి వస్తే విఆర్‌ఏలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.15వేలు ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న ఇచ్చిన హామీ ఊసే లేదన్నారు. ఇప్పటికే అనేక సార్లు విఆర్‌ఏ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కరించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తుందన్నారు. ఇటీవల తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ పనిచేస్తున్న సుమారు 20వేల మంది విఆర్ ఏలకు రూ.10,500 వేతనం ఇంక్రిమెంట్ రూ.200పెంచిందన్నారు. తెలంగాణా రాష్ట్రప్రభుత్వం అనుసరించిన పద్ధతినే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో వి.శ్రీనివాసరావు, పాపారావు, జె.గవరయ్య, పి.సురేష్, నీలయ్య పాల్గొన్నారు.

రాష్ట్భ్రావృద్ధికై ప్యాకేజీకి చట్టబద్దత
* బిజెపి రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాలం
శ్రీకాకుళం(రూరల్), మార్చి 16: ఆంధ్రుల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్భ్రావృద్ధే ధ్యేయంగా హామీలకు అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని బిజెపి రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం స్పష్టంచేశారు. తన నివాస గృహంలో గురువారం సాయంత్రం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నూటికి నూరుశాతం కేంద్రం భరిస్తుందని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఒక్కో జిల్లాకు రూ.50కోట్లు చొప్పున కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్భ్రావృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని రెవిన్యూ లోటు పూడ్చటం కూడా తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిన విధంగా ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత కూడా అప్పగించారన్నారు. ఇది రాష్ట్రం పట్ల బిజెపికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఏ.పి ప్రాజెక్టులకు నాబార్డు ద్వారా రుణాలు ఇప్పిస్తూ దానికి కేంద్రం హామీ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా రూ.350 కోట్లు నిధులు మంజూరు చేశారని, దీనిని అమృతా పథకంతోపాటు మిగిలిన పథకాలకు వినియోగించుకొని జిల్లాను మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. విలేఖర్ల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శవ్వాన వెంకటేశ్వరరావు, పండి యోగేశ్వరరావు ఉన్నారు.