శ్రీకాకుళం

ఎస్పీ గ్రీవెన్స్‌కు 9 వినతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), మార్చి 20: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు 9వినతులు వచ్చాయి. వాటిలో కుటుంబ తగాదాలకు చెందినవి 1, సివిల్ తగాదాలకు చెందినవి 2, పాత కేసులకు చెందినవి 3, ఇతర కారణాలకు చెందినవి 3 వినతులు వచ్చాయి. వీటి పరిష్కారానికి డిఎస్పీలు, సిఐలకు సూచనలు జారీ చేశారు. అలాగే ఓఎస్‌డి కె.తిరుమలరావు ఆధ్వర్యంలో ఫ్యామిలీ కౌనె్సలింగ్ నిర్వహించారు. ఈకార్యక్రమానికి 12 అర్జీలు రాగా, వాటిలో 8 అర్జీలకు రాజీ కుదిర్చారు. మిగిలిన నాలుగు పెండింగ్‌లో ఉన్నాయి. కార్యక్రమంలో ఉమెన్ పిఎస్‌ఎస్‌ఐ వాణిశ్రీ, రిటైర్డ్ ఎస్‌ఐ రాజేశ్వరరావు, ఐసిడిఎస్ నుండి కె.నిర్మల, డి.విజయకుమారి, పి.వరప్రసాదరావు పాల్గొన్నారు.

కిడ్నీ వ్యాధితో వృద్ధురాలి మృతి
వజ్రపుకొత్తూరు, మార్చి 20: మండలంలో కిడ్నీ వ్యాధి మరణాలు పరంపర కొనసాగుతుంది. కిడ్నీ వ్యాధి బారినపడి అనేక మంది మృత్యువాత పడుతుండగా, మరికొందరు కిడ్నీ వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ఒంకులూరులో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ జోగి లక్ష్మమ్మ(60) సోమవారం మృతి చెందారు. గత 5 సంవత్సరాలుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతూ పలాసలోని ప్రైవేట్ ఆసుపత్రులు, విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటూ వచ్చారు. మృతురాలు భర్త ఈశ్వరరావు, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
సంతకవిటి, మార్చి 20: మండలంలోని ఎస్.రంగారాయపురం గ్రామానికి చెందిన పున్నాన సూర్యనారాయణ (20) అనే యువకుడు సోమవారం విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ స్తంభానికి ఉన్న విద్యుత్ తీగ తెగిపడి ఉండడం, గమనించని సూర్యనారాయణ దాన్ని తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. పొలానికి వెళ్లి తాటిమట్టల మోపు తలపై తీసుకొస్తుండగా విద్యుత్ స్తంభానికి ఉన్న సపోర్టు వైరు తగిలి పక్కనే తెగి ఉన్న వైరుపై కాలు పడడంతో ప్రమాదం జరిగినట్టు గ్రామస్థులు తెలిపారు. సమాచారం తెలిసి మృతిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని పిఎం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. సంతకవిటి ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.