శ్రీకాకుళం

‘గ్రీవెన్స్’ వినతుల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతశ్రీకాకుళం, మార్చి 20: గ్రీవెన్స్‌కు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఫిర్యాదుల విభాగానికి జిల్లా నలుమూలల నుండి వినతులు వచ్చాయి. సరుబుజ్జిలి మండలం యరగాం గ్రామానికి చెందిన సాకేటి చందన తాను హెచ్‌ఐవి భాదితురాలినని, తన భర్త మరణించినందున తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. ఆమదాలవలస మండలం దూసి గ్రామానికి చెందిన పి.అన్నపూర్ణ అభయహస్తం పింఛన్ పునరుద్ధరించాలని కోరారు. రణస్థలం మండలం పిన్నింటి రమణ వినతిపత్రం అందజేస్తూ తోటపల్లి కాలువలో తన భూమిని కోల్పోయానని, ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నానని, నాపై దయచూపాలని కోరారు. వికలాంగులకు ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ చెవిటి, మూగ వాళ్లు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. వంశధార ప్రాజెక్టు నిర్మాణంలో సహకరించిన నిర్వాసితులకు చెందాల్సిన మూడు సెంట్ల స్థలాన్ని తక్షణమే కేటాయించాలని హిరమండలం మండలం కోరాడ కాలనీ బాధితులు వినతిపత్రం అందించారు. గతంలో రెండు సెంట్లే ఇచ్చారని, మిగిలినది త్వరలో ఇస్తామని చెబుతూ ఏడాది గడుస్తున్నా కేటాయించకపోవడం శోచనీయమన్నారు. బొమ్మరిల్లు పేరుతో స్థాపించిన ఫైనాన్స్ కంపెనీ ద్వారా మోసపోయిన మమ్మల్సి ఆదుకోవాలని బాధితులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జెసి చక్రధరబాబు, జెసి-2 పి.రజనీకాంతారావు, గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు డాక్టర్ జి.సి కిషోర్‌కుమార్, జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకుడు కూర్మారావు, జెడ్పీ సిఇఓ నగేష్ పాల్గొన్నారు.