శ్రీకాకుళం

ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, మార్చి 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఉపాధి హామీ పథకం పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. గురువారం మండలంలోని రావాడపేట వద్ద ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో ఉపాధి వేతనదారులకు అదనపు వేతనాలను అందజేస్తారన్నారు. దీనికి సంబంధించి ఆయా వేతనదారులకు వారు చెల్లించే వేతనాలను కలిపి ఈ ఏడాది ఏప్రిల్ నుండి 30శాతం అధికంగా పెంచుతారని తెలిపారు. అలాగే అధికారులు వేసవికాలంలో వేతనదారులకు తప్పనిసరిగా నీడను కల్పించాలన్నారు. గతంలో ప్రత్యేకంగా టెంట్ల ఏర్పాటు జరిగేదని, ప్రస్తుతం తాటాకు స్థావరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతీ వేతనదారుడు మస్తర్‌ను ఎప్పటికప్పుడు శాఖకు నివేదించాలన్నారు. వేసవి కాలంలో ఉద యం 7గంటల నుండే పనులను ప్రారంభించాలన్నారు. ఆయన వెంట జిల్లా ఎ స్పీ జె.బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు.

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
జలుమూరు, మార్చి 23: మండలం చల్లవానిపేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం గురువారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల పరిశీలనలో భాగంగా పూర్తిగా భవనాలు లేకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. కనీస వౌలిక సదుపాయాలను కల్పించే దిశగా సిబ్బంది ఉండాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం కేంద్రాన్ని పరిశీలించి అక్కడ పాతబియ్యం ఉండటంవలన ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. చదువుకున్న పిల్లలకు ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటే ఇటువంటి ఆహారం పెట్టడమేమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రేషన్ డిపోను పరిశీలించి రికార్డులకు, సరుకులకు తేడా ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికంగా నిల్వలు ఉండటంతో డిపోను సీజ్ చేయాలని రెవిన్యూ సిబ్బందిని ఆదేశించారు. అవకతవకలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయనతోపాటు తహశీల్దార్ ప్రవల్లిక ప్రియ, ఎంపిడివో వాసుదేవరావు, పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు.