శ్రీకాకుళం

వేగులొచ్చారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: రాజకీయాలకే హైటెక్ హంగులు అమర్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ ఆదే అడుగుజాడల్లో తాజాగా గూఢచారి వ్యవస్థకు తెరలేపారు. ఆయన ముఖ్యస్నేహితుడు ఈ వ్యవస్థకు దిక్చూచి అయినా, దళపతి లోకేషే! దళపతిగా వ్యవహరించడంతో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, వారి కీలక కదలికలపై నిఘా, పార్టీ పరిస్థితిని అధ్యయనం చేయడంలో ఎటువంటి బాంధవ్యాలు అడ్డుపడే పరిస్థితులు ఉండకపోవచ్చు! రాజకీయ చైతన్యం కలిగిన శ్రీకాకుళం జిల్లాకు గూఢచారులు విచ్చేసినట్టు విశ్వసనీయ సమాచారం. వారు ఇచ్చే నివేదికలు ఆధారంగా కార్పొరేషన్ ఎన్నికలకు పచ్చజెండా ఊపాలా..వద్దా అన్నది నిర్ణయించబడుతుంది! అన్నీ రాజకీయ పార్టీల నుంచి ముందుగా కార్పొరేషన్ ఎన్నికల బలాన్ని అంచనాలు వేయిస్తున్నారు. కళింగకోమట్ల సామాజికవర్గానికి మేయర్‌గా బి.్ఫరం కేటాయిస్తే జరిగే అనుకూల, ప్రతికూల పరిస్థితులతోపాటు ప్రచారం ఊపందుకున్న మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కీర్తికాంక్షకు పార్టీ పెద్దలు సై చెబితే కలిగే అనర్థాలను అధ్యయనం చేసేందుకే ఈ గూఢచారి వ్యవస్థ మళ్లీ సిక్కోల్ కార్పొరేషన్‌కు చేరుకుంది. ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్ళు పూర్తికావడంతో పాలనపై ప్రజలకు కలిగిన విశ్వాసంతోపాటు పార్టీ నేతల ప్రజలతో మమేకమయ్యే విధానాలు, ప్రజాసమస్యలపై స్పందించే పద్ధతులు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు ఆచరిస్తున్న మార్గాలు ఇలా..పార్టీ, ప్రభుత్వం కోసం ఈ గూఢచారి వ్యవస్థ నివేదికలు తయారు చేయనున్నట్టు తెలిసింది. అంతకంటే ముఖ్యమైన అంశంగా మంత్రులు, ఎమ్మెల్యేలవల్ల పార్టీకి జరిగే నష్టం, వారి తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీ కార్యకర్తలు పడే ఆవేదన, పార్టీ బలోపేతానికి పనిచేసే పసుపుదండు ప్రతీఒక్కరితో పార్టీ పెద్దలు మెసిలే అంశాలపై అధ్యయనం చేయడమే ముఖ్యఉద్దేశ్యంగా గూఢచారులు సిక్కోల్ వచ్చారన్నది విశ్వసనీయ సమాచారం. వీరంతా రహస్యంగా అధ్యయనం చేసి, నివేదికలు పార్టీ దళపతి లోకేష్‌కు అందించడమే కర్తవ్యం!
ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని పరిశీలించాల్సినంతగా ఈ వ్యవస్థ పనిచేయడం లేదు. తెలుగుదేశం పార్టీ పట్ల మూడేళ్ల కాలంలో మంత్రి, ఎం.పి. విప్, ఎమ్మెల్యేలపై కార్యకర్తల్లో అసంతృప్తి కలిగినప్పటికీ, ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్నప్పటికీ, ఆ అసంతృప్తి - విశ్వాసం ప్రధాన ప్రతిపక్షమైన వైకాపాపట్ల పెరగలేదనే చెప్పాలి. వైకాపా బలాన్ని అంచనాలు వేసేందుకు ఈ గూఢచారి వ్యవస్థ నివేదికలపై శ్రద్ధ కనబరచడం లేదు, కాని - మిత్రపక్షమైన బిజెపి తాజా రాజకీయ పరిణామాలతో బలాన్ని పుంజుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల బలాన్ని అంచనాలు వేసేందుకు మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. పొత్తుల ప్రయోజనాలపై అధ్యయనం చేసేలా గూఢచారి వ్యవస్థ అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాలతోపాటు రానున్న శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి నేతలతో టిడిపి సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? టిడిపి - బిజెపిల మధ్య దూరం ఎంతవరకు ఉంది? రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తులు, 2019 ఎన్నికలకు బిజెపి స్వతహాగా పోటీ చేసేందుకు బలం పుంజుకునే అవకాశాలు ఉన్నాయా, లేదా? ఉంటే వాటికి కారకులు ఎవరు, దేశం పార్టీలో మంత్రి, ఎమ్మెల్యేల పనితీరే కారణమవుతాయా?అన్న అంశాలపై ముందస్తు అధ్యయనానికి లోకేష్ వేగులను పంపించారు.
ఇప్పటికే విజయవాడ, తిరుపతి అర్బన్ ప్రాంతాల్లో అధ్యయనం చేస్తున్న రెండు గూఢచారుల బృందాలతోపాటు మరో బృందం శ్రీకాకుళం జిల్లాకు చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లాలో రాజకీయ కుంపట్ల సెగ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తాకడంతో చాలా ముందుగా వేగులు వచ్చేశారన్న మాట కూడా వినిపిస్తోంది.
వివిధ జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు పని విధానాన్ని తెలుసుకునేందుకు రాజకీయాలకు అతీతంగా కొందరు సురక్షితులైన వారితో సమాచారం సేకరించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో రీసెర్చ్ అండ్ అనాలిససి వింగ్(రా) స్థాయిలో ఒక విభాగాన్ని పార్టీ దళపతి లోకేష్ ఏర్పాటు చేశారు. దీనికి ఐ.ఎ.ఎస్. అధికారి శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో 18 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిల్లో 48 మంది ఉన్నత విద్యావంతులను ఎంపిక చేసి వారికి మూడు నెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం వీరు ఇప్పటికే రెండు ప్రాంతాల్లో పలు పార్లమెంటు నియోజకవర్గాలకు చేరుకున్నట్టు తెలిసింది. శ్రీకాకుళం ఎం.పి. నియోజకవర్గంలో పార్టీ గూఢచారి సంచరిస్తున్నట్టు ఆలస్యంగా తెలిసింది. ఇదిలా ఉండగా, శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల అంటూ వస్తున్న పుకారులతో ప్రభుత్వం ఏకీభవించడం లేదని చెప్పేందుకు ఓటర్లు, సామాజిక రిజర్వేషన్ల తుది జాబితాను ఏప్రిల్ నెలాఖరు వరకూ సమయాన్ని పెంచుతూ రెండురోజుల క్రితం సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిబట్టి కార్పొరేషన్ ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేసేలా కనిపిస్తోంది. మే, జూన్ మాసాల్లో ఎన్నికలకు భారతదేశంలో అత్యున్నతమైన ప్రజాస్వామ్యబద్ధమైన రాష్టప్రతి ఎన్నిక ప్రక్రియ అడ్డుతగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం దివంగత నేత భూమా నాగిరెడ్డి సిగ్మెంట్ బైఎలక్షన్, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక, ఇలా..ఎన్నికలు వరుసగా ఉండడంతో ఆ కోడ్ శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలను మోకాలడ్డుతాయన్న భావన ఇక్కడ రాజకీయ విశే్లషకులు వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు వచ్చిన వేగులంతా - కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠం కళింగకోమట్లకే దక్కాలన్న అధ్యయన నివేదికలు, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే సాహసం సర్కార్‌కు అందించలేక పోతుందేమోనన్న అంశం కూడా లోకేష్ పరిశీలనకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇలా..తెలుగుదేశం పార్టీ రా నివేదిక 2019 ఎన్నికల్లో బిజెపితో పొత్తు లేకుండా పోయే పరిస్థితులతోపాటు మంత్రి, ఎం.పి. ఎమ్మెల్యేల తీరుతెన్నులు, పాలనావిధానాలు, కార్యకర్తలపట్ల వ్యవహరించే పద్ధతులు నివేదికల్లో ఉంది!!

ఎగువ రుగడలో గజరాజులు
హిరమండలం, మార్చి 23: మండలంలోని రుగడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎగువ రుగడ గిరిజన గ్రామంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. దీంతో గురువారం గిరిజనులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామ సమీపంలో ఏనుగులు సంచరించడంతో గిరిజనులు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పలు పంటలు, తోటలను నాశనం చేయడంతో పాటు గ్రామంలోకి చొరబడతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పంటలు నాశనం చేయడంతోపాటు ఓ వ్యక్తిని చంపి వేయడంతో ఈ ప్రాంతవాసులు భయపడుతున్నారు.