శ్రీకాకుళం

వసతిగృహాల విద్యార్థులను రెసిడెన్సియల్ పాఠశాలల్లో చేర్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 24: వసతి గృహాల్లోగల విద్యార్థులను వచ్చే విద్యా సంవత్సరంలో రెసిడెన్సియల్ పాఠశాలల్లోకి చేర్పించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి వసతిగృహాల నిర్వహణపై శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో కలెక్ఱర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన వసతిగృహాలు అన్నింటిని మార్పు చేసి ఆశ్రమ పాఠశాలలుగా మార్చారన్నారు. అదే తరహాలో ఎస్సీ, ఎస్టీ, బిసి వసతిగృహాలను రెసిడెన్సియల్ పాఠశాలలుగా మార్పు చేయాలని, అందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను సమగ్రంగా రూపొందించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి కార్యరూపం దాల్చాలన్నారు. వసతిగృహాల్లోని చిన్నారులను రెసిడెన్సియల్ పాఠశాలల్లోకి మారుస్తామని చెప్పారు. రెడిడెన్సియల్ పాఠశాలగా మార్చే వసతిగృహంలో సౌకర్యాలు పరిశీలించాలన్నారు. వజ్రపుకొత్తూరు, అంపోలులో బిసి వసతిగృహాలు ప్రారంభం కానున్నాయని, ఒక్కో వసతిగృహంలో 960 మంది విద్యార్థుల సామర్థ్యం ఉంటుందన్నారు. దాదాపుగా 15 నుండి 20 బిసి వసతిగృహాల విద్యార్థులను అందులో చేర్పించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు కె. ఎస్.్ధనుంజయరావు, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు రోజారాణి, బిసి సంక్షేమ అధికారి ఎఎస్ ప్రకాశరావు, డిఎస్‌డబ్ల్యూ ఓ పట్నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వహఖ ఇంజినీరు అశోక్‌కుమార్, ఏపిఎస్‌డబ్ల్యూఐ డిసి కార్యనిర్వాహక ఇంజినీరు ఎం.జగ్గారావు పాల్గొన్నారు.