శ్రీకాకుళం

బ్యాంకులు విస్తృత సేవలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), మార్చి 24: బ్యాంకులు విస్తృతమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. శుక్రవారం స్థానిక కృష్ణాపార్కు దగ్గరలో కెనరాబ్యాంకు శాఖను ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లాలో ఇది 11వశాఖ అని, పట్టణంలో రెండవది కావడం సంతోషదాయకమన్నారు. ఎస్సీ. ఎస్టీ, బిసిలకు స్వయంశక్తి సంఘాలకు రుణాలు అందించి విశేష సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు ప్రారంభించి కెనరాబ్యాంకు వ్యవస్థాపకుడు సుబ్బారావ్‌పాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి డిజిఎం ఎస్ శ్రీనివాసరావు, డి పి ఎం చంద్రశేఖర్, బ్రాంచ్ మేనేజర్ ఎల్.ప్రసన్నకుమార్, ఎల్ డి ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.