శ్రీకాకుళం

పెద్దనోట్ల రద్దుతో కొనసాగుతున్న తిప్పలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), మార్చి 25: ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఇటీవల జరిగిన 5రాష్ట్రాల ఎన్నికల పట్ల దేశ ప్రజలు ఆమోదం తెలియజేశారని గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ ఇప్పటికీ బ్యాంకుల్లో, ఏటిఎంల వద్ద తిప్పలు తప్పడంలేదని మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద పేర్కొన్నారు. శనివారం ఇందిర విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన పెద్దనోట్ల రద్దు- అనంతర పరిణామాలు- సామాన్య ప్రజల ఇక్కట్లపై ఆమె మాట్లాడుతూ ప్రజల సహనాన్ని ఆమోదంగా భావించడం సరికాదన్నారు. సహనం కోల్పోయిన ప్రజలు తిరగబడకముందే తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, డోల జగన్మోహనరావు, కిల్లి రామ్మోహనరావు, చౌదరి సతీస్, రత్నాల నర్శింహమూర్తి, ఎంఏ భేగ్, కొంక్యాన మురళీ, గోవింద మల్లిబాబు, సనపల అన్నాజీ, బాణ్న రాము, నంబాళ్ల రాజశేఖర్, డిఎస్‌కె ప్రసాద్, పైడి రవి, కె రాజ్యలక్ష్మీ, అల్లిబిల్లి రాధ, వైశ్యరాజు మోహన్, మామిడి రాంబాబు, నీలాపు జ్యోతిప్రసాదరావు రాము, మురళీ, సూర్యనారాయణ, భాస్కర్, సురేష్, జగదీస్, తిరుమల పాల్గొన్నారు.
టిడిపి పాలనలో జిల్లా వెనుకంజ
* వైకాపా నేతల ఆరోపణ
శ్రీకాకుళం(రూరల్), మార్చి 25: తెలుగుదేశం పాలనలో జిల్లా మరింత వెనుకబడిందని వైకాపా నేతలు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాపై లక్షకోట్ల అప్పు్భరాన్ని మోపిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. జిల్లా వాసుల నెత్తినఅప్పు్భరాన్ని మోపారే తప్ప జిల్లాకు కేటాయించిన నిధులు మాత్రం శూన్యమన్నారు. గతంలో ధర్మాన ప్రసాదరావు మంత్రిగా జిల్లాను అభివృద్ధిపధంలో నడిపించారన్నారు. సమగ్ర కలెక్టరేట్ , టిటిడి కళ్యాణ మండపం, ఆడిటోరియం పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసి సిద్ధం చేసినా నేటికీ ఆ పనులు ప్రారంభానికి నోచుకోలేదన్నారు. గతంలో కళింగరోడ్, జి.టి రోడ్, చినబజారు రోడ్, పి ఎస్ ఎన్ ఎం స్కూల్ రోడ్, 80 అడుగుల రోడ్, నిరంతర మంచినీటి పథకం, పట్టణప్రజలకు అనుకూలంగా తీర్చిదిద్దారన్నారు. పట్టణంలో ఉన్న డంపింగ్‌యార్డు పట్టణానికి దూరంగా తరలించడం జరిగిందని టిడిపి అధికారంలోనికి వచ్చి మూడేళ్లు పూర్తయినా పట్టణంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఇది ప్రజల దురదృష్టకరమన్నారు. కోడి రామ్మూర్తి స్టేడియం పట్టణానికి,జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఉందని గత మూడేళ్లుగా దీనిని అభివృద్ధి చేస్తామని చెప్పి మర్చిపోయారన్నారు. ఆరు నెలల క్రితంస్టేడియంను కూల్చివేసి క్రీడాకారులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించారన్నారు. స్టేడియం పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో బాధ్యులైన మంత్రి, ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. స్టేడియం నిర్మాణంనిర్లక్ష్యంపై నిరసనగా వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మానప్రసాదరావు సోమవారం ఉదయం 6గంటలకు డే అండ్ నైట్ జంక్షన్ నుండి క్రీడాకారులు, స్థానిక ప్రజలతో బయలుదేరి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ అందవరపు వరహానృసింహం, ఎం.వి పద్మావతి, ఎన్ని ధనుంజయ, సాదు వైకుంఠరావు, మండవిల్లి రవి, కోణార్కు శ్రీను, కామేశ్వరి పాల్గొన్నారు.