శ్రీకాకుళం

కార్పొరేషన్‌లో రాజకీయ ‘క్రీడ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఎంకి పెళ్ళి - సుబ్బి చావుకు వచ్చిందన్న సామెత తెలిసిందే! కాని - గత నెల 18న లక్ష్మీశ్రీనివాసకల్యాణమండపంలో జరిగిన ఒక వివాహ వేదిక గుండ ‘మేయర్’కుర్చీకి ధర్మాన గురిపెట్టేలా చేసింది!! అప్పటివరకూ మనసుపెట్టని వైకాపా రాష్ట్ర కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం కార్పొరేషన్ మేయర్‌గా గుండ తప్ప ఎవరినైనా కూర్చోబెడితే సహిస్తానుగాని, మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణను మాత్రం ఆ కూర్చీ దరిదాపులకు వెళ్లకుండా చేయడానికి మదిలో బలమైన పగ పెరిగిపోయినట్టు ఉంది. దీనంతటికీ, ధర్మాన దళంలో ‘గోడమీదపిల్లి’ చేసిన గలాట..బావ, బావమర్దుల మధ్య కోపాన్ని తెప్పించింది. దాని ఫలితమే ఆదివారం నుంచి కార్పొరేషన్‌లో...ప్రారంభమవుతున్న రాజకీయ‘క్రీడ’. చంకలో బిడ్డనుంచుకుని ఊరంతా వెదికిందట వెనకటికో ఇల్లాలు. మనమూ అంతే కట్టెదుట ఎదురులేని జగజ్జెట్టిని పెట్టుకుని - వచ్చిరాని కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పరువు నిలిపేదెవరా? అంటూ నగర పార్టీ నేతలంతా గాలిస్తున్నారు. ఎవరంటారా..గురిచూసి కొట్టడంలో అర్జునుడినే మట్టి కరిపించగల వ్యూహాత్మకమైన నేత ధర్మాన. ఎత్తులుపైఎత్తులు..చిత్తులు కాదు - ఆత్మాభిమానంతో అస్త్రాలు సంధించేందుకు సిద్ధపడడం అనర్థానికి అడుగులు వేయడమే. జిల్లాలో గత మూడేళ్లుగా టిడిపి ప్రభుత్వం హిట్లర్ రాజకీయాలు చేస్తున్నా, జిల్లాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన వంశధార ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు, అవినీతిపై నిర్వాసితుల ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడినా, రైతాంగం రక్తాన్ని పీల్చేస్తున్న పొరుగు రాష్ట్రం ధాన్యం కొనుగోలు అవస్థలపై ప్రశ్నించే ప్రయత్నమే లేకున్నా - ఇలాంటి అత్యవసరమైన ప్రజాసమస్యలపై పోరాటానికి సిద్ధం కాని ధర్మాన శ్రీకాకుళం నగరంలో స్టేడియం కూల్చేసి, నిర్మాణం చేపట్టలేదన్న అంశాన్ని తీసుకుని రగడకు సిద్ధం అవుతుంటే - దానివెనుక గుండను మేయర్ కుర్చీ దరిపాపులకు వెళ్లకుండా ఆపేయాలన్న వ్యూహామే తప్ప మరేది లేదన్నదే ఆయన మదిలోదాగివున్న మహాఅస్త్రం. దీంతోనే కాకుండా మరో నాలుగు అంశాలతో కేవలం నగరాన్ని పాలించేందుకు గుండ కుటుంబం అనర్హులన్న విషయాన్ని పథకం ప్రకారం ధర్మాన రచించిన వ్యూహానికి స్టేడియం నిర్మాణంపై చేసే రాజకీయ‘క్రీడ’ తొలి అడుగు. నిన్నటి వరకూ శ్రీకాకుళం జిల్లా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వల్ల నిర్లక్ష్యానికి గురైందంటూ ప్రెస్‌మీట్లు, సభలు, సమావేశాల్లో గళం వినిపించిన ధర్మాన ఆదివారం నుంచి ‘ఈ నగరానికి ఏమైంది’ మూడేళ్లలో 1.18 కోట్ల రూపాయల రుణాలు తీసుకొచ్చిన టిడీపీ సర్కార్ జిల్లా వాటా ఎంత, అందులో ఈ నగరానికి ఇచ్చిందెంత? అన్న నిధుల గణాంకాలు కార్పొరేషన్ ఓటర్లకు చెప్పేందుకు కూడికలు, తీసివేతలు, గుణకారాలు సిద్ధం చేశారు. నగరంపై ప్రభుత్వానికి గల నిర్లక్ష్యం ఎంత మోతాదులో ఉంది, దానికి బాధ్యులైన స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఆయన భర్త అప్పలసూర్యనారాయణ మేయర్‌గా బరిలో ఉండేందుకు ఎంతవరకూ అర్హత కలిగినవారంటూ కార్పొరేషన్ ఓటర్లను ప్రశ్నించేందుకు ముందుగా ఉర్రుతలూగే క్రీడాకారుల నుంచి ఆరంభించేందుకు ధర్మాన సంసిద్ధమవుతున్నారు. ఆర్థికాభివృద్ధిలో, తలసరి ఆదాయంలో, జీవనప్రమాణాల మెరుగదలలో వెనుకబడిన జిల్లా పట్ల రానున్న రోజుల్లో ధర్మాన ప్రశ్నించే రీవాజును మార్చుకుని, శ్రీకాకుళం కార్పొరేషన్‌లో జరిగిన అభివృద్ధి, అందుకు కావల్సిన నిధులు, రావల్సిన ఉత్తర్వులు, కుప్పకూల్చిన కోడిరామ్మూర్తి క్రీడామైదానం నిర్మాణానికి ఆరునెలల తర్వాత ఉత్తర్వులు ఇచ్చి, టెండర్లు పిలవకుండా ఇంకా జాప్యం చేస్తున్న పరిస్థితులతో ఆరంభించిన గుండపై యుద్ధం వెనుక ఇక్కడ లక్ష్మీశ్రీనివాస కల్యాణ మండపంలో గుండ - ధర్మానల మధ్య జరిగిన వాగ్వివాదమే ప్రధాన కారణమంటూ రాజకీయ విశే్లషకులు చెప్పకనే చెబుతున్నారు. కేవలం వౌనం దాటిన మాట వెనుక గల ఆగ్రహం, ఆవేశమే ధర్మాన - గుండల మధ్య కార్పొరేషన్ రగడకు దారితీసిందని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఏదిఏమైనప్పటికీ ‘గోడమీదపిల్లి’ తెచ్చిపెట్టిన గోరంత గొడవ..కొండంత కయ్యంగా మార్చేసింది. దీని ప్రభావమే - కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణాన్ని ఒక అంశంగా తీసుకుని కార్పొరేషన్ ఎన్నికలపై క్రీడాకారులను ఉసుగొల్పే ధర్మాన వ్యూహం! దీనికి కింజరాపు సైన్యం స్లీపింగ్ పార్టనర్‌గా చేరుతుందో..లేదో చూడాలి మరి!?

ప్రజలను మభ్యపెడుతున్న సిఎం
మరో రెండేళ్లు మాత్రమే ప్రజలను మోసగించగలరు
వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

శ్రీకాకుళం, మార్చి 25: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతూనే పాలన సాగిస్తున్నారని మరో రెండేళ్లు మాత్రమే ప్రజలను మోసగిస్తారని పార్లమెంట్ సభ్యుడు, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యలు చేపట్టరాదని పేర్కొన్నారు. ప్రజలచే ఎన్నుకొనబడినవారు ఏ స్థానంలో ఉన్నా ఆ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందన్నారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలే తప్ప ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉండకూడదన్నారు. రాష్ట్రంలో కరవు విళయతాండవం చేస్తుంటే టిడిపి నేతలు 12శాతం అభివృద్ధి సాధించామంటూ గొప్పలు చెప్పుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రతీ విషయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో రాజీ పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో వెకాపాకు క్షేత్రస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత పటిష్టంచేస్తామన్నారు. జులై 8 ప్లీనరీ అనంతరం సభ్యత్వ నమోదు చేపడతామన్నారు. ప్రత్యేక హోదా వచ్చేవరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. టిడిపి ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపిటీసీలు, జెడ్పిటీసీలను డబ్బుకు ప్రలోభ పెట్టి గెలిపించుకున్నారన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్‌లో 12.45లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు అయిందన్నారు. జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి మాట్లాడుతూ గత (మిగతా 2వ పేజీలో) మూడేళ్లుగా విరామం లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. జిల్లాలో కమిటీలు ఎంతబలంగా ఉన్నాయో తెలుసుకునేందుకే విజయసాయిరెడ్డి వచ్చారని ఆమె స్పష్టంచేశారు. విలేఖర్ల సమావేశంలో సాగి దుర్గాప్రసాదరాజు, రాష్ట్ర బిసి సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, హైపవర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం, రాష్ట్ర ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షుడు నాగార్జున , పేరాడ తిలక్ పాల్గొన్నారు. మీడియాకు సమన్వయ కర్తగా అందవరపు సూరిబాబు వ్యవహరించారు.

నగర ఎన్నికలపై నాటకాలొద్దు
కమిషనర్‌ను కలిసిన కాంగ్రెస్ బృందం
శ్రీకాకుళం(రూరల్), మార్చి 25: రాష్ట్ర ప్రభుత్వ శ్రీకాకుళం నగర ప్రజల ఎన్నికల కోసం వింతనాటకాలు ఆడుతూ , అధికారులతో ఆడిస్తూ నగర ప్రజలను, రాజకీయ పక్షాలను ఊరిస్తూ చోద్యం చూస్తోందని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ చౌదరి సతీస్, నగర పార్టీ అధ్యక్షుడు పుట్టా అంజనీకుమార్ అధ్యక్షతన జరిగిన నగరపార్టీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు డోల జగన్ మాట్లాడుతూ ఓటర్ల లిస్టులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల గుర్తింపులో పోలింగ్‌బూత్‌ల కేటాయింపులో, డోర్ నెంబర్లలో అన్నింటా అస్తవ్యస్తంగా తప్పుల తడకలు ఉన్నాయని పేర్కొన్నారు. సరిదిద్దుకుంటారని వేచిచూసిన ఈ తతంగమంతా కావాలని చేసి అనంతరం అన్యాయానికి గురైనవారు న్యాయస్థానాలను ఆశ్రయించి ఎన్నికల వాయిదా పడటానికి చేస్తున్న ప్రభుత్వ పన్నాగమన్నారు. అనంతరం పిసిసి అధికార ప్రతినిధి రత్నాల నర్శింహమూర్తి ఆధ్వర్యంలో కమిషనర్ పి ఏ శోభను కలిసి ఓటర్ల జాబితా, డివిజన్ల విభజనలో ఓటర్ల సంఖ్యలో సమతుల్యత లోపించడంపై వివరించారు. ఈనెల 22న కమిషనర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సాయంత్రం 4గంటలకు అని కాంగ్రెస్ పార్టీకి లిఖితపూర్వకసమాచారం ఇచ్చి ఉదయం 11గంటలకు నిర్వహించడంపట్ల తీవ్ర నిరసన తెలియజేశారు. నగరంలో సత్వరమే డోర్‌నెంబర్లను శాస్ర్తియపద్ధతిలో చేపట్టాలని కోరారు. ఈ ప్రతినిధి బృందంలో పార్టీ నాయకులు కిల్లి రామ్మోహనరావు, మాజీ ఎమ్మెల్సీ మజ్జిశారద, చౌదరి సతీష్, పుట్టా అంజిబాబు, బాణ్నరాము, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.