శ్రీకాకుళం

మహాపుష్కరస్నానంలో లక్షలాది మంది భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతపట్నం, మార్చి 26: ఆంధ్రా-ఒడిశ్సా సరిహద్దు మధ్య ప్రవహిస్తున్న మహేంద్రతనయ నది మహాపుష్కరంలో ఆదివారం లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గత 98 ఏళ్లు తరువాత చైత్రకృష్ణత్రయోదశి రావడంతో ఆదివారం పుష్కర స్నానాలకు ప్రభుత్వంతోపాటు వందలాది మంది స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేశారు. ఈ మహేంద్రతనయ నదిలో దక్షిణం నుంచి ఉత్తరంవైపు నది తిరిగి ప్రయాణమే పుష్కరమని పూర్వీకులు నిర్ణయించారు. నదీ సమీపంలో సంగుడి, కరాలి, కెరండి, పాతపట్నం నదీ పరీవాహక ప్రాంతం వద్ద పుష్కర స్నానాలను ఏర్పాట్లు చేశారు. ఆంధ్రా-ఒడివ్సాకు చెందిన సుమారు 30 గ్రామాలకు పైగా ప్రజలు శనివారం రాత్రి నుంచే పుష్కర స్నానాలకు వచ్చి ఆదివారం వేకువజామునుండి స్నానాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా చంగుడి మతాధిపతి మహంత్ రామకృష్ణదాస్ మేళతాళాలతో వేకువ జామున 3:15 గంటలకు నదికి హారతిలిచ్చి మొదట పుష్కర స్నానం చేసి ప్రారంభించారు.
అనంతరం భక్తులు ఆదివారం సాయంత్రం వరకు ఎండను సైతం లెక్కచేయకుండా స్నానాది కార్యక్రమాలను ఆచరించారు. సరాలి, చంగుడికి చెందిన కొందరు భక్తులకు ఉచిత అన్నసంతర్పణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అంతగా స్పందించకపోయినా స్వచ్ఛంద సంస్థలు పుష్కరాలకు సేవలందించారు. విద్యుత్ దీపాలు అమర్చి భక్తులకు స్నానాలకు వీలుకల్పించారు. పాతపట్నం మామిడి రేవు వద్ద పుష్కరఘాట్ ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా ఒడిశా నుండి, నరసన్నపేట, సారవకోట, జలుమూరు, నందిగాం, ఇచ్ఛాపురం ప్రాంతాలనుండి ముందుగా భక్తులు వచ్చి పుష్కర స్నానం ఆచరించారు. ఇది అప్పగి గజపతిమహారాజు కృష్ణచంద్ర మహాగజపతి పుష్కర స్నానాలు ప్రారంభించినట్లు స్థానికులు తెలిపారు.