శ్రీకాకుళం

1478 ఎకరాల డి-పట్టా భూములకు లైన్‌క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 26: అణువిద్యుత్ పార్కుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అణుపార్కు ఏర్పాటుకు 2500 ఎకరాల భూమి అవసరమని ఇదివరకే గుర్తించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొవ్వాడ, చినకొవ్వాడ, రామచంద్రాపురం, గూడెం ప్రాంతాల్లో బృందాలు సర్వే నిర్వహించాయి. ఇందుకు ప్రభుత్వం ఎకరా జిరాయితీ, డి-పట్టా భూములకు రూ.13లక్షలు ఇవ్వనున్నట్లు గ్రామ సభల్లో ప్రకటించింది. అయితే మత్స్యకారులు, రైతులు ఆ ప్యాకేజీ పట్ల అసంతృప్తి చెందిన విషయం తెలిసిందే. భోగాపురం ఎయిర్‌పోర్టు తరహాలో తమకు నష్టపరిహారం ఇవ్వాలని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఇదే సమయంలో భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.500కోట్లు కలెక్టర్ ఖాతాకు కూడా జమచేసింది. అయితే నష్టపరిహార వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడం ఇంతవరకు పరిహారాన్ని రైతులకు అందజేయలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 1478 ఎకరాల్లో డి-పట్టాలకు సంబంధించి ఎకరానికి రూ.18లక్షలు ఇవ్వడానికి, అందులో ఆక్రమణదారులకు రూ.9లక్షల చొప్పున ఇవ్వడానికి నిర్ణయిస్తూ జీవో-1179ను విడుదల చేసింది. దీంతో పరిహారాన్ని రైతుల ఖాతాల్లో సోమవారం నుండి జమ చేయడానికి రెవెన్యూ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం జిరాయతీ భూముల విషయంలో పరిహారం ఎంత ఇస్తారన్నదీ ఇంకా కొలిక్కి రాలేదు. ప్రస్తుతం కలెక్టర్‌కు వచ్చిన నిధుల నుండి ఉన్నమేరకు పరిహారాన్ని రైతులకు ఇవ్వనున్నారు.