శ్రీకాకుళం

బిఎస్‌ఎన్‌ఎల్ ద్వారా స్పీడ్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, మార్చి 26: కేంద్ర ప్రభుత్వం బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బాండ్‌లను విస్తరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోందని డిజిఎం కె.జ్వాలాప్రసాద్ తెలిపారు. ఆదివారం స్థానిక బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయానికి విచ్చేసిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఓటిఎన్ సిస్టంను త్వరలోనే అమలు చేస్తున్నామని, దీనిద్వారా ఇంటర్నెట్ సౌకర్యాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొదటగా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేస్తున్నామని, దీనికి నెట్‌వర్క్‌ను విశాఖపట్నం నుండి భువనేశ్వర్‌కు విస్తరిస్తున్నామని చెప్పారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో వీటిని ఏర్పాట్లు చేస్తున్నామని, మరికొద్ది రోజుల్లోనే అవసరమైన ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. డిఇ కూర్మారావు, శంకరరరావుపాల్గొన్నారు.

ఉగాది పురస్కారాలు ప్రదానం
శ్రీకాకుళం(రూరల్),మార్చి 26: జూ నియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో స్థానిక గ్రాండ్ హోటల్‌లో హేవలంబ నామ సంవత్సర ఉగాది పురస్కారాల ప్రదానం ఆదివారం జరిగింది. గత 40 ఏళ్లుగా సం గీత ఉపాధ్యాయులుగా సేవలు అంది స్తూ ఎంతోమందిని సంగీత కళాకారులుగా తీర్చిదిద్దిన వరదా దుర్గారాజు చి న్నవయస్సులోనే చాలా వేదికలపై సం గీత ప్రదర్శనలిచ్చి ఎంతోమంది మన్ననలను అందుకున్న ఎంఏవి కృష్ణరాఘవన్‌ను, కొద్ది రోజుల క్రితం అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో శ్రీకాకుళం జిల్లా ను ండి విద్యార్థి విభాగం తరఫున ఉపన్యసించిన వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న పొట్నూరు జ్యోతిర్మయిని హేవలంబి నామ సంవత్సర ఉగాది పురస్కారంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం శాఖ అధ్యక్షులు భారతీరమేష్ మాట్లాడుతూ విభిన్న రంగాల్లో ఇంతవరకు గుర్తింపునకు నోచుకోని ప్రముఖులను సత్కరించుకోవడం తమకు ఆనందం కలిగిస్తుందని, సంస్థలో ఉంటూ ఉన్నవారిని గౌరవించుకోవడం అవసరమన్నారు. సభ్యుల సహకారమే ఇందుకు కారణమన్నారు. ఈ కార్యక్రమంలో జెసిస్ పూర్వపు అధ్యక్షులు శివప్రసాద్ కొత్తగా చేరిన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంజినీరింగ్ కళాశాల హెచ్‌ఓ డి.లలిత ప్రియ, శ్రీకాకుళం శాఖ కార్యదర్శి వారణాశి సందీప్, కోశాధికారి తం గుడు రవి, వ్యవస్థాపక అధ్యక్షులు జామి భీమశంకరరావు, కోరాడ రమేష్, అంధవరపు సూరిబాబు, మధుబాబు, అనంత్, సింహాద్రి వేణు, చక్రవర్తి, మోహన్, ఎల్‌విరమణ పాల్గొన్నారు.