శ్రీకాకుళం

సిక్కోల్ కిక్కు. సూపర్ - డూపర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 30: నారు పోసిన వాడు నీరు పోయకపోడు. బీరు పోసినవాడు దారిచూపకపోడు (రాష్ట్ర హైవే నిబంధనపై అధికారులు భరోసా). వీధివీధినా దుకాణం తెరిచి మందు అమ్మే ప్రభుత్వానికి సదరు మందును సేవించేందుకు తగిన వసతిని చూపించవల్సిన పవిత్ర బాధ్యతను కూడా జిల్లా అబ్కారీ అధికారులు తమ భుజస్కందాలపై వేసుకోవడంతో సిక్కోల్‌కు ఈసారి మద్యం పాలసీ కఠినమైనప్పటికీ కిక్ మాత్రం సూపర్ - డూపర్! జిల్లా అంతటా 239 మద్యం దుకాణాల కోసం అబ్కారీశాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే 48 గంటల వ్యవధిలో 5323 దరఖాస్తులు గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి మద్యం వ్యాపారుల నుంచి దాఖలయ్యాయి. వీటి ద్వారా రూ. 32.19 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు శ్రీకాకుళం జిల్లా వాటాగా జమఅయింది. గత ఏడాదితో పోల్చి చూస్తే 90 శాతం ఆదాయం పెరిగింది. వెయ్యి మంది కొత్తముఖాలు వైన్ ట్రేడ్‌కు వచ్చారు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే - కలెక్టర్‌సారూ మద్యపానం నిషేధించండి..అంటూ ప్రతి సమావేశంలో, గ్రామాల్లో చెబుతుంటే పాఠశాలల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇక్కడ ఎం.హెచ్.స్కూల్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు వైఎస్సార్ కళ్యాణమండపంలో దరఖాస్తులు చేసుకుంటూ ‘ఆంధ్రభూమి’ దృష్టిలో పడ్డారు. భావితరాలకు మంచి ప్రవర్తన కలిగిన పౌరులు అందించాల్సిన గురువులు నిన్నటివరకూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలతోపాటు పోస్టల్, ఇన్స్యూరెన్స్ ఏజెంట్లుగా పనిచేస్తూ కనిపిస్తుండగా, ఇప్పుడు నేరుగా మద్యం దుకాణాలకే దరఖాస్తులతో క్యూకట్టడం చర్చనీయాంశం అయింది.
ప్రతిసారి ఎక్సైజ్ పాలసీలో భాగస్వామ్యం అయ్యే రౌడీషీటర్లు షరామామూలుగానే సిండికేట్‌గా దరఖాస్తులు చేసుకున్నారు. జె.పి. గ్రూప్ చీలికలో మజ్జి సురేష్ తదితరులతో నగరంలోగల కొంతమంది రౌడీషీటర్లు దరఖాస్తులు భాగస్వామ్యులుగా చేరి దాఖలుచేశారు. వైన్ సిండికేట్ ప్రతినిధి మేకా శ్రీనివాసరావు మాత్రం కేవలం పదుల సంఖ్యలోనే దరఖాస్తులు వేయడంతో రణస్థలం ప్రాంతానికి చెందిన తెలుగుదేశంపార్టీ నేత ఎన్.ఇ.ఆర్, లంక శ్యామ్ పోటాపోటీగా వందలాది దరఖాస్తులు దాఖలు చేసినట్లు సమాచారం. శ్రీకాకుళం నగరంలో 39 మద్యం దుకాణాలకు, 1018 దరఖాస్తులు దాఖలు కావడంతో జిల్లా అంతటా అత్యంత ఎక్కువ దరఖాస్తులు శ్రీకాకుళం నగరపాలకసంస్థ దుకాణాలకే అందినట్టు అబ్కారీశాఖ అధికారులు సుస్పష్టం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, అబ్కారీశాఖ సూపరింటెండెంట్ జి.నాగేశ్వరరావు ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత కూడా సకాలంలో అందిన దరఖాస్తులు పరిశీలన చేస్తామని, అందులో ఏమైన చిన్నపాటి తప్పిదాలు ఉంటే దరఖాస్తుదారునితో సవరణ చేయించే అవకాశం ఉందని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వైఎస్సార్ కళ్యాణమండపంలో దరఖాస్తులు డ్రా తీస్తామన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు సమక్షంలో ఈ ప్రక్రియ ముగిస్తుందన్నారు. గత ఏడాది కంటే వెయ్యికిపైగా దరఖాస్తులు ఎక్కువ దాఖలుకాగా, ఆదాయం వందశాతం వరకూ ఫీజుల రూపేణా ప్రభుత్వానికి వచ్చినట్టు చెప్పారు.

ముగిసిన పది పరీక్షలు
117 మంది గైర్హాజరు
శ్రీకాకుళం(రూరల్), మార్చి 30: ఈనెల 1వ్ర తేదీ నుండి ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు గురువారం 117మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంతవరకు జరిగిన పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు మాత్రమే డిబార్ అయ్యారు. ఇద్దరు విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతుండగా డిబార్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఐదు కేంద్రాల్లోస్టేట్ అబ్జర్వర్, మూడు కేంద్రాల్లో డిఇవో, 31 కేంద్రాల్లో ఫ్లైయింగ్ స్వ్కాడ్ పరీక్షల పనితీరును పరిశీలించారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి స్పాట్ ప్రారంభం కానుంది. స్పాట్ వ్యాల్యూషన్‌కు నగరంలో మూడు కేంద్రాల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.