శ్రీకాకుళం

రైతులకు పంట రుణాలు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 30: వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండటం, పంటల సాగుకు మదుపులు అధికం కావడంతో రైతులంతా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకునేలా పంట రుణాలు బ్యాంకర్లు అందివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్టస్థ్రాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశాన్ని వివిధ బ్యాంకు అధికారులు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ఉత్పాదకత పెంచడం ఏవిధంగా చేయాలన్న అంశాలపై చర్చించారు. వ్యవసాయరంగంలో ఖరీఫ్- రబీ పంటలు, సర్వీస్ సెక్టార్, మార్కెటింగ్ అంశాలలో లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2016-17 వార్షిక రుణ ప్రణాళికపై చర్చించారు. బ్యాంకర్లు రైతులకు అందిస్తున్న రుణాలపై చర్చిస్తూ రైతులు ఆర్థిక ఇబ్బందులు కారణంగా చెల్లింపులు చేయలేకపోతున్నారని, వారి ఆర్థిక స్థితిగతులు మెరుగు పరచాలన్నారు. వారికి ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఉచిత వైద్యాన్ని వారి పిల్లల చదువులకు స్కాలర్‌షిప్‌లను మంజూరుచేస్తూ టిడిపి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. రైతులు రుణాలను ఎందుకు చెల్లించలేక పోతున్నారనే విషయమై మూలాలను గుర్తించాలన్నారు. నగదురహిత లావాదేవీలను ముమ్మరం చేయాలని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఒక సబ్‌కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. బ్యాంకర్లు, ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనారిటీ వర్గాల వారికి రుణాలు అధికమొత్తంలో అందించి వారి లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఆంధ్రాబ్యాంకు జోనల్ మేనేజర్ రాధాకిషన్, ఎస్‌బిఐ రీజనల్ మేనేజర్ మేరీసగారియా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు జిసి కిషోర్‌కుమార్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు జి.రామారావు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి కెవి ఆదిత్యలక్ష్మీ, బిసి కార్పొరేషన్ ఇడి జి.రాజారావు, డిసిసిబి సిఇఓ సత్యనారాయణ, డిప్యూటీ ఎల్‌డిఎం ఎం సత్యనారాయణ, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

వసతులు కల్పించాం
ఇళ్లు నిర్మాణాలకు ముందుకు రండి
* జెసి చక్రధరబాబు
ఆమదాలవలస, మార్చి 30: హిరమండలం వంశధార రిజర్వాయర్ నిర్వాసితులకు ఇక్కడి గాజులకొల్లివలస వద్ద రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు విద్యుత్ వసతులు పూర్తిస్థాయిలో కల్పించామని, ఆయా నిర్వాసితులంతా ఇక్కడకు వచ్చి ఇళ్లు నిర్మించుకోవాలని జాయింట్ కలెక్టర్ చక్రధరబాబు పిలుపునిచ్చారు. గురువారం నిర్వాసితుల కాలనీని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1137 నిర్వాసితుల కుటుంబాలకు వారి కోరిక మేరకు ఇక్కడ స్థలాలు కేటాయించామని, వీటిలో 507మందికి పట్టాలు ఇచ్చామని, మిగిలిన వారికి పట్టాలు త్వరలోనే అందజేస్తామని జెసి తెలిపారు. నిర్వాసితుల కుటుంబాలు ఇక్కడ స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ప్రశాంతమైన జీవనాన్ని ప్రారంభించాలని కోరారు. ఆయనతోపాటు వంశధార అధికారులు, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.