శ్రీకాకుళం

కేబినెట్ విస్తరణ ఏప్రిల్ 2 ముహుర్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 30: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగతుందన్న సమాచారం అమరావతి నుంచి సిక్కోలుకు చేరుకోవడంతో ఇక్కడ నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఏప్రిల్ 2వతేదీ ఉదయం 9:26గంటలకు ముహూర్తం కూడా ఖరారైనట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలు తెలియవచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆశావహులు వారివారి మందీమార్బలానికి తీపి కబురు ఎప్పుడు చెబుతామా? అన్న ఆత్రుతలో ఉన్నారు. శివారుగా ఉన్న శ్రీకాకుళం జిల్లా నేతలకు మంత్రివర్గ విస్తరణలో సముచిత స్థానం లభిస్తుందని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చర్చించుకుంటున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న వారు సంఖ్య పెద్దదిగా ఉండటంతో ఆశావహులు ఒకింత ఉత్కంఠకు లోనవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ మార్పులు, చేర్పులపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా సామాజిక సమీకరణలు బేరీజు వేసుకొని కేబినెట్ కూర్పు ప్రక్రియను పూర్తి చేస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖాయమైంది. అలాగే కర్నూలు జిల్లా నుండి భూమా అఖిలప్రియకి కూడా మంత్రి పదవి వరించనుందని పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయన నందమూరి -నారా కుటుంబాలకు వారధిగా రాజకీయాలు నెరిపి అవినీతి రహితుడిగా పేరు సంపాదించిన విషయాన్ని ప్రామాణికంగా తీసుకొని కేబినెట్ బెర్త్ కేటాయించాలని సిఎం చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. విజయనగరం మంత్రిగా ఉన్న డాక్టర్ కిమిడి మృణాళినిని తప్పించి అక్కడ వైకాపా నుంచి టిడిపి తీర్థం పుచ్చుకున్న సుజయకృష్ణ రంగారావును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే ఫార్మూలా అమలైతే శ్రీకాకుళం నుంచి కళా వెంకటరావుకు మంత్రి పదవి దక్కడం ఖాయమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎటువంటి శాఖను కేటాయిస్తారో? అన్న చర్చ కూడా సాగుతుంది. దివంగత ఎన్టీఆర్ కేబినెట్‌లో హోమ్, మున్సిపాలిటీ, కమర్షియల్ ట్యాక్స్ వంటి శాఖలకు అమాత్యునిగా కళా పనిచేసిన విషయం తెలిసిందే. ఇటువంటి సీనియారిటీ ఉన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళాకు కీలకశాఖ అప్పగిస్తారన్న విశ్వాసం పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష కుర్చీని ఎవరికి అప్పగిస్తారన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో ఆరంభమైంది. ఇదిలా ఉండగా శాసనసభలో సిఎం చంద్రబాబు తరువాత విపక్షంపై మాటల యుద్ధంలో అత్యధిక మార్కులు సాధించుకొన్న కార్మిక శాఖామంత్రి అచ్చెన్నకు పదోన్నతి ఖాయమని తెలుస్తుంది. దివంగత కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడుపై బాబుకు ఉన్న మమకారం మంత్రి అచ్చెన్న పనితనాన్ని ప్రామాణికంగా తీసుకుని అత్యంత కీలకమైన ‘హోం’ శాఖను అప్పగించాలన్న యోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిన్నటి వరకు జిల్లాకు ఒకే మంత్రి పదవి కేటాయించి మూడేళ్ల పాటు కొనసాగించిన సిఎం చంద్రబాబు రెండో బెర్త్ కళాకు అప్పగించాలంటే ఇక్కడ సామాజిక సమీకరణాలు, గ్రూపుల మధ్య సమతుల్యత పాటించక తప్పదని సీనియర్లు సుస్పష్టం చేస్తున్నారు. అచ్చెన్న, కళాలను సంతృప్తి పర్చాలంటే ఒకరికి పదోన్నతి మరొకరికీ మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించడం తప్పదని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. మంత్రివర్గ కూర్పులో కూడా కింజరాపు, కిమిడి కుటుంబాలు ఎవరు పైచేయిగా నిలుస్తారో మరో 48 గంటలు ఆగాల్సిందే.