శ్రీకాకుళం

వ్యాధి నిరోధ సమాజాన్ని నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 4: నూతన వ్యాధులు రాకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలపైన ఉందని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. జిల్లా ఔషధ నియంత్రణ, ఆంధ్రప్రదేశ్ ఫార్మశీ కౌన్సిల్, జిల్లా కెమిస్టు అండ్ డ్రగ్గిస్టు అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన వ్యాధి కారక క్రిములు నిరోధక అవగాహన పాదయాత్రను స్థానిక ఏడురోడ్ల కూడలి వద్ద కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్‌ను కనుగొన్న తరువాత సకల వ్యాధులకు పెన్సిలిన్ విస్తారంగా వాడటం మొదలుపెట్టినట్టు తెలిపారు. అప్పటిలో మందులు తయారుచేసే ఫ్యాక్టరీలు లేవని, మేట్ కట్టర్ ద్వారా పెన్సిల్ తయారుచేశారని తెలిపారు. నేడు వైద్యుల సలహాలు లేకుండా ప్రజలు నేరుగా మందుల షాపులో యాంటీబయోటిక్ కొని వాడుతున్నారన్నారు. ఈ వ్యవస్థ ప్రజల్లో మారాలని చెప్పారు. విచ్చలవిడిగా యాంటీ బయోటిక్స్ వాడటం వలన అనారోగ్యానికి గురవుతారన్నారు. ఈ మందును తట్టుకునే కొత్తక్రిములు శరీరంలో తయారవుతాయని అన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్‌గారి సలహాతో తగిన మోతాదులో యాంటీబయోటిక్స్ వాడాలన్నారు. సమాజంలో వ్యాధి నిరోధకాన్ని నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రజలను చైతన్యపరచడానికి ఆంధ్రప్రదేశ్ ఫార్మశీ కౌన్సిల్, జిల్లా కెమిస్టు, డ్రగ్గిస్టు అసోసియేషన్, ఫార్మశీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా ఔషధ నియంత్రణ పరిపాలన, సహాయ సంచాలకులు నిర్వహించిన నినాదాల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ ర్యాలీ ఏడురోడ్ల కూడలి నుండి డే అండ్ నైట్ జంక్షన్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకుడు సిహెచ్.నాగ్‌కిరణ్‌కుమార్, ఔషధ తనిఖీ అధికారులు ఏ.కృష్ణ, లావణ్య, కళ్యాణి, జిల్లా కెమిస్టు అండ్ డ్రగ్గిస్టు సంఘం అధ్యక్షులు కరుణకుమార్ గుప్త, కార్యదర్శి మణిరాజు, ఫార్మశీ విద్యార్థులు పాల్గొన్నారు.