శ్రీకాకుళం

ఉపాధ్యాయుడి అరెస్టుతో క్రైం స్టేషన్‌ను ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 4: జిల్లా కేంద్రంలోని సెంట్రల్ క్రైంస్టేషన్‌ను మండలంలోని సంతకవిటి మండలం చిన్నవీధిపురం గ్రామానికి చెందిన ప్రజలు ముట్టడించారు. గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బొడ్డేపల్లి సన్యాసిరావును పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని మండల ప్రజలు ఆరోపిస్తూ ఉపాధ్యాయుడికి మద్దతుగా క్రైం పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేశారు. దొంగబంగారం కొనుగోలు చేశారనే ఆరోపణతో సిసిఎస్ పోలీసులు ఉపాధ్యాయుడిని స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. బంగారం దొంగిలించిన వ్యక్తులను ఇంటరాగేషన్ చేయగా, బంగారం కొనుగోలు చేశారని నిందితులు చెప్పిన మేరకు ఉపాధ్యాయుడిని తీసుకువచ్చినట్లు పోలీసులు చెప్పారు. ఏమీ ఎరుగని ఉపాధ్యాయుడిని స్టేషన్‌కు తీసుకురావడం అన్యాయమని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ క్రమంలో టిడిపి నాయకులు స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

యువకునిపై సినీ ఫక్కిలో హత్యాయత్నం
సారవకోట, ఏప్రిల్ 4: జిల్లాలోని లావేరు మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన బొమ్మలాట పృధ్వీరాజ్(30) అనే యువకుడిపై మండలంలోని రంగసాగరం చెరువు వద్ద నడిరోడ్డుపై సోమవారం రాత్రి హత్యాయత్నం జరిగిందని, బాధితుడు విశాఖపట్నం కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్నట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాదరావు తెలిపారు. బాధితుడు పృధ్వీరాజ్ శ్రీకాకుళం పట్టణం బలగ జంక్షన్‌లో కంప్యూటర్ కాటాలను మరమ్మతులు చేస్తూ జీవిస్తున్నారని, సోమవారం సాయంత్రం పాతపట్నంలో కొందరికీ ఈ కాటాలను అందజేసి మోటార్‌సైకిల్‌పై తిరిగి వస్తుండగా గుర్తు తెలియని ఇద్దర వ్యక్తులు రంగసాగరం చెరువు వద్ద అటకాయించి పృధ్వీరాజ్ తలపై కర్రతో కొట్టారని, ఈ దాడిలో పృధ్వీరాజ్ చెయ్యి విరిగిందన్నారు. దాడికి పాల్పడిన రెండవ వ్యక్తి బాధితుడు పృధ్వీరాజ్‌కు చాకుతో మెడపై కోశాడని తెలిపాడు. బాధితుడు సమీపంలో ఉన్న కోనావానిపేట గిరిజన గ్రామానికి చేరుకుని అక్కడ ప్రజల సహకారంతో 108వాహనంపై శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చగా మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారని ఎ ఐ దుర్గాప్రసాదరావు వివరించారు. ఈ దాడులకు బాధితుడి మామ రాజ్‌కుమార్ హస్తం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని, బాధితుడు ఉపయోగించిన మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఈ హత్యాయత్నం సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. సాయంత్రం సమయంలో ఇతర గ్రామాల నుండి ద్విచక్రవాహనాలపై ప్రయాణం చేయడానికి ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.